Psalms - కీర్తనల గ్రంథము 10 | View All

1. యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?

2. దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

3. దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

5. వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును.వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.

6. మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు

7. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నదివారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.
రోమీయులకు 3:14

8. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

9. గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

10. కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.

11. దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

12. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువకనీ చెయ్యి యెత్తుము

13. దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయౌవని వారు తమ హృదయములలో అను కొనుటయేల?

14. నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు

15. దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానిని గూర్చి విచారణ చేయుము.

16. యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి.
ప్రకటన గ్రంథం 11:15

17. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు

18. తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి,చెవియొగ్గి ఆల కించితివి.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-10. పాత నిబంధనలో “దుష్టులు" అని పిలవబడిన, నీతిన్యాయాలు లేని వ్యక్తులనుండి విడిపించమని కోరుతూ చేసిన ప్రార్ధన. 

10:1-18 దేవుని న్యాయానికి విజయం కలగడం ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తున్నదనే ప్రశ్నతో ఈ ప్రార్థన పెనుగులాడుతూ ఉంది. (ప్రక 6:9-10 లోని హతసాక్షులైన పరిశుద్ధుల కేకతో పోల్చండి). ప్రస్తుత కాలంలో అన్యాయం, చెడుగు చెలరేగుతున్నాయి. దేవుడు కొన్నిసార్లు దీనిలో జోక్యం చేసుకోకుండా “దూరంగా” నిలిచి ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ దుర్మార్గాన్ని, బాధలను ఆపాలని దేవుని ప్రజలు తప్పక ప్రార్థన చేయాలి. అప్పటి వరకు తీర్పుదినం ఇంకా రాకపోయినప్పటికీ దేవుడు మన ప్రార్ధనలు విన్నానని, చివరి వరకు మనకు మనోధైర్యాన్ని అనుగ్రహిస్తానని మనకు అభయం ఇచ్చాడు (వ.17-18). 

10:1-2 తాను బాధ ననుభవిస్తున్నప్పుడు తన శ్రమను యెహోవా పట్టించుకోకుండా దూరముగా నిలుచుచున్నాడని (దూరముగా నుండకుము - 35:22; 38:21), తనకు విముఖుడై ఉన్నాడనీ (13:1) కీర్తనకారుడు అనుకుంటున్నాడు. అంటే, తనను దేవుడు శ్రమ నుండి విడిపించలేదని కీర్తనకారుడు చెబుతున్నాడని అర్థం. విలాపకీర్తనల్లో ఇంతకంటె తీవ్రతగల మాటల్లో తనను యెహోవా విడిచి పెట్టాడని కీర్తనకారుడు చెప్పడం గమనార్హం (ఉదా: 22:1). కీర్తనకారుడు అనుభవిస్తున్న నిర్దిష్టమైన శ్రమ ఈ విజ్ఞప్తిలో కనబడుతుంది: దుష్టులు కీర్తనకారున్ని వెంటాడి తరుముతున్నారు. దుర్మార్గుల, దుష్టుల అహంకార స్వభావాన్ని బట్టి, వారు సాధిస్తున్నట్టు కనిపిస్తున్న విజయాలను బట్టి కీర్తనకారుడు దుఃఖపడుతున్నాడు (వ.3-11). ఈ దుష్టులు ఆలోచించిన మోసక్రియలలో వారే చిక్కుకోవాలని కీర్తనకారుడు విజ్ఞప్తి చేస్తున్నాడు (7:14-16 నోట్సు చూడండి). (1) దుష్టులను నాశనం చేసి, వినయం గలవారికి సహాయం చేసి, భూమి మీద పాపాన్ని, క్రూరత్వాన్ని తొలగించడానికి రాజుగా సదాకాలం పరిపాలించమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు (వ. 12-18). (2) క్రీస్తు తిరిగివచ్చి సమస్త చెడుగును నాశనం చేసేంతవరకు పాపం, క్రూరత్వం ఎన్నటికీ అణచివేయబడవనీ, లేక నీతి వర్ధిల్లదనీ కొత్త నిబంధన విశ్వాసులు అర్థం చేసుకొని అప్పటి వరకు దుష్టుల ఆత్మల రక్షణ నిమిత్తం సదా శ్రద్ధ కలిగి ఉండాలి (ప్రక 19:11-20:10). అదే విధంగా దేవుడు సమస్త చెడుగును త్వరగా తొలగించాలనీ, శాశ్వతమైన రాజుగా క్రీస్తు కిరీటధారి కావాలనీ, భూమిమీద పాపం, దుఃఖం లేకుండా పోవాలనీ మనం తప్పక ప్రార్థన చేయాలి (ప్రక 19-21 చూడండి). 

10:3-6 దుష్టుల గర్వానికి పరాకాష్ఠ వారు యెహోవాను తిరస్కరించడం. ఇది ఆధ్యాత్మిక తత్వచింతనలో దేవుడు లేడనే నిరీశ్వరవాదం కాదు. తమ దైనందిన జీవితాల్లో దేవునికి స్థానం లేదన్నట్టుగా ఆయనను తిరస్కరించడం, మనుషుల నైతికవర్తనను, చర్యల్ని దేవుడసలు చూడడం లేదని తలంచడం (14:1; 53:1). శత్రువు తనకు తానే భరోసా అని తనలో తానే ఆలోచించుకుంటున్నాడు, తన మనోభిలాషను బట్టి తానేమి చేయదలంచాడో దానిని చేయవచ్చనుకుంటున్నాడు, తనెన్నడూ కదల్చబడడని అనుకుంటున్నాడు, తననడ్డుకొనే శక్తి ఏదీ లేదనుకుంటున్నాడు. 

10:7 నోరు... నాలుక అనే ఈ పదాలు ఇక్కడ శత్రువు నోటి నుండి వచ్చే విషపూరితమైన మాటల్ని వర్ణిస్తున్నాయి. ఇదే సాదృశ్యం 64:3 లో కూడా కనబడుతుంది, కత్తికి పదును పెట్టినట్టుగా శత్రువు - నాలుక పదునుగా ఉంటుంది. బాణాలు వదిలినట్టుగా వాడు నోటి నుండి విషపు మాటల్ని వదులుతుంటాడు. 

10:8-10 చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు అనే మాటలను మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు, గర్భస్రావాలతో చెలగాటమాడుతున్న ఫలితంగా శారీరకంగా, మనోవికారాలతో, ఆధ్యాత్మికంగా నశించిపోతున్న అనేక మందికి అన్వయించవచ్చు (వ.3తో పోల్చండి). (1) అలాంటివారు దురాశతో పేదలను, యువకులను, ఆలోచనలేని వారిని వారి వలలో వేసుకొంటున్నారు. వారి ఈ వ్యాపారం వలన కలిగే విషాదకరమైన బాధలను మరుగుపరచి, సాక్ష్యాల ద్వారా, ప్రకటనల ద్వారా కృత్రిమంగా కలిగే సంతోషాలను నొక్కి చెబుతున్నారు (వ.9). (2) దుష్టులైన వీరు దేవుని ముందు తమ అవినీతికి లెక్క చెప్పాలన్న విషయాన్ని దురహంకారంతో మరచిపోతున్నారు (వ.3-4,11,13). వారి అంతం విపత్కరమైనది (కీర్తన 73 చూడండి). వారి క్రియల్లో ఏ విశ్వాసీ పాల్గొనకూడదు. 

10:11 ఆయన నీతిమంతులను మరచిపోయెను అని చెప్పడానికి దేవుడు వెంటనే చర్య తీసుకోకపోవడాన్ని కారణంగా దుష్టులు చూపిస్తున్నారు. ఇది దుష్టులు దేవుడు లేడన్నట్టుగా ప్రవర్తించడాన్ని నొక్కి చెబుతున్నది. (వ.4). పైగా వారు దేవుడు తమనుండి దాక్కున్నాడని అహంభావపూరితంగా ఊహించుకుంటున్నారు. శ్రమననుభవిస్తున్న నీతిమంతులకు ఇదంతా ఒక కలవరపెట్టే ప్రశ్నగా కనబడుతుంది (వ.1). 

10:12-15 "లెమ్ము గురించి 7:6-8; 9:19-20 నోట్సు చూడండి. కీర్తన 9 లో ఉన్నది (కృతజ్ఞతాస్తుతి) కీర్తన 10 లో ఉన్నదానికి (విలాపం) భిన్నంగా ఉంది. ఇక్కడ దేవుడు బాధపడువారిని మరువక కాపాడాలని కీర్తనకారుడు ప్రాథేయపడుతున్నాడు. అయితే 9:12,18 లలో దేవుడు బాధపడేవారిని మర్చిపోక వారిని జ్ఞాపకం చేసుకుంటాడని ఉంది. ఇక్కడ దేవుడు ఏదీ పట్టించుకోవడం లేదని (నీవు విచారణ చేయవని) దుష్టులు తలంచుతున్నారని కీర్తనకారుడు చెబుతున్నాడు. అయితే 9:12 లో ఆయన విచారణ చేస్తాడని ఉంది. పైకి కనబడుతున్న దానికి వాస్తవస్థితికి మధ్య కీర్తనకారుని ఉద్వేగం విలాపకీర్తనల్లోని సాధారణానుభవం. తండ్రి లేనివారికి - హెబ్రీ సమాజంలో తండ్రిని కోల్పోవడం కుటుంబసభ్యుల్ని ఏ ఆస్తులు హక్కులు లేని నిరాధారులుగా, నిస్సహాయులుగా చేస్తుంది. దేవుడు దుష్టుల భుజమును విరగగొట్టడం వారిని నిస్సహాయుల్ని చేస్తుంది. (37:17), ఇక వారి దుష్టత్వము కనబడదు.

10:16-18 యెహోవా నిరంతరము రాజై యున్నాడు. కాబట్టి, ఆయన న్యాయం జయిస్తుంది. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి అనే ప్రకటన వాగ్దానదేశంలో కనానీయులు నిర్మూలం కావడాన్ని గుర్తుకు తెస్తున్నది. వాగ్దానదేశం యెహోవాది, ఆయన దానిని తన ప్రజలకు స్వాస్యంగా ఇచ్చాడు (ద్వితీ 7), అంతిమ ఫలితార్థం దుష్టులిక భయకారకులుగా ఉండరు సరిగదా వారినే భయం ఆవరిస్తుంది (9:20). 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |