Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.
“తీవ్రంగా”– గొప్ప విషయాలను సాధించిన వాళ్ళకు కొన్ని సార్లు ప్రశంసలు దొరకవు. న్యాయాధిపతులు 12:1 కూడా చూడండి. వేరొకరి ద్వారా దేవుడు సాధించిన విజయాన్ని ఈ విమర్శకులు తమ స్వార్ధాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించలేకపోయారు.
2. అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
ఎఫ్రాయింవారు అంతంలో శత్రువును తరమడం (ఎఫ్రాయిం వారి “పరిగె”). తన ఆరంభ దాడి (అబీయెజెరు వారి “ద్రాక్షల పంట”) కంటే ఎంతో విలువైనదని గిద్యోను అంటున్నాడు. అబీయెజెరు గిద్యోను వంశం పేరు – న్యాయాధిపతులు 6:11.
3. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
“తగ్గిపోయింది”– సామెతలు 15:1. వారి హృదయాల్లో రగులుకుంటున్న అసూయాగ్నికి గిద్యోను ఆజ్యం పోయలేదు. మిద్యానువాళ్ళను తరిమే కార్యక్రమానికి ఆటంకం కలగడం అతనికి ఇష్టం లేదు. తనకు సహాయం వచ్చినవారితో వాగ్వాదంలో గెలవడం కన్నా శత్రువులపై యుద్ధం చేసి గెలవడం అతడికి ముఖ్యంగా తోచింది. ఇందుకోసం వారిని పొగిడేందుకైనా అతడు సిద్ధమే.
4. గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.
“అలసిపోయినా...తరుముతూనే”– క్రీస్తులో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇలాగే చెయ్యాలి. పౌలు కొన్ని సార్లు అలసిపోయేవాడు (2 కోరింథీయులకు 4:8-9 2 కోరింథీయులకు 7:5 మొ।।). అయినా తన గురి దగ్గరికి పరిగెత్తడం చాలించుకోలేదు (ఫిలిప్పీయులకు 3:13-14).
5. అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
“సుక్కోతు”– ఆదికాండము 33:17 యెహోషువ 13:27 1 రాజులు 7:46. ఇది యొర్దానుకు తూర్పు వైపున ఉన్న ఇస్రాయేల్ ఊరు. గిద్యోనుకూ తమకూ శత్రువులైన వారిని గిద్యోను నాశనం చేస్తుండగా ఆ ప్రయత్నాల్లో వీరు అతడికి సంతోషంగా చేయూత ఇవ్వవలసింది.
6. సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి.
7. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.
న్యాయాధిపతులు 5:23 పోల్చి చూడండి.
8. అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు
“పెనూయేల్”– ఆదికాండము 32:30-31 1 రాజులు 12:25. గిద్యోనును సహాయం చేసి ఉండవలసిన మరో ఇస్రాయేల్ ఊరు.
9. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను.
10. అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.
11. అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.
12. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.
13. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను
14. హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.
15. అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
దేవుని శత్రువులపై యుద్ధం చేసే దైవ సేవకులకు తోడ్పడకుండా ఉండడం ఎంతటి పాపమో ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. న్యాయాధిపతులు 5:23 నోట్ చూడండి.
16. ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.
17. మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.
18. అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా
19. అతడువారు నా తల్లి కుమా రులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల
20. యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
21. అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతోనీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.
“మమ్మల్ని పరిపాలించండి”– దేవుడు కాకుండా బలశాలి అయిన ఒక మనిషి తమను పరిపాలించాలని మనుషుల హృదయాల్లో సాధారణంగా ఉండే కోరికను వీరు బయట పెడుతున్నారు. 1 సమూయేలు 8:5-22 నోట్ చూడండి. ఈ ఇస్రాయేల్ వారు తమకు తెలియకుండానే భవిష్యత్తులో కనిపించబోయే చరిత్ర సత్యం ఒక దాన్ని అక్కడ చెప్పారు – ప్రజలకు మొదట మేలు చేసి వారి అభిమానం చూరగొన్నవాడు క్రమేణా నియంత అయి కూర్చోవచ్చు.
23. అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.
“నేను...పరిపాలించను”– నేటి క్రైస్తవుల్లో సహా చాలామంది ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని ఇతరులపై పెత్తనం చేయడానికి చూస్తారు. గిద్యోను సంగతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. “యెహోవాయే...పరిపాలిస్తాడు”– సంఖ్యాకాండము 23:21 1 సమూయేలు 12:12. ఇప్పుడు దేవుడు అంగీకరించిన సంఘ ముఖ్యాధికారి ఒక్కడే. ఆయన రాజైన యేసు క్రీస్తు (ఎఫెసీయులకు 1:22 ఎఫెసీయులకు 4:15 ఎఫెసీయులకు 5:23). ఆయన చెప్పిన ఉదాహరణలో ఉన్నవాళ్ళు మాట్లాడినట్టు ఆయన గురించి ఎవరన్నా మాట్లాడతారేమో జాగ్రత్త (లూకా 19:14).
24. మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
ఓడిపోయిన సైన్యంలో ఇష్మాయేల్వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
25. అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.
26. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.
27. కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
“ఏఫోదు”– నిర్గమకాండము 28:6-30 నిర్గమకాండము 39:2-26 లేవీయకాండము 8:7. “వేశ్యల్లాగా ప్రవర్తించారు”– వ 33,34. వారు దాన్ని ఆరాధించారన్న మాట. మనుషులు సాధారణంగా చేసినట్టే వీళ్ళు కూడా దేవుడు ఒకప్పుడు నియమించిన దాన్ని ఆయనకు విరుద్ధమైనదిగా మార్చేశారు. 2 రాజులు 18:4 పోల్చిచూడండి. నిజానికి వారి చరిత్ర అంతట్లో ఇస్రాయేల్లో చాలామంది దేవుని ధర్మశాస్త్రాన్నంతటినీ తారుమారు చేసి దాన్ని తమ స్వనీతికీ స్వఘనతకూ ఆలవాలం చేశారు.
28. మిద్యానీ యులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరు వాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినము లలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
29. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.
“యెరుబ్బయల్”– గిద్యోను (న్యాయాధిపతులు 6:32).
30. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.
“చాలా మంది భార్యలు”– ఈ మాదిరిని మనం అనుసరించాలని దేవుని ఉద్దేశం కాదు. ఆదికాండము 30:1 2 సమూయేలు 3:2-5 1 రాజులు 11:1-8 చూడండి.
31. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.
32. యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.
33. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక
8:33 “వేశ్యల్లాగా ప్రవర్తించారు”– నిర్గమకాండము 34:15 లేవీయకాండము 20:5 యిర్మియా 2:20 మొదలైన చోట్ల నోట్స్. “బయల్బెరీతు” అంటే “ఒడంబడిక ప్రభువు” అని అర్థం. ఒడంబడికను చెయ్యలేని, నెరవేర్చలేని ఒక అబద్ధ దేవుణ్ణి వారు పూజిస్తూ వారితో సజీవమైన ఒడంబడిక సంబంధం ఉన్న ఏకైక నిజ దేవుణ్ణి (నిర్గమకాండము 19:5-6) తృణీకరించారు. బయల్ గురించి నోట్ న్యాయాధిపతులు 2:11.
34. మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.
35. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.
దేవుని పట్ల కృతజ్ఞత లేనివారు ఆయన సేవకుల పట్ల కూడా ఎక్కువ కృతజ్ఞత చూపకపోవచ్చు.