Samuel I- 1 సమూయేలు 16 | View All

1. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
లూకా 3:31-32

“ఎంతకాలం”– సమూయేలు దుఃఖపడడం తప్పేమీ కాదు. దేవుడే సౌలు విషయం పరితాపపడ్డాడు గదా (1 సమూయేలు 15:35). అయితే సమూయేలు దుఃఖించినంత మట్టుకు చాలు. చెయ్యవలసిన పని ఉంది. దేవుని సేవకుడు ఎవరైనా తన వ్యక్తిగతమైన దుఃఖం మూలంగా సేవకు సంబంధించిన భాద్యతలను విస్మరించరాదు. “యెష్షయి”– రూతు 4:18-22.

2. సమూయేలునేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవానీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

సౌలు చపలత్వం తెలిసిన విషయమై ఉన్నట్టుంది. అతనిలో పగ, ద్రోహం, విశ్వాసఘాతుకం రగులుకొన్నాయి (1 సమూయేలు 19:1 1 సమూయేలు 19:9-11 1 సమూయేలు 22:18-19). సమూయేలుకు చావు భయం పట్టుకున్నదని భావించడానికి ఆస్కారం లేదు. కానీ దేవుడు ఆజ్ఞను ఎలా పాటించాలా అన్న ఆలోచనలో పడ్డాడు.

3. యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా

“చేయవలసింది”– మనం దేవునికి విధేయత చూపసాగినప్పుడు అనుక్షణమూ ఆయన మార్గం చూపుతూ ఉంటాడు (కీర్తనల గ్రంథము 25:9 కీర్తనల గ్రంథము 3:6 యెషయా 30:21 యెషయా 58:10-11).

4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లె హేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిసమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఎల్లప్పుడు ఒక ప్రవక్తను సంతోషంతో స్వీకరించలేదు. బేత్లెహేము ఊరి పెద్దల అంతర్వాణి ఏ విషయంలోనన్నా వారిని గద్దించిందా?

5. అతడుసమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.

6. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను

దీర్ఘదర్శి సమూయేలు కూడా పైపై చూపులకు మోసపోయాడు చూశారా. 1 సమూయేలు 9:19 చూడండి.

7. అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
మత్తయి 12:25, మత్తయి 22:18, మార్కు 2:8, లూకా 6:8, లూకా 11:17, యోహాను 2:25

8. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడుయెహోవా ఇతని కోరుకొన లేదనెను.

9. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.

10. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలుయెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి

11. నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

“గొర్రెలు”– ఇస్రాయేల్‌కు కాపరిగా ఉండేందుకు దేవుడు ఎన్నుకొన్నవాడు ఒక గొర్రెల కాపరి – కీర్తనల గ్రంథము 78:71-72. కాపరి మనస్తత్వం గల మరొక మహనీయునికి ఈ కాపరి ఒక సూచన (యోహాను 10:11-16 హెబ్రీయులకు 13:20).

12. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా
అపో. కార్యములు 13:22

అయితే అతని అందచందాలను చూచి కాదు దేవుడు అతణ్ణి ఎన్నుకున్నది (1 సమూయేలు 13:14).

13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
అపో. కార్యములు 13:22

“అన్నలు”– దావీదును తానెందుకు అభిషేకించాడో సమూయేలుకు తెలుసు (వ 1). అయితే మనకు తెలిసినంత వరకు ఆ సమయంలో అలా అభిషేకించడానికి కారణాలేవీ సమూయేలు చెప్పలేదు. దావీదుకైతే తానో ప్రత్యేక ఉద్దేశం నిమిత్తం ప్రత్యేకించబడ్డాడని తెలుసు. సౌలును అభిషేకించి నట్టుగానే దేవుని ఆత్మ తానే దావీదును రాజుగా అభిషేకించిన విషయం చూడండి (1 సమూయేలు 10:10).

14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా

“యెహోవా ఆత్మ”– దేవుని ఆత్మ సౌలును రాజుగా అభిషేకించాడు. ఇప్పుడతడు రాజుగా తిరస్కరించబడ్డాడు గనుక ఆత్మ అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు. అయితే వ్యక్తిగతంగా సౌలు పాపవిముక్తి పొందాడా లేదా అన్న విషయంలో ఇక్కడ దీనికి సంబంధం లేదు. ఇది రాజు పదవికే సంబంధించిన విషయం. “దురాత్మ”– 1 సమూయేలు 18:10 న్యాయాధిపతులు 9:23 1 రాజులు 22:19-23 యోబు 1:12 యోబు 2:6 మార్కు 5:11-13 2 కోరింథీయులకు 12:7. దురాత్మలు తమ ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి వీలు లేదు. తమ కార్యకలాపాలను నిర్వహించు కొనేందుకు దేవుని అనుమతి కావాలి (దుర్మార్గులు కూడా దేవుని పరిపాలన కింద ఉంటారు). దేవుడు కొందరు మనుషులపైకి వారి పాపాలకు శిక్షగా ఇలాంటి దురాత్మలను పంపుతూ ఉంటాడు. “వేధించసాగింది”– ఇలా చెయ్యడం దురాత్మలకు మహా ఇష్టం (యోబు 2:7 మార్కు 5:1-5 మార్కు 9:20-22 లూకా 13:11 లూకా 13:16). సౌలు విషయంలో ఈ వేధింపు మానసిక యాతన రూపంలో ఉంది.

15. సౌలు సేవకులుదేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;

16. మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచా రించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి

17. సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు

18. చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరు డును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియయెహోవా వానికి తోడుగా నున్నాడనగా

దావీదును రాజు స్థానంలోకీ, ఇస్రాయేల్ అంతటికీ గొప్ప ప్రఖ్యాతిలోకీ తెచ్చేందుకు దేవుడు ఎన్నుకున్న మార్గం ఇది.

19. నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను.

20. అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.

21. దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.

సామెతలు 22:29. “మోసేవాళ్ళలో ఒకడు”– బహుశా దావీదు గొల్యాతును ఓడించిన తరువాత ఈ నియామకం జరిగి ఉండవచ్చు.

22. అంతట సౌలుదావీదు నా అను గ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను.

23. దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.

మంచి సంగీతం మనసుపై మంచి ప్రభావాన్ని చూపగలదు. చెడు సంగీతం (దీనికి నేటి లోకంలో కొదువ లేదు) దాన్ని వినేవాళ్ళ పై చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది.Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |