Samuel I- 1 సమూయేలు 20 | View All

1. పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారి పోయి యోనాతాను నొద్దకు వచ్చినేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని యడుగగా

1. pimmaṭa daaveedu raamaalōni naayōthunuṇḍi paari pōyi yōnaathaanu noddhaku vachinēnu ēmi chesithini? Nēnu chesina dōshamēmi? Naa praaṇamu theeya vedakunaṭlu nee thaṇḍri drushṭiki nēnu chesina paapamēmani yaḍugagaa

2. యానాతానుఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా

2. yaanaathaanu'aa maaṭa neevennaṭikini anukonavaddu, neevu chaavavu; naaku teliyajēyakuṇḍa naa thaṇḍri chinna kaaryamē gaani peddakaaryamēgaani cheyaḍu; naa thaṇḍri idenduku naaku marugucheyunanagaa

3. దావీదునేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా

3. daaveedunēnu nee drushṭiki anukooluḍananu saṅgathi nee thaṇḍri rooḍhigaa telisikoni, yōnaathaanunaku chintha kalugakuṇḍuṭakai yidi athaniki telupananukonuchunnaaḍu; ayithē yehōvaa jeevamuthooḍu nee jeevamuthooḍu nijamugaa naakunu maraṇamunakunu aḍugu maatramunnadani pramaaṇamu cheyagaa

4. యోనాతానునీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదు ననెను.

4. yōnaathaanuneekēmi thoochunō daaninē nēnu nee yeḍala jarupudu nanenu.

5. అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.

5. anduku daaveedurēpaṭidinamu amaa vaasya; appuḍu nēnu thappaka raajuthookooḍa koorchuṇḍi bhōjanamu cheyavalenu; ayithē elluṇḍi saayantramuvaraku chenilō daaguṭaku naaku selavimmu.

6. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించుమర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.

6. inthalō nee thaṇḍri nēnu lēkapōvuṭa kanugonagaa neevu ee maaṭa cheppavalenu. daaveedu iṇṭivaariki ēṭēṭa bali chellin̄chumaryaada kaddu. Kaabaṭṭi athaḍu bētlehēmanu thana paṭṭaṇamunaku pōvalenani nannu brathimaali naayoddha selavupuchu konenu.

7. అతడుమంచిదని సెలవిచ్చిన యెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యము గలవాడై యున్నాడని నీవు తెలిసికొని

7. athaḍuman̄chidani selavichina yeḍala nee daasuḍanaina naaku kshēmamē kalugunu; athaḍu bahugaa kōpin̄chinayeḍala athaḍu naaku keeḍucheya thaatparyamu galavaaḍai yunnaaḍani neevu telisikoni

8. నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండిన యెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా

8. nee daasuḍanaina naaku oka upakaaramu cheyavalenu; ēmanagaa yehōvaa pēraṭa neethoo nibandhana cheyuṭakai neevu nee daasuḍanaina nannu rappin̄chithivi; naayandu dōshamēmaina uṇḍina yeḍala nee thaṇḍriyoddhaku nannenduku thooḍukoni pōduvu? neevē nannu champumani yōnaathaanunoddha manavi cheyagaa

9. యోనాతానుఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా

9. yōnaathaanu'aa maaṭa ennaṭikini anaraadu; naa thaṇḍri neeku keeḍucheya nuddheshamu galigiyunnaaḍani naaku nishchayamaithē neethoo teliyajeppudunu gadaa ani anagaa

10. దావీదునీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను.

10. daaveedunee thaṇḍri nannugoorchi neethoo kaṭhinamugaa maaṭalaaḍinayeḍala daani naaku teliyajēyuvaarevarani yōnaathaanu naḍigenu.

11. అందుకు యోనాతానుపొలము లోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి.

11. anduku yōnaathaanupolamu lōniki veḷludamu rammanagaa, iddarunu polamulōniki pōyiri.

12. అప్పుడు యోనాతానుఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా?

12. appuḍu yōnaathaanu'ishraayēleeyulaku dhevuḍaina yehōvaa saakshi; rēpainanu elluṇḍiyainanu ee vēḷappuḍu naa thaṇḍrini shōdhinthunu; appuḍu daaveedunaku kshēma mavunani nēnu telisikoninayeḍala nēnu aa varthamaanamu neeku pampaka pōvudunaa?

13. అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక.

13. ayithē naa thaṇḍri neeku keeḍucheya nuddheshin̄chuchunnaaḍani nēnu telisikoninayeḍala daani neeku teliyajēsi neevu kshēmamugaa veḷlunaṭlu ninnu pampivēyaniyeḍala yehōvaa naaku goppa apaayamu kalugajēyugaaka. Yehōvaa naa thaṇḍriki thooḍugaa uṇḍinaṭlu neekunu thooḍugaa uṇḍunugaaka.

14. అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన యెడలనేమి,

14. ayithē nēnu bradhikiyuṇḍinayeḍala nēnu chaavakuṇḍa yehōvaa dayachoopunaṭlugaa neevu naaku dayachoopaka pōyina yeḍalanēmi,

15. నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయిన యెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక.

15. nēnu chanipōyinayeḍala yehōvaa daaveedu shatruvulanu okaḍaina bhoomimeeda niluvakuṇḍa nirmoolamu chesina tharuvaatha neevu naa santhathivaariki daya choopaka pōyina yeḍalanēmi yehōvaa ninnu visarjin̄chunu gaaka.

16. ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.

16. eelaaguna yehōvaa daaveeduyokka shatruvula chetha daani vichaarin̄chunaṭlugaa yōnaathaanu daaveedu santhathivaarini baṭṭi nibandhana chesenu.

17. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.

17. yōnaathaanu daaveedunu thana praaṇasnēhithunigaa prēmin̄chenu ganuka aa prēmanubaṭṭi daaveeduchetha marala pramaaṇamu cheyin̄chenu.

18. మరియయోనాతాను దావీదుతో ఇట్లనెనురేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;

18. mariyu yōnaathaanu daaveeduthoo iṭlanenurēpaṭidinamu amaavaasya; nee sthalamu khaaḷigaa kanabaḍunu gadaa;

19. నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగు చుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము

19. neevu mooḍu dinamulu aagi, yee pani jarugu chuṇḍagaa neevu daagiyunna sthalamunaku tvaragaa veḷli ēselu anubaṇḍa daggara nuṇḍumu

20. గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి

20. guri chuchi prayō gin̄chinaṭṭu nēnu mooḍu baaṇamulanu daani prakkaku koṭṭi

21. నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదునుబాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపా యమును రాక క్షేమమే కలుగును.

21. neevu veḷli baaṇamulanu vedakumani oka panivaanithoo cheppudunubaaṇamulu neeku ee thaṭṭuna nunnavi, paṭṭukoni rammani nēnu vaanithoo cheppinayeḍala neevu bayaṭiki raavachunu; yehōvaa jeevamuthooḍu neeku ē apaa yamunu raaka kshēmamē kalugunu.

22. అయితేబాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.

22. ayithēbaaṇamulu neeku avathala nunnavani nēnu vaanithoo cheppinayeḍala paaripommani yehōvaa selavichuchunnaaḍani telisikoni neevu prayaaṇamai pōvalenu.

23. అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.

23. ayithē manamiddharamu maaṭalaaḍina saṅgathini gnaapakamu chesikonumu; neekunu naakunu sarvakaalamu yehōvaayē saakshi.

24. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా

24. kaabaṭṭi daaveedu polamulō daagukonenu; amaavaasya vachinappuḍu raaju bhōjanamu cheyakoorchuṇḍagaa

25. మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.

25. munupaṭivalenē raaju gōḍadaggara nunna sthalamandu thana aasanamumeeda koorchuniyuṇḍenu. Yōnaathaanu lēvagaa abnēru saulunoddha koorchuṇḍenu; ayithē daaveedu sthalamu khaaḷigaa nuṇḍenu.

26. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.

26. ayinanu athaniki ēdō okaṭi sambhavin̄chinanduna athaḍu apavitruḍai yuṇḍunēmō, athaḍu apavitruḍai yuṇḍuṭa yavashyamani saulu anukoni aa dinamuna ēmiyu analēdu.

27. అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలునిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాక పోవుట ఏమని యోనాతాను నడుగగా

27. ayithē amaavaasya pōyina marunaaḍu, anagaa reṇḍava dinamuna daaveedu sthalamulō evaḍunu lēkapōvuṭa chuchi sauluninnayu nēḍunu yeshshayi kumaaruḍu bhōjanamunaku raaka pōvuṭa ēmani yōnaathaanu naḍugagaa

28. యోనా తానుదావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి

28. yōnaa thaanudaaveedu bētlehēmunaku pōvalenani kōri

29. దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారునీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతి మాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా

29. dayachesi nannu pōnimmu, paṭṭaṇamandu maa yiṇṭivaaru bali arpimpabōvuchunnaaruneevunu raavalenani naa sahōdaruḍu naaku aagnaapin̄chenu ganuka nee drushṭiki nēnu daya pondina vaaḍanaithē nēnu veḷli naa sahōdarulanu darshin̄chunaṭlugaa naaku selavimmani brathi maalukoni naayoddha selavu theesikonenu; andu nimitthamē athaḍu raaju bhōjanapu balla yoddhaku raalēdani sauluthoo cheppagaa

30. సౌలు యోనా తానుమీద బహుగా కోపపడి-ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి నది కాదా?

30. saulu yōnaa thaanumeeda bahugaa kōpapaḍi-aagaḍagoṭṭudaani koḍukaa, neekunu nee thalli maanamunakunu siggukalugunaṭlugaa neevu yeshshayi kumaaruni sveekarin̄china saṅgathi naaku telisi nadhi kaadaa?

31. యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.

31. yeshshayi kumaaruḍu bhoomimeeda bradukunantha kaalamu neekainanu nee raajyamunakainanu sthiratha kalugadu gadaa; kaabaṭṭi neevu varthamaanamu pampi athanini naa daggaraku rappin̄chumu, nijamugaa athaḍu maraṇamuna kar'huḍani cheppenu.

32. అంతట యోనాతాను అత డెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

32. anthaṭa yōnaathaanu atha ḍenduku maraṇa shiksha nondavalenu? Athaḍu ēmi chesenani saulu naḍugagaa

33. సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనా తాను తెలిసికొని

33. saulu athanini poḍuvavalenani yeeṭe visirenu; anduvalana thana thaṇḍri daaveedunu champanuddheshamu galigiyunnaaḍani yōnaa thaanu telisikoni

34. అత్యాగ్రహుడై బల్ల యొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.

34. atyaagrahuḍai balla yoddhanuṇḍi lēchi, thana thaṇḍri daaveedunu avamaanaparachinanduna athani nimitthamu duḥkhaakraanthuḍai amaavaasya pōyina marunaaḍu bhōjanamu cheyakuṇḍenu.

35. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసి కొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.

35. udayamuna yōnaathaanu daaveeduthoo nirṇayamuchesi konina vēḷaku oka panivaani piluchukoni polamulōniki pōyenu.

36. నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణ ములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.

36. neevu parugetthikonipōyi nēnu vēyu baaṇa mulanu vedakumani aa panivaanithoo athaḍu cheppagaa vaaḍu parugetthuchunnappuḍu athaḍu oka baaṇamu vaani avathalaku vēsenu.

37. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చి నప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి-బాణము నీ అవతలనున్నదని చెప్పి

37. ayithē vaaḍu yōnaathaanu vēsina baaṇamu unnachooṭunaku vachi nappuḍu yōnaathaanu vaani venukanuṇḍi kēka vēsi-baaṇamu nee avathalanunnadani cheppi

38. వాని వెనుక నుండి కేకవేసినీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెను గాని

38. vaani venuka nuṇḍi kēkavēsineevu aalasyamu cheyaka dabbuna rammanenu; yōnaathaanu panivaaḍu baaṇamulanu koorchukoni thana yajamaanuniyoddhaku vaaṭini theesikoni vacchenu gaani

39. సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.

39. saṅgathi ēmiyu vaaniki teliyaka yuṇḍenu. Yōnaathaanunakunu daaveedunakunu maatramu aa saṅgathi telisi yuṇḍenu.

40. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చివీటిని పట్టణ మునకు తీసికొని పొమ్మని చెప్పి వాని పంపివేసెను.

40. yōnaathaanu thana aayudhamulanu vaani chethikichiveeṭini paṭṭaṇa munaku theesikoni pommani cheppi vaani pampivēsenu.

41. వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

41. vaaḍu veḷlipōyina veṇṭanē daaveedu dakshiṇapu dikkunuṇḍi bayaṭiki vachi mooḍu maarulu saashṭaaṅga namaskaaramu chesina tharavaatha vaaru okarinokaru muddupeṭṭukonuchu ēḍchuchuṇḍiri. eelaa guṇḍagaa daaveedu marintha biggaragaa ēḍchenu.

42. అంతట యోనాతానుయెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మన స్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.
మార్కు 5:34

42. anthaṭa yōnaathaanuyehōvaa neekunu naakunu madhyanu nee santhathikini naa santhathikini madhyanu ennaṭennaṭiki saakshigaa nuṇḍunugaaka. Manamiddharamu yehōvaa naamamunu baṭṭi pramaaṇamu chesikoni yunnaamu ganuka mana ssulō nemmadhi galigi pommani daaveeduthoo cheppagaa daaveedu lēchi veḷlipōyenu; yōnaathaanunu paṭṭaṇamunaku thirigi vacchenu.Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |