Samuel I- 1 సమూయేలు 5 | View All

1. ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి

ఫిలిష్తీయవారి ప్రధానమైన పట్టణాల్లో అష్డోదు ఒకటి.

2. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.

“దాగోను”– ఫిలిష్తీయవారి ఇలవేలుపు (న్యాయాధిపతులు 16:23-25 1 దినవృత్తాంతములు 10:8-10). ఫిలిష్తీయవారు యెహోవాదేవునికి తమ దేవుని ప్రక్కనే స్థానం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు పాపం. అంటే దేవుళ్ళందరూ గౌరవానికీ తగినవారేనని, మతాలన్నీ మంచివని బహుశా వారి ఆలోచన, నేడు ఈ ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏకైక నిజ దేవునికి ఇది సమ్మతం కాదు (నిర్గమకాండము 20:1-6 1 రాజులు 18:21 కీర్తనల గ్రంథము 115:1-8 యెషయా 44:6-7 యెషయా 46:9 యిర్మియా 16:20 1 కోరింథీయులకు 8:4-6 2 కోరింథీయులకు 6:14-18).

3. అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.

“బోర్లపడి ఉంది”– కీర్తనల గ్రంథము 97:7 యెషయా 46:5-9 పోల్చిచూడండి. దాగోను పడిపోవటం ద్వారా ఫిలిష్తీయవారు ఏమీ నేర్చుకోలేదు. తమ దేవుళ్ళు శక్తిహీనులు, వ్యర్థులు అని తెలిసి కూడా మనుషులు వాటిని అవతల పారవేయరెందుకు? మనం నమ్మకం నిలుపుకున్న వాటిని దేవుడు కూలద్రోసినప్పుడు వాటిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామా?

4. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.

మొదటి సారి ఫిలిష్తీయవాళ్ళు నేర్చుకోలేకపోయారని యెహోవా దేవుడు రెండో సారి మరింత గట్టిగా గుణపాఠం నేర్పాడు. ఆయన మహా బలవంతుడు. వారి దాగోను నిస్సహాయుడు. అసలు దేవుడే కాదు. నిజ దేవుడు మానవ చరిత్రలో మనుషులు ఉంచుకున్న విగ్రహాల, అబద్ధ దేవుళ్ళ విషయంలో ఈ సత్యాన్ని పదే పదే రుజువు చేశాడు.

5. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు.

“ఈ రోజువరకు”– ఇంత జరిగినా తమ శక్తిహీనుడైన అబద్ధ దేవుణ్ణి పూజించటం మానలేదు. ప్రజల పై విగ్రహపూజ నిజం కాని మతాల పట్టు ఇంత బలమైనది.

6. యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా

దేవుడు దాగోను పైనా, వాణ్ణి పూజించే వారిపైన తన తీర్పులను కొనసాగిస్తున్నాడు. నిర్గమకాండము 12:12 పోల్చిచూడండి.

7. అష్డోదువారు సంభవించిన దాని చూచిఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవత యగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని

8. ఫిలిష్తీయుల సర్దారు లందరిని పిలువనంపించిఇశ్రాయేలీ యుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారుఇశ్రాయేలీయుల దేవుని మంద సమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి.

తమ దేవుడు దేవుడే కాదనీ, యెహోవాయే నిజమైన సజీవుడైన దేవుడనీ ఒప్పుకోవలసింది పోయి, రుజువును వారి దగ్గర లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషులంతా ఇంతే కదా. రోమీయులకు 1:18-20 చూడండి.

9. అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్న లకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.

ఇదంతా జరిగి కూడా వారిలో పశ్చాత్తాపం ఉన్నట్టు లేదు. విగ్రహపూజను విడిచి నిజ దేవుణ్ణి అనుసరిద్దామన్న ఆలోచన ఉన్నట్టు లేదు. ప్రకటన గ్రంథం 9:2 పోల్చిచూడండి. భ్రష్ట స్వభావం గల మనిషి ఇంతకన్నా ఏమి చేస్తాడు.

10. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిమనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.

11. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించిఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జను లను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.

12. చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |