Samuel I- 1 సమూయేలు 2 | View All

1. మరియహన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.
లూకా 1:46-47

2. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.

3. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.

4. ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురుతొట్రిల్లినవారు బలము ధరించుదురు.

5. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.
లూకా 1:53

6. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.

7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
లూకా 1:52

8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.

9. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

10. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
లూకా 1:69

11. తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.

12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.

13. జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి

14. బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.

15. ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.

16. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చి నంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడుఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేని యెడల బలవంతముచేత తీసికొందుననును.

17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ ¸యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.

18. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.

19. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను.

20. యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.

21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.

22. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను

23. ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?

24. నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు.

25. నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.

26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.
లూకా 2:52

27. అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.

28. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.

29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.

30. నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.

31. ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును.

32. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు.

33. నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.

34. నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.

35. తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.

36. అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel I- 1 సమూయేలు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

హన్నా థాంక్స్ గివింగ్ పాట. (1-10) 
హన్నా హృదయం ఆనందంతో పొంగిపోయింది, సమూయేలు కోసం కాదు, ప్రభువు కోసం. ఆమె బహుమతిని మించి చూసింది మరియు దాతని ప్రశంసించింది. ఆమె సంతోషం ప్రభువు యొక్క రక్షణలో ఉంది, తన ప్రజలకు పూర్తి విమోచనగా ఉన్న వ్యక్తి యొక్క రాకడ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేవుని సమయములో బలవంతులు తగ్గించబడతారు, బలహీనులు బలపరచబడతారు.
మనం పేదరికంలో ఉన్నా, అది దేవుని రూపకల్పన ప్రకారం, మన పరిస్థితులలో సంతృప్తి మరియు అంగీకారం పొందాలి. మరియు మనం ఐశ్వర్యంతో ఆశీర్వదించబడినట్లయితే, మనం కృతజ్ఞతతో ఉల్లాసమైన హృదయంతో ఆయనకు సేవ చేయాలి, మన సమృద్ధిని మంచి చేయడానికి ఉపయోగిస్తాము.
మానవ జ్ఞానం లేదా గ్రహించిన శ్రేష్ఠత ఆధారంగా దేవుడు తీర్పు తీర్చడు; బదులుగా, ప్రపంచం మూర్ఖులుగా భావించే వారిని ఎంచుకుంటాడు, వారి అపరాధాన్ని గుర్తించమని మరియు అతని ఉచిత మరియు విలువైన మోక్షాన్ని అభినందించమని వారికి బోధిస్తాడు.
ఈ ప్రవచనం దేవుని ప్రావిడెన్షియల్ పాలన గురించి విస్తృతంగా మాట్లాడిన తర్వాత హన్నా సూచించిన దయ యొక్క రాజ్యమైన క్రీస్తు పాలనను సూచిస్తుంది. ఇక్కడే మనం అభిషిక్తుడైన "మెస్సియా" అనే పేరును ఎదుర్కొంటాము. క్రీస్తు పాలనలో, అతని ప్రజలు సురక్షితంగా ఉంటారు, అతని శత్రువులు నాశనాన్ని ఎదుర్కొంటారు, ఎందుకంటే అభిషిక్తుడైన క్రీస్తు ప్రభువు రక్షించడానికి మరియు నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాడు.

ఏలీ కుమారుల దుర్మార్గం, సమూయేలు పరిచర్య. (11-26) 
సమూయేలు, చిన్న వయస్సు నుండి, ప్రత్యేకంగా ప్రభువుకు అంకితం చేసి, అభయారణ్యంలో సేవ చేస్తూ, వివిధ పనులకు తన సామర్థ్యాలను అందించాడు. పవిత్రమైన హృదయంతో, ఈ సేవను ప్రభువుకు పరిచర్య చేయడంగా పేర్కొనబడింది మరియు దాని కోసం అతను ఆశీర్వదించబడ్డాడు. దేవుడు తనను హృదయపూర్వకంగా సేవించే యువకులను ఎనేబుల్ చేసి, వారిని మరింత మెరుగ్గా ఎదగడానికి మరియు సేవ చేయడానికి వీలు కల్పిస్తాడు.
మరోవైపు, ఎలీ ఇబ్బందులను మరియు శ్రమను నివారించాడు, ఇది అతని పిల్లలతో మృదువుగా ఉండటానికి దారితీసింది, వారు చిన్నతనంలో వారికి మార్గదర్శకత్వం మరియు క్రమశిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రుల అధికారాన్ని ఉపయోగించడంలో విఫలమయ్యారు. అతను అభయారణ్యం యొక్క సేవలోని దుష్ప్రవర్తనకు కళ్ళు మూసుకున్నాడు, వాటిని ఆచార పద్ధతులుగా మార్చడానికి అనుమతించాడు మరియు చివరికి అసహ్యకరమైన చర్యలకు దారితీశాడు. అతని కుమారులు మంచితనాన్ని బోధించే బదులు, అభయారణ్యం సేవలో పాల్గొన్న వారిలో దుష్టత్వాన్ని ప్రోత్సహించారు. రక్షకుని ప్రాయశ్చిత్తానికి ప్రతీకగా నిలిచిన పాపాలకు బలులు అర్పించే వరకు కూడా వారి తప్పు విస్తరించింది. పరిహారానికి వ్యతిరేకంగా పాపాలు చేయడం, ప్రాయశ్చిత్తం చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది ఒడంబడిక రక్తం యొక్క ప్రాముఖ్యతను విస్మరించడం.
అతిక్రమాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఎలీ యొక్క మందలింపులు చాలా సున్నితంగా మరియు మృదువుగా ఉన్నాయి. ఒక సాధారణ పరిశీలనగా, భక్తిగల వ్యక్తుల సంతానం వారు నైతిక పరిమితుల నుండి విముక్తి పొందినప్పుడు తరచుగా మరింత అవినీతికి గురవుతారు.

ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవచనం. (27-36)
తమ పిల్లలు తప్పు దారిలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడంలో మరియు క్రమశిక్షణ ఇవ్వడంలో విఫలమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని కంటే గొప్ప గౌరవాన్ని చూపుతారు. ఎలీ యొక్క ఉదాహరణ తల్లిదండ్రులకు చెడ్డతనం యొక్క ప్రారంభ సంకేతాలను తీవ్రంగా ప్రతిఘటించడానికి మరియు బదులుగా వారి పిల్లలను ప్రభువు మార్గాల్లో పెంచడానికి, వారికి మార్గదర్శకత్వం మరియు దిద్దుబాటును అందించడానికి శక్తివంతమైన రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.
ఏలీ ఇంటిపై తీర్పును ప్రకటించే సమయంలో కూడా, దేవుడు ఇజ్రాయెల్‌పై దయ చూపాడు. అతని పనిని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న చేతులు లేకపోవడం వల్ల ఎప్పటికీ కుంటుపడదు. దయగల మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడైన క్రీస్తు, లేవీయుల యాజకత్వాన్ని పక్కనపెట్టినప్పుడు దేవుని చేత లేపబడ్డాడు. అతను తన తండ్రి చిత్తాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాడు మరియు అతనిపై, దేవుడు ఒక కొండపై నిర్మించిన స్థిరమైన ఇంటిని స్థాపించాడు, అది నరకం యొక్క శక్తులకు లోబడి ఉండదు.



Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |