రెండు విషయాలను బట్టి తనకు ప్రజలు విశ్వాస పాత్రులుగా ఉండాలని సౌలు అంటున్నాడు. గోత్రం సంబంధం మమకారం (సౌలు బెన్యామీను వంశస్థుడు, దావీదు యూదా వంశస్థుడు), ఇహలోక సంబంధమైన సంగతులు (అంటే ఆస్తులు, అధికారాలు). దుఃఖకరమైన విషయమేమిటంటే ఇప్పటికీ తరచుగా కులం, డబ్బు ఇవి రెండే గదా క్రైస్తవ సమాజంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి! నిజమైన దైవసేవకులైనవారికి ఇవి ఘోరమైన తెగుల్లాంటివి గదా అని వీటిని చాలా దూరంగా ఉంచాలి.