Ruth - రూతు 1 | View All

1. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను.

“పరిపాలించే కాలం”– న్యాయాధిపతులు ఇస్రాయేల్‌ను 300 కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. “కరవు”– ఈ కరవును గురించి న్యాయాధిపతులు గ్రంథంలో రాసి లేదు. ప్రజలు తమ ఇళ్ళు, వారసత్వాలు వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయారంటే ఇది అతి దుర్భరమైన కరవై ఉండాలి. ఈ కరవుకు కారణమేదో ఇక్కడ రాసి లేదు. అయితే నాయకుల కాలంలో ప్రజలు తరుచుగా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఆజ్ఞలను మీరి విగ్రహాలను పూజించేవారు (న్యాయాధిపతులు 2:16-19). అందువల్ల ఈ కరవు రావడంలో ఆశ్చర్యం లేదు (లేవీయకాండము 26:25-26 ద్వితీయోపదేశకాండము 28:15 ద్వితీయోపదేశకాండము 28:23 ద్వితీయోపదేశకాండము 28:25 1 రాజులు 8:35 2 రాజులు 8:1 యిర్మియా 14:10-12 యిర్మియా 24:10 యెహెఙ్కేలు 5:16 యెహెఙ్కేలు 14:21 ఆమోసు 8:11).

2. ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.

“నయోమి”– ఈ హీబ్రూ పేరుకు “మనోహరం” అని అర్థం. “ఎఫ్రాతావారు”– ఎఫ్రాతా అనే ప్రాంతంలో బేత్‌లెహేం గ్రామం ఉంది – మీకా 5:2. “మోయాబు”– మోయాబు గురించి నోట్ ఆదికాండము 19:36-38. లోత్ సంతానం అయిన మోయాబువాళ్ళు ఇస్రాయేల్‌వారికి దాయాదులౌతారు.

3. నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.

4. వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.

5. వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.

6. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.

“భోజనం ప్రసాదించాడని”– ఇస్రాయేల్‌లో మళ్ళీ వానలూ మంచి పంటలూ దేవుడిచ్చాడు. “తిరిగి వెళ్ళడానికి”– నయోమి ఆమె కోడళ్ళు యూదాకు వెళ్ళిపోదామని ముందు నిర్ణయించుకుని ఉన్నట్టుంది. అయితే బయలుదేరిన తరువాత నయోమి తన మనస్సు మార్చుకుని ఉండవచ్చు. బహుశా భర్తలను కోల్పోయిన ఆ ఇద్దరు మోయాబు అమ్మాయిలకు ఇస్రాయేల్‌లో భవిష్యత్తు లేదని ఆమెకు అనిపించి ఉండవచ్చు.

7. అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా

8. నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;

“నామీద”– రూతు 2:11-12 కీర్తనల గ్రంథము 18:25-26 కీర్తనల గ్రంథము 62:12 పోల్చి చూడండి. మనం ఇతరుల పట్ల దయ చూపకుండా ఉంటే దేవుడు మనపట్ల దయ చూపాలనుకోవడం పొరపాటు. ఒక విధంగా చూస్తే ఈ రూతు పుస్తకం దయ చూపడం, దాని వల్ల కలిగే ప్రతిఫలం గురించి చెప్తూ ఉంది (వ 8; రూతు 2:11-12 రూతు 2:15 రూతు 2:20 రూతు 3:10). దయ గురించి 1 కోరింథీయులకు 13:4 ఎఫెసీయులకు 4:22 చూడండి.

9. మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందు నట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.

10. అంతట వారు ఎలుగెత్తి యేడ్చినీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా

11. నయోమినా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా?

“భర్తలు”– ద్వితీయోపదేశకాండము 25:5-6 చూడండి. దీనికి ఒక ఉదాహరణ ఆదికాండము 38:6-11 లో ఉంది.

12. నా కుమార్తె లారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను

13. వారు పెద్ద వారగువరకు వారి కొర కు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.

“వ్యతిరేకంగా”– వ 20,21; న్యాయాధిపతులు 2:15 యోబు 19:21. బేత్‌లెహేంలో కరవువల్ల తాను పడ్డ బాధలు, తన భర్త, కొడుకులు పోవడమూ ఇదంతా దేవుడు తనకు వ్యతిరేకం అయినందువల్లనని ఆమె భావించింది. అయితే ఇది నిజం కాకపోవచ్చు. యోబు 6:4 యోబు 7:17-19 యోబు 19:21-22 నోట్స్ చూడండి. వ్యక్తులకు కలిగే బాధలు దేవుడు పంపే శిక్షలు కావచ్చు, కాకపోవచ్చు కూడా. అది ఎలా ఉన్నా ఆ కష్టాల వెనుక దీవెనలు దాగి ఉండవచ్చు. దేవుడు వాటిని గొప్ప మేలుకోసం ఉద్దేశించి ఉండవచ్చు. ఆదికాండము 50:20 నోట్స్ చూడండి.

14. వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పాతన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా

15. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయి నదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.

“దేవుళ్ళు”– మోయాబువాళ్ళు విగ్రహాలను పూజించేవాళ్ళు. వాళ్ళ ఇలవేలుపు కెమోష్ (1 రాజులు 11:7 నోట్‌).

16. అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;

“నాకు దేవుడుగా”– ఈ మాటలు రూతును గురించి, నయోమిని గురించి కూడా సదభిప్రాయం కలుగజేస్తున్నాయి. రూతు తన అత్తపట్ల నిస్వార్థమైన, విశ్వాస పాత్రమైన ప్రేమ చూపింది; నయోమి అయితే తన జీవిత విధానాన్ని బట్టి తన పట్ల, తాను ఆరాధించే దేవుని పట్ల తన కోడలుకు మంచి అభిప్రాయం కలిగేలా చేసింది గనుక పై మాటలు వీరిద్దరి విషయంలోనూ మంచి సాక్ష్యాన్ని పలుకుతున్నాయి. రూతు తన మాతృభూమిని, తల్లిదండ్రులను (రూతు 2:11), తన దేవుళ్ళను వదిలి తెలియని చోటికి నయోమితో బయలుదేరింది. యేసుప్రభువు విషయంలో మన నిశ్చయం ఎలా ఉండాలో తెలియజేసే ఉదాహరణ ఇది – మత్తయి 4:18-22 యోహాను 6:66-68 లూకా 14:33.

17. నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.

2 సమూయేలు 15:21 చూడండి.

18. తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.

19. వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

నయోమి బేత్‌లెహేం వదిలి కనీసం 10 సంవత్సరాలైంది (వ 4). ఆమె తన భర్తను, కొడుకుల్ని కోల్పోయింది. ఆ వేదన తప్పనిసరిగా ఆమె ముఖంపై నీలినీడలు మిగిల్చి ఉండాలి.

20. ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి1 అనక మారా2 అనుడి.

“మారా”– ఈ హీబ్రూ పేరుకు “చేదు” అని అర్థం. ఇక్కడ నయోమి అంటున్నది – “నన్ను ‘మనోహరం’ అనకండి, ‘చేదు’ అనండి”, అంటే ఆమె అనుభవాలవల్ల ఆమె శోకంతో నిండిపోయింది. అంతేగాని దేవుని పట్ల ఆమెలో కసి ఉందని కాదు. నయోమిలో దేవుని పట్ల అలాంటి కసే గనుక ఉండి ఉంటే, ఆమె దేవుణ్ణి తన దేవుణ్ణిగా చేసుకునేందుకు రూతుకు ఇష్టం కలిగేది కాదు (వ 16). మారా గురించి నిర్గమకాండము 15:23-25 చూడండి.

21. నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.

“ఏమీ లేకుండా”– ఆమె వెళ్ళిపోయినప్పుడు భర్త, కొడుకులు ఆమెకు ఉన్నారు. ఆశాభావం ఉంది. “ఆపద”– వ 13; యోబు 30:11 కీర్తనల గ్రంథము 88:7 విలాపవాక్యములు 3:1.

22. అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.

“కోత...సమయం”– ఇస్రాయేల్‌లో ఆ రోజుల్లో ఇది ఇప్పటి ఏప్రిల్ నెల అయి ఉండవచ్చు.Shortcut Links
రూతు - Ruth : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |