Job - యోబు 19 | View All

1. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

2. ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

3. పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

4. నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?

5. మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?

6. ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.

7. నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

8. నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు

9. ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

10. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.

11. ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.

12. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారము చుట్టు దిగిరి.

13. ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.

14. నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.

15. నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.

16. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.

17. నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.

18. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.

19. నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

20. నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది

21. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.

22. నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?

23. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

24. అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
1,Joh,2,28, 1,Joh,3,2

26. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
యోహాను 19:30

27. నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
యోహాను 19:30

28. జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల

29. మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.బైబిల్ అధ్యయనం - Study Bible
19:1-2 బిల్డదు పరిభాషనే ఉపయోగిస్తూ యోబు మాట్లాడుతున్నాడు (18:2); ఎన్నాళ్లు? మాటలు నలుగగొడతాయి గనుక ఆచితూచి సముచితంగా వాటిని ఉపయోగించాలి (సామె 15:1,23; ఎఫెసీ 4:29).

19:3 యోబు స్నేహితులు యోబును ఆదరించి అతనికి సహాయపడడానికి బదులు అతని దుఃఖాన్నింకా పెంచారు. పది అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. 

19:4 మనుషులందరి లాగానే తాను కూడా అనుకోకుండా తప్పు చేసి ఉండవచ్చునని యోబు చెప్తున్నాడు (6:24; 7:20), అయినప్పటికీ, ఇంత కఠినమైన శిక్షకు తగిన తప్పేమీ తాను చేయలేదని యోబు ఆలోచన. యోబు చేసిన చిన్న చిన్న తప్పులు అతనికే హానిచేస్తాయనీ, తన స్నేహితులకు కాదనీ యోబు చెప్తున్నాడు. 

19:5-6 దుష్టుని జీవితశైలి అతడినే చిక్కుల్లో పడవేస్తుందనీ (18:8-10), దేవుడు న్యాయాన్ని వక్రీకరించడనీ బిల్డదు సూచిస్తున్నాడు (8:3). బిల్టదు మాటలకు భిన్నంగా, దేవుడు తనను అన్యాయంగా వలలో చిక్కుకొనేలా చేశాడని తన స్నేహితులు తెలుసుకోవాలని యోబు అంటున్నాడు (7:19-20). 

19:7 తన బాధకు కారణం తాను చేసిన తప్పు(లు) కాదనీ, దేవుడేననీ యోబు ఉద్దేశం. 

19:8 తన జీవితం ముందుకు సాగకుండా కొట్టివేయబడిందని యోబు అనుకుంటున్నాడు. భవిష్యత్తు బాగుంటుందనే నిరీక్షణ లేదు. చీకటి మరణాన్ని సూచిస్తుంది, మరణ భయం యోబును ఆవరించి ఉందనే భావనను తెలియజేస్తుంది. 

19:9-12 యోబు దేవుని వలన తనకు కలిగిన ప్రస్తుత అవమాన పరిస్థితిని పలు సాదృశ్యాల్లో వర్ణించాడు. చివరిగా, శత్రుదాడికి గురైన పట్టణంతో యోబు తనను తాను పోల్చుకున్నాడు. శత్రు సైన్యం తన చుట్టూ ముట్టడిదిబ్బలు వేసి పొట్టేళ్లు కుమ్మినట్టు కుమ్మి తనకంటూ ఇక ఏ ఆధారం లేకుండా తనను పెల్లగిస్తున్నట్టు ఉందని యోబు చెబుతున్నాడు. ఎదురొడ్డి నిలిచే బలమైన పట్టణంలాగా కాక, శత్రువులు తేలికగా ఊడదీయగల గుడారము లాగా తానున్నానని యోబు చెబుతున్నాడు. దుష్టులకు పట్టబోయే గతి గురించి బిల్డదు వర్ణించినదానికి భిన్నంగా (18:14-15), యోబు గుడారాన్ని (యోబు జీవితం) నిష్కారణంగా దేవుడు పెల్లగించివేస్తున్నాడని, దేవుడు తనను ఓడిస్తున్నాడని (14:20) యోబు చెబుతున్నాడు. గుడారం అశాశ్వతమైనదానిని (2కొరింథీ 5:1), జీవితం యొక్క క్లుప్తతను (7:16,21; 9:25-26; 10:20; 14:1-6) సూచిస్తుంది.

19:13-14 తనను బంధువర్గం, ప్రాణ స్నేహితులు తృణీకరించారనీ, తానిప్పుడు ఒంటరివాడిననీ యోబు తన గురించీ తన దుస్థితి గురించి వర్ణిస్తున్నాడు. 

19:15-16 యోబు గృహజీవితం ఇప్పుడు అస్తవ్యస్థంగా మారింది. యోబు వలన ఆతిథ్యం పొందినవారు, ఇంటి దాసదాసీజనులు అతనెవరో తమకు తెలియదన్నట్టుగా చూస్తున్నారు. చివరికి యోబుకు సకల పరిచర్యలు చేసిన పనివాడు సైతం యోబు ఎవరో తనకు తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. యోబు సంబంధ బాంధవ్యాలన్నీ తలకిందులైనట్టు కనబడుతున్నాయి (సామె 30:21-23) 

19:17 నేను కనిన కుమారులకు అనే పదబంధం హెబ్రీలో అక్షరాలా "నా కడుపున పుట్టిన పిల్లలు" అనే అర్థాన్నిస్తుంది (కీర్తన 132:11; మీకా 6:7తో పోల్చండి). యోబు తన పిల్లలందరిని పోగొట్టుకొనలేదా (1:18-19)? బహుశా వీరు యోబు. ఇంటిలోని పనివారి పిల్లలు అయ్యుండవచ్చు. యోబు వీరిని సైతం తన స్వంత పిల్లల్ని చూచినట్టుగానే చూసి ఉండవచ్చు లేదా వీరు యోబు కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు ఆ వినాశనం బారిన పడకుండా బ్రతికి ఉన్న మనుమ సంతానం కావచ్చు. అయితే కొంతమంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ప్రకారం, "నేను కనిన" (హెబ్రీ. బిత్ని) అనే పదం తోడబుట్టిన వారిని సైతం సూచిస్తుంది. కాబట్టి వీరు యోబు రక్తసంబంధికులు (అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు) అయ్యుండవచ్చు.

19:18 చిన్నపిల్లలు పెద్దవారిని చూస్తూ దూషణలు పలకడం (అపహాస్యం చేయడం) ఇశ్రాయేలు సామాజిక మర్యాద నుల్లంఘించడమే. 

19:19 యోబును అతని ప్రాణ స్నేహితులు మర్చిపోవడం మాత్రమే కాదు (వ.14), అతనికి శత్రువులుగా సైతం మారిపోయారు. 

19:20 యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని - హెబ్రీలోని వర్ణన యోబు శరీర దౌర్బల్యాన్ని తెలియజేస్తుంది. (33:21). యోబు పూర్తిగా కృశించిపోయాడు. దంతముల అస్థిచర్మము అనే నుడికారం యోబు ఎంత దారుణంగా కృశించిపోయాడో తెలియజేస్తుంది. 

19:21-22 తన స్నేహితులు తన గురించి వాస్తవం తెలుసుకొని తన పట్ల జాలి చూపించాలని యోబు అనడం అతడు తాను నిర్దోషినని బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. దేవుడు తనను ఊరికే శిక్షిస్తున్నాడని యోబు అనుకుంటుండగా, మరొకవైపు నుండి అతని శత్రువులు అతనిలో తప్పులు వెతుకుతూ అతణ్ణి బాధించడానికి దేవుని పక్షాన చేరారనీ, వాది తరుపున వారే సాక్షులుగా ఉన్నారనీ యోబు ఆలోచన (10:17). నా శరీరము మాంసము పోవుట చాలుననుకొనక అని యోబు వాడిన హెబ్రీ నుడికారాన్ని ఎవరిమీదనైనా ఊరికే నిందలు వేయడానికి లేదా ఆరోపణలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అంటే, యోబు స్నేహితులు అతని మీద నిరేతుకంగా నిందలు వేస్తున్నారని యోబు భావం (కీర్తన 27:2; దాని 3:8; 6:24). తన స్నేహితులు జాలి చూపకుండా చేస్తున్న విమర్శలు తనకిక ఆశ్రయమేదీ లేదన్నట్టుగా చేస్తున్నాయని యోబు దుఃఖిస్తున్నాడు. 

19:23-24 గ్రంథము - ఇది జమ్ముతో చేసిన గ్రంథపు చుట్ట, లేదా జంతుచర్మంతో చేసిన చుట్ట. యోబు తన మాటల్ని వీటి మీద వ్రాయడం కంటె, బండ మీద గానీ లేదా సీసముతో నింపబడిన దేనిమీదనైనా గానీ చెక్కాలని కోరుకుంటున్నాడు. బండ మీద చెక్కిన ప్రాచీనకాలం నాటి వ్రాతలు పరిశోధనల్లో బయటపడ్డాయి. వీటిలో చాలా భాగం రాజులు చెక్కించిన శిలాశాసనాలైనప్పటికీ, ప్రముఖ వ్యక్తుల జీవితంలోని సంఘటనలున్న శిలలు లేదా పొలాల సరిహద్దుల్ని నిర్ణయించే హద్దు రాళ్లు కూడా ఉన్నాయి. యోబు తన నిర్దోషత్వం శాశ్వతంగా నిలిచిపోయేలా తన మాటల్ని బండమీద లేదా సీసం మీద చెక్కాలని కోరుకుంటున్నాడు. 

19:25 విమోచకుడు అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని అదనపు సౌకర్యాల్ని కాపాడే సమీప బంధువు అనే ప్రాచీన సాంప్రదాయాన్ని సూచిస్తుంది (లేవీ 25:23-34, 47-54; ద్వితీ 19:6-12; యెహో 20:215; రూతు 4:1-17). దేవుడే తన శత్రువుగా తనను బాధించేవాడిగా ఉన్నాడని యోబు తరచూ అభివర్ణించినప్పటికీ (7:17-21; 16:7-14; 19:7-12), అతడు దేవునిలో తన ప్రగాఢ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు (12:12-16; 13:15-18; 14:14-17; 16:18-20). చివరికి, దేవుడే తనకున్న ఒకే ఒక నిరీక్షణ అని కూడా యోబు చెప్పాడు (17:3). దేవుని గురించి సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ, యోబులో అంతర్లీనంగా ఉన్న విశ్వాసం చివరకు బయటపడింది. దేవుడే యోబు విమోచకుడు, యోబు హక్కులకు దేవుడే హామీదారుడు, యోబుకు న్యాయం చేసే ఉత్తరవాది దేవుడే. తాను మరణించినట్లయితే, తనను పాతి పెట్టిన భూమి మీద సజీవుడైన దేవుడు నిలబడి తన తరపున సాక్ష్యం చెప్తాడనే నమ్మికను యోబు ప్రకటిస్తున్నాడు. 

19:26-27 యోబు తన చర్మం గురించి తన శరీరమాంసం గురించి చెప్పినదాన్నే (వ.20) ఇప్పుడు మళ్లీ చెప్తున్నాడు. ఏది జరుగుతుందని తాననుకుంటున్నాడో అది జరగకపోదని యోబు చెప్తున్నాడు (7:7-10; 10:18,21-22; 14:12; 17:13-16). తనను సమాధిలో పరుండబెట్టినప్ప టికీ (వ. 25), తన శరీరం చీకిపోయినప్పటికీ, దేవుని చూచెదను అని యోబు చెప్తున్నాడు. మరి ఎవరును కాదు, తానే తన కళ్లతో స్వయంగా దేవుణ్ణి చూస్తానని యోబు చెప్తున్నాడు, అంటే దేవుని సహవాసాన్ని తాననుభవిస్తానని చెప్తున్నాడని అర్థం. మరణానంతర జీవితంపట్ల నిరీక్షణ గురించి మరొకసారి యోబు చెప్తున్నాడు (14:14-15).

19:28-29 యోబుని నిర్దేతుకమైన నిందలతో తరిమెదమా అని తలంచడం అతని స్నేహితుల్ని అపాయంలోకి నెట్టింది. వారు బాధ్యత తెలిసిన సలహా దారులుగా ఉండాలి, లేదా దేవుని నుండి తీర్పు కలుగునని భయపడాలి. ఖడ్గము దేవుని తీర్పుకు సాదృశ్యం (ద్వితీ 32:40-41; రోమా 13:3-4). 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |