Samuel I- 1 సమూయేలు 25 | View All

1. సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.

1. Samuel died. The whole nation of Israel gathered together. They were filled with sorrow because he was dead. They buried his body at his home in Ramah. Then David went down into the Desert of Maon.

2. కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.

2. A certain man in Maon was very wealthy. He owned property there at Carmel. He had 1,000 goats and 3,000 sheep. He was clipping the wool off the sheep in Carmel.

3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతి వాడు.

3. His name was Nabal. His wife's name was Abigail. She was a wise and beautiful woman. But her husband was rude and mean in the way he treated others. He was from the family of Caleb.

4. నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని

4. David was staying in the Desert of Maon. While he was there, he heard that Nabal was clipping the wool off his sheep.

5. తన పని వారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెనుమీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి

5. So he sent for ten young men. He said to them, 'Go up to Nabal at Carmel. Greet him for me.

6. ఆ భాగ్యవంతునితోనీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను.

6. Say to him, 'May you live a long time! May everything go well with you and your family! And may things go well with everything that belongs to you!

7. నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;

7. 'I hear that you are clipping the wool off your sheep. When your shepherds were with us, we treated them well. The whole time they were at Carmel nothing that belonged to them was stolen.

8. నీ పని వారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితివిు గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.

8. Ask your own servants. They'll tell you. We've come to you now at a happy time of the year. Please show favor to my young men. Please give me and my men anything you can find for us.' '

9. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా

9. When David's men arrived, they gave Nabal the message from David. Then they waited.

10. నాబాలు - దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.

10. Nabal answered David's servants, 'Who is this David? Who is this son of Jesse? Many servants are running away from their masters these days.

11. నేను సంపాదించుకొనిన అన్నపానము లను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా

11. Why should I give away my bread and water? Why should I give away the meat I've prepared for those who clip the wool off my sheep? Why should I give food to men who come from who knows where?'

12. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి.

12. So David's men turned around and went back. When they arrived, they reported to David every word Nabal had spoken.

13. అంతట దావీదు వారితోమీరందరు మీ కత్తులను ధరించుకొను డనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.

13. David said to his men, 'Put on your swords!' So they put their swords on. David put his on too. About 400 men went up with David. Two hundred men stayed behind with the supplies.

14. పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా, దావీదు అరణ్యములో నుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట లాడెను.

14. One of the servants warned Nabal's wife Abigail. He said, 'David sent some messengers from the desert to give his greetings to our master. But Nabal shouted at them and made fun of them.

15. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు.

15. 'David's men had been very good to us. They treated us well. The whole time we were near them out in the fields, nothing was stolen.

16. మేము గొఱ్ఱెలను కాయు చున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.

16. We were taking care of our sheep near them. During that time, they were like a wall around us night and day. They kept us safe.

17. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.

17. 'Now think it over. See what you can do. Horrible trouble will soon come to our master and his whole family. He's such an evil man that no one can even talk to him.'

18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి

18. Abigail didn't waste any time. She got 200 loaves of bread and two bottles of wine. The bottles were made out of animal skins. She got five sheep that were ready to be cooked. She got a bushel of grain that had been cooked. She got 100 raisin cakes. And she got 200 cakes of pressed figs. She loaded all of it on the backs of donkeys.

19. మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి

19. Then she told her servants, 'Go on ahead. I'll follow you.' But she didn't tell her husband Nabal about it.

20. గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసి కొనెను.

20. Abigail rode her donkey into a mountain valley. There she saw David and his men. They were coming down toward her.

21. అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే

21. David had just said, 'Everything we've done hasn't been worth a thing! I watched over that fellow's property in the desert. I made sure none of it was stolen. But he has paid me back evil for good.

22. అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.

22. I won't leave even one of his men alive until morning. If I do, may God punish me greatly!'

23. అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను

23. When Abigail saw David, she quickly got off her donkey. She bowed down in front of David with her face toward the ground.

24. నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము;

24. She fell at his feet. She said, 'Please let me speak to you, sir. Listen to what I'm saying. Let me take the blame myself.

25. నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.

25. Don't pay any attention to that evil man Nabal. His name means Foolish Person. And that's exactly what he is. He's always doing foolish things. I'm sorry I didn't get a chance to see the men you sent.

26. నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయు చున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.

26. 'Sir, the Lord has kept you from killing Nabal and his men. He has kept you from using your own hands to get even. May what's about to happen to Nabal happen to all of your enemies. May it also happen to everyone who wants to harm you. And may it happen just as surely as the Lord and you are alive.

27. అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

27. 'I've brought a gift for you. Give it to the men who follow you.

28. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడ వగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగ కుండును.

28. Please forgive me for what I've done wrong. 'The Lord will certainly give you and your family line a kingdom that will last. That's because you fight the Lord's battles. Don't do anything wrong as long as you live.

29. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.

29. 'Someone may chase you and try to kill you. But the Lord your God will keep your life safe like a treasure that is hidden in a bag. And he'll destroy your enemies. Their lives will be thrown away, just as a stone is thrown from a sling.

30. యెహోవా నా యేలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రా యేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత

30. 'The Lord will do for you every good thing he promised to do. He'll appoint you leader over Israel.

31. నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగాచిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొని నందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.

31. When that happens, you won't have this heavy load on your mind. You won't have to worry about how you killed people without any reason. You won't have to worry about how you got even. The Lord will give you success. When that happens, please remember me.'

32. అందుకు దావీదునాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

32. David said to Abigail, 'Give praise to the Lord. He is the God of Israel. He has sent you today to find me.

33. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.

33. May the Lord bless you for what you have done. You have shown a lot of good sense. You have kept me from killing Nabal and his men this very day. You have kept me from using my own hands to get even.

34. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన యెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి

34. 'It's a good thing you came quickly to meet me. If you hadn't come, not one of Nabal's men would have been left alive by sunrise. And that's just as sure as the Lord, the God of Israel, is alive. He has kept me from harming you.'

35. తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొనినీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.

35. Then David accepted from her what she had brought him. He said, 'Go home in peace. I've heard your words. I'll do what you have asked.'

36. అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

36. Abigail went back to Nabal. He was having a dinner party in the house. It was the kind of dinner a king would have. He had been drinking too much wine. He was very drunk. So she didn't tell him anything at all until sunrise.

37. ఉదయ మున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.

37. The next morning Nabal wasn't drunk anymore. Then his wife told him everything. When she did, his heart grew weak. He became like a stone.

38. పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.

38. About ten days later, the Lord struck Nabal down. And he died.

39. నాబాలు చనిపోయెనని దావీదు వినియెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.

39. David heard that Nabal was dead. So he said, 'Give praise to the Lord. Nabal made fun of me. But the Lord stood up for me. He has kept me from doing something wrong. He has paid Nabal back for the wrong things he did.' Then David sent a message to Abigail. He asked her to become his wife.

40. దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చిదావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా

40. His servants went to Carmel. They said to Abigail, 'David has sent us to you. He wants you to come back with us and become his wife.'

41. ఆమె లేచి సాగిలపడినా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి

41. Abigail bowed down with her face toward the ground. She said, 'Here I am. I'm ready to serve him. I'm ready to wash the feet of his servants.'

42. త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.

42. Abigail quickly got on a donkey and went with David's messengers. Her five female servants went with her. She became David's wife.

43. మరియదావీదు యెజ్రెయేలు స్త్రీ యైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.

43. David had also gotten married to Ahinoam from Jezreel. Both of them became his wives.

44. సౌలు తన కుమార్తె యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.

44. But Saul had given his daughter Michal, David's first wife, to Paltiel. Paltiel was from Gallim. He was the son of Laish.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel I- 1 సమూయేలు 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సమూయేలు మరణం. (1) 
ఇజ్రాయెల్ దేశం మొత్తం సమూయేలు కోసం విచారం వ్యక్తం చేసింది మరియు న్యాయంగానే. అతను ప్రతిరోజూ వారి కోసం నమ్మకంగా ప్రార్థించాడు. అంకితభావంతో పని చేసే మంత్రులను ఏ బాధా లేకుండా సమాధి చేయగల నిష్కళంకమైన హృదయాలు ఉన్నవారిని చూడటం నిజంగా నిరుత్సాహపరుస్తుంది. తమ కోసం తీవ్రంగా ప్రార్థించిన మరియు ప్రభువు మార్గాల్లో వారిని నడిపించిన వ్యక్తిని కోల్పోవడం యొక్క ప్రాముఖ్యతను వారు గ్రహించలేరు.

దావీదుఅభ్యర్థన; నాబాలు యొక్క నిరాడంబరమైన తిరస్కరణ. (2-11) 
నాబాలు మరియు దావీదుమధ్య పరస్పర చర్య లేకుంటే, అతని పేరు తెలియకుండా ఉండేది. నాబాలు పేరుకు "మూర్ఖుడు" అని అర్ధం, మరియు సరిగ్గా అదే. ఐశ్వర్యం ప్రపంచం దృష్టిలో ఒకరి స్థాయిని పెంచినప్పటికీ, వివేచనగల పరిశీలకుడు నాబాలు‌ను చిన్నవాడిగా మరియు గుర్తించలేని వ్యక్తిగా చూస్తాడు. అతనికి గౌరవం మరియు చిత్తశుద్ధి లేదు, చులకనగా, అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శించాడు. అతని చర్యలు చెడ్డవి, కఠినమైన అణచివేత మరియు సంపదను పోగుచేయడానికి మరియు పోగుచేయడానికి మోసం మరియు హింసను ఉపయోగించుకునే సుముఖత కలిగి ఉంటాయి. దావీదు వంటి నీతిమంతులు లేమితో బాధపడుతుండగా, నాబాలు వంటి వ్యక్తులు వర్ధిల్లుతున్నప్పుడు ప్రాపంచిక సంపదకు తక్కువ విలువ ఉంటుందని ఇది ఒక పదునైన జ్ఞాపికగా పనిచేస్తుంది.
దావీదు తన విజ్ఞప్తిలో, నాబాలు కాపరులకు చూపిన దయను వివరించాడు. దావీదుయొక్క పురుషులు కష్టాలు, అప్పులు మరియు అసంతృప్తి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, వారు వివేకవంతమైన నిర్వహణకు ధన్యవాదాలు, దోపిడీని ఆశ్రయించకుండా నిరోధించబడ్డారు. నాబాలు యొక్క ప్రతిస్పందన అత్యాశతో నడిచింది, అడిగినప్పుడు దేనితోనూ విడిపోవడానికి ఇష్టపడని వారిలో ఒక సాధారణ ప్రతిచర్య, ఒక పాపాన్ని మరొకటి సమర్థించుకోవడానికి మరియు తక్కువ అదృష్టవంతుల అవసరాలను నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం చేయడం. అయితే, దేవుణ్ణి మోసం చేయడం లేదా వెక్కిరించడం సాధ్యం కాదు.
ఈ సంఘటన మనకు ఎదురయ్యే నిందలు మరియు తప్పుడు వివరణలను ఓపికగా మరియు ఉల్లాసంగా భరించాలని బోధిస్తుంది, గొప్ప వ్యక్తులు కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని గుర్తిస్తారు. నాబాలు తన టేబుల్‌పై ఉన్న నిబంధనలపై తన యాజమాన్యంపై పట్టుబట్టడం, మనం కలిగి ఉన్న వాటిపై మనకు పూర్తి అధికారం ఉందని మరియు దానితో మనకు నచ్చిన విధంగా చేయగలదనే తప్పుడు నమ్మకాన్ని వెల్లడిస్తుంది. అయినప్పటికీ, వాస్తవానికి, మనం కేవలం గృహనిర్వాహకులం, ప్రతిదీ కలిగి ఉన్న వ్యక్తి నిర్దేశించిన విధంగా ఉపయోగించాల్సిన వనరులను అప్పగించాము.

నాబాలును నాశనం చేయాలనే దావీదు ఉద్దేశం. (12-17) 
దేవుడు చెడు మరియు కృతజ్ఞత లేని వారి పట్ల కూడా దయ చూపిస్తాడు, కాబట్టి మనం కూడా ఎందుకు చేయకూడదు? అయితే, దావీదు, నాబాలును మరియు అతనితో సంబంధం ఉన్న ప్రతిదానిని నిర్మూలించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఓ డేవిడ్, ఇది నిజంగా నీ స్వరమేనా? ఇన్ని బాధలు భరించి, ఓపిక పాఠాలు నేర్చుకుని ఇంకా కోపంతో ఎలా కృంగిపోతున్నావు? దావీదుఇతర సందర్భాల్లో ప్రశాంతంగా మరియు ఆలోచనాత్మకంగా ప్రదర్శించినప్పటికీ, కొన్ని కఠినమైన మాటలు ఇప్పుడు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసే స్థాయికి అతన్ని రెచ్చగొట్టాయి. అత్యంత సద్గుణవంతులైన వ్యక్తులు కూడా, దేవునిచే తమను తాము విడిచిపెట్టినప్పుడు, వారి హృదయాలలో దాగి ఉన్న లోతులను బహిర్గతం చేయవచ్చని ఇది పూర్తిగా గుర్తుచేస్తుంది. అటువంటి ఆపదలనుండి తప్పించుకోవడానికి దైవిక మార్గదర్శకత్వాన్ని కోరుతూ, "ప్రభువా, మమ్ములను ప్రలోభాలకు గురి చేయకుము" అని ప్రార్థించవలసిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతుంది.

అబీగైల్ దావీదుకు బహుమతి తీసుకుంది. (18-31) 
దావీదు అభ్యర్థనను నాబాలు తిరస్కరించినందుకు అబీగయీల్ ఆలోచనాత్మకమైన బహుమతి ప్రాయశ్చిత్తంగా పనిచేసింది. ఆమె ప్రవర్తన గొప్ప నేరాలను కూడా శాంతింపజేయగలదని చూపిస్తూ, చెప్పుకోదగిన సమర్పణను ప్రదర్శించింది. ఆమె వినయంగా తన భర్త ప్రవర్తనకు సాకులు చెప్పకుండా పశ్చాత్తాపపడే మరియు పిటిషనర్ పాత్రలలో తనను తాను ఉంచుకుంది. బదులుగా, ఆమె దావీదుహృదయాన్ని మృదువుగా చేయడానికి దేవుని దయపై ఆధారపడింది, అది శక్తివంతంగా పనిచేస్తుందని ఆశించింది.
నాబాలు వంటి బలహీనమైన మరియు ధిక్కారమైన శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడం దావీదువంటి వారి కంటే తక్కువగా ఉంటుందని అబిగైల్ నొక్కిచెప్పాడు. నాబాలు అతనికి హాని చేయలేకపోయాడు లేదా ప్రయోజనం పొందలేడు, ప్రతీకారం తీర్చుకోవడం అనవసరం. అంతేకాకుండా, దావీదుయొక్క ప్రస్తుత కష్టాలకు అద్భుతమైన పరిష్కారాన్ని ఆమె ప్రవచించింది, దేవుడు అతని జీవితాన్ని కాపాడతాడని అతనికి హామీ ఇచ్చింది. అందువల్ల, అతను ఎవరినైనా, ముఖ్యంగా తన దేవుడు మరియు రక్షకుడైన ప్రజల ప్రాణాలను తీయడం అన్యాయం మరియు అనవసరం.
ఆమె విన్నపంలో, అబిగైల్ తన అత్యంత బలవంతపు వాదనను చివరిగా కాపాడింది, అది దావీదువంటి మంచి వ్యక్తితో ప్రతిధ్వనిస్తుందని తెలుసు. ఆమె అతని మనశ్శాంతిని మరియు అతని మనస్సాక్షి యొక్క ప్రశాంతతను కోరింది, అతని అభిరుచికి లోనవడం మానుకోవాలని అతనిని కోరింది. చాలా మంది క్షణికావేశంలో హఠాత్తుగా ప్రవర్తించారు, ఆ తర్వాత తీవ్రంగా పశ్చాత్తాపపడ్డారు. ప్రతీకారం యొక్క ప్రారంభ తీపి తరచుగా శాశ్వత చేదుగా మారుతుంది. డేవిడ్‌ని తర్వాత ఆలోచించినప్పుడు అతని చర్యలు అతనిని ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించమని ఆమె సలహా ఇచ్చింది.
టెంప్టేషన్ సమయాల్లో, సంభావ్య పర్యవసానాల గురించి ఆలోచించడం చాలా కీలకం మరియు మన ఎంపికలను పునరాలోచనలో ఎలా చూస్తాం.

అతను శాంతించబడ్డాడు, నాబాలు మరణిస్తాడు. (32-39) 
దావీదుపాపాత్మకమైన మార్గంలో పాపం చేయకుండా నిరోధించే ప్రావిడెన్షియల్ జోక్యాన్ని పంపినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. సలహాతో, నిర్దేశంతో, ఓదార్పుతో, జాగ్రత్తతో లేదా సమయానుకూలంగా మందలింపుతో మన వద్దకు వచ్చే ఎవరైనా దేవునిచే పంపబడ్డారని ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి, మనల్ని పాపంలో పడకుండా కాపాడే అలాంటి సంతోషకరమైన ప్రొవిడెన్స్ కోసం మనం చాలా కృతజ్ఞులమై ఉండాలి. చాలా మంది ప్రజలు మందలింపును సహనంతో సహించవచ్చు, కానీ కొంతమంది మాత్రమే దానిని నిజంగా అభినందిస్తారు, దానిని అందించే వారిని మెచ్చుకుంటారు మరియు దానిని అనుకూలంగా చూస్తారు.
మనం పాపం యొక్క అంచుకు ఎంత దగ్గరగా ఉంటామో, సమయానుకూలమైన నిగ్రహం యొక్క దయ పెరుగుతుంది. పాపులు చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా సురక్షితంగా భావిస్తారు. నాబాలు యొక్క విపరీతమైన మద్యపానం అతని తెలివితక్కువతనాన్ని బహిర్గతం చేసింది, సమృద్ధిని దుర్వినియోగం చేయకుండా మరియు స్నేహితుల సహవాసంలో తనపై నియంత్రణను కోల్పోలేదు. అలాంటి ప్రవర్తన జ్ఞానం లేకపోవడానికి స్పష్టమైన సంకేతం, మరియు అతిగా మద్యపానం చేయడం అనేది ఒక వ్యక్తి కలిగి ఉన్న ఏ చిన్న జ్ఞానం అయినా నాశనం చేస్తుంది.
మరుసటి రోజు ఉదయం, నాబాలు యొక్క ప్రవర్తన వైన్‌తో ఉల్లాసంగా ఉండటం నుండి బరువెక్కిన హృదయానికి నాటకీయంగా మారిపోయింది, ఇది శరీర సంబంధమైన ఆనందాల యొక్క క్షణిక స్వభావాన్ని మరియు మూర్ఖపు ఉల్లాసాన్ని అనుసరించే భారాన్ని ప్రదర్శిస్తుంది. తాగుబోతులు తమ మూర్ఖత్వాన్ని ప్రతిబింబించేటప్పుడు తరచుగా విచారం మరియు పశ్చాత్తాపాన్ని అనుభవిస్తారు.
దాదాపు పది రోజుల తర్వాత, ప్రభువు నాబాలును కొట్టి అతని మరణానికి కారణమయ్యాడు. నాబాలును చంపిన పాపం నుండి తనను కాపాడినందుకు దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రాపంచిక దుఃఖం, వినయపూర్వకమైన అహంకారం మరియు అపరాధ మనస్సాక్షి కొన్నిసార్లు ఇంద్రియ సంబంధమైన కోరికలను కలిగి ఉన్నవారి ఆనందాలను అంతం చేస్తాయి మరియు దురాశను వారి సంపద నుండి వేరు చేయగలవు. అంతిమంగా, ఒక మార్గం ద్వారా లేదా మరొకటి ద్వారా, ప్రభువు తనకు నచ్చిన విధంగా మరణాన్ని నిర్వహిస్తాడు.

దావీదు అబీగైల్‌ను భార్యగా తీసుకుంటాడు. (39-44)
దావీదుఇజ్రాయెల్ సింహాసనాన్ని అధిరోహిస్తాడనే అబిగైల్‌కు అచంచలమైన విశ్వాసం ఉంది మరియు ఆమె అతని భక్తి మరియు ప్రశంసనీయమైన పాత్రను ఎంతో గౌరవించింది. అతని ప్రస్తుత సవాళ్ల మధ్య కూడా ఆమె అతని వివాహ ప్రతిపాదనను గౌరవప్రదంగా మరియు ప్రయోజనకరంగా భావించింది. విశేషమైన వినయంతో, మరియు ఆ యుగపు ఆచారాలకు అనుగుణంగా, ఆమె యూనియన్‌కు ఇష్టపూర్వకంగా అంగీకరించింది, అతని పరీక్షలన్నింటికీ అతనికి అండగా నిలబడటానికి సిద్ధపడింది. ఈ విధంగా, క్రీస్తుతో తమను తాము కలుపుకునే వారు కూడా ఆయనతో కష్టాలను భరించడానికి సిద్ధంగా ఉండాలి, భవిష్యత్తులో, వారు అతని అద్భుతమైన పాలనలో భాగస్వామ్యం అవుతారని విశ్వసిస్తారు.



Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |