Proverbs - సామెతలు 8 | View All

1. జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

2. త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది

3. గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది

4. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.

5. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.

6. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

7. నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

8. నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

9. అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.

10. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.

11. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.

12. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.

13. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.

14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.

15. నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
రోమీయులకు 13:1

16. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.

17. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు

18. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.

19. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.

20. నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.

21. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.

22. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
ప్రకటన గ్రంథం 3:14, యోహాను 1:1-2, యోహాను 17:24, కొలొస్సయులకు 1:17

23. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

24. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.

25. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు

26. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.

27. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.

28. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు

29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు

30. నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.

31. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.

32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు

33. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.

34. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.

35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.

36. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
8:1-3 వ్యక్తిత్వారోపణలో జ్ఞానము స్త్రీ లాగా (1:20-21), వచ్చి జ్ఞానాన్ని పొందమని జ్ఞానహీనులను ఆహ్వానిస్తుంది (8:5; 7:7 తో పోల్చండి). జార స్త్రీ రహస్యంగా పొంచి ఉండి సైగలతో, లాలనమాటలతో పిలిచినట్టుగా కాక, జ్ఞానం పట్టపగలు బహిరంగంగా ఆహ్వానం పలుకుతున్నది, ఆమె (జ్ఞానం) ఆహ్వానం దైవభక్తి సంబంధమైన మేలుల కోసమే గానీ, శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కాదు. ఆమె జ్ఞానం) వాగ్దానంలో జీవం ఉంది తప్ప, మరణం లేదు. జ్ఞానము, వివేచన అనే రెండూ “ఆమె" (జ్ఞానం) పేర్లు. 

8:4 నరులగు మీకే అంటే “ఆదాము సంతతి" అని అక్షరార్థం. మానవులారా అనే పదంతోబాటు “నరులగు మీకే” అనే పదం ఆమె (జ్ఞానం) ఆహ్వానం యొక్క విస్తృతిని నొక్కి చెబుతున్నది. (కీర్తన 49:1-2), లేదా తన శ్రోతల మర్యతను సూచిస్తుంది. (2దిన 14:11; కీర్తన 39:5; 90:3; యెషయా 51:12).

8:5 జ్ఞానము, జ్ఞానము లేని వారి గురించి 1:4 నోట్సు చూడండి. బుద్దిహీనుల గురించి 1:22 నోట్సు చూడండి. యోచించి అంటే అక్షరార్థంగా “ఆలోచించి అర్థం చేసుకోగల హృదయం", సరైన రీతిలో ఆలోచించే మనసు (4:23; 6:32 తో పోల్చండి). 

8:6 ఈ సందర్భంలో శ్రేష్ఠమైన అన్న పదం "నైతికంగా తిన్ననైన” అనే అర్ధాన్ని కూడా ఇస్తుంది. (వ.9), 8:7 అసహ్యము గురించి 3:32 నోట్సు చూడండి. 

8:8 కుటిలత గురించి 2:15 దగ్గర “వంకరవి” నోట్సు చూడండి. 

8:9 సునిశిత పరిశీలన, బుద్ధికుశలత, వివేచన ఉన్న వ్యక్తిని వివేకి అంటారు (1:5). తేటగా... యథార్థముగా అనే పదాలు మెలికలు, వంకరలు, పెడత్రో వలు లేకుండా కళ్లముందు సూటిగా కనబడడమనే అర్థాన్నిస్తాయి. ఎవరైతే తెలివి కోసం శ్రద్ధగా అన్వేషిస్తారో వారు దానిని కనుగొనగలరు (2:1-5). "

8:10 దైవజ్ఞానాన్ని అన్వేషించాలో లేదా ఐశ్వర్యాన్ని అన్వేషించాలో ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి, మూడవ మార్గం లేదు (4:27; మత్తయి 6:24). అయినా, జ్ఞానాన్ని అన్వేషించే వారికి తరచుగా భౌతిక సంపద కూడా ప్రతిఫలంగా లభిస్తుంది (వ.18-21; 1రాజులు 3:11-13 తో పోల్చండి). 

8:11 జ్ఞానము (వ.1,4,12) తనను తాను శ్రేష్టమైనది అని ప్రశంసించు కుంటుంది. 

8:12-14 జ్ఞానం ఇతర సుగుణాల్ని తన నివాసముగా చేసుకున్నానని చెప్పడంలో అది ఉన్నప్పుడు ఇక్కడ చెప్పినవి కూడా ఉంటాయనే అర్థాన్ని స్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు యేసు క్రీస్తు మనసు కలిగినవారుగా ఉంటారు కాబట్టి దేవుడు. చెడుతనము నెలా చూస్తాడో ఆయనకు భయపడేవారు కూడా చెడుతనాన్ని అలాగే దృష్టిస్తారు (1కొరింథీ 2:15-16). గర్వము అహంకారము అనేవి గర్వాన్ని వర్ణించే రెండు హెబ్రీ పదాలకు అనువాదం . ఒకటి 15:25;16:19, రెండవది 16:18 లో చూడవచ్చు. ఈ రెండూ దేవుని పరిపాలనను (అధికారాన్ని, ధిక్కరించేవారి స్వభావ లక్షణాలు. సఫలతనిచ్చే యోచనల్ని లేదా సలహాల్ని ఆలోచన... లెస్పైన జ్ఞానము అనే పదాలు సూచిస్తున్నాయి (19:20; 20:18; యెషయా 28:29). ఈ గుణలక్షణాలు దేవునికి సంబంధించినవి (యోబు 12:13). దేవుని పట్ల భయభక్తులున్న వారికి జ్ఞానం యొక్క గుణలక్షణాలు కలిగేలా పరిశుద్ధాత్మ (యెషయా 11:2), కుమారుడు (1కొరింథీ 1:30) మధ్యవర్తులుగా ఉంటారు. 8:15-16 రాజకీయాధికారం, న్యాయాధికారం ఉన్నవారు దైవసంబంధమైన జ్ఞానం ద్వారా మాత్రమే విజయం సాధించ గలుగుతారు. ఘనులైన వీరు రాజాస్థానాల్లో గౌరవాన్ని ఘనతను పొందిన ప్రభావశీలురు (17:7,26; 19:6; 25:7), వీరు మొరటువారైన మూర్తులకు పూర్తిగా భిన్నమైనవారు (యెషయా 32:5,8). "ఘనులైన” అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం దయాగుణం, దానగుణం ఉన్నవారికి సైతం వర్తిస్తుంది. (నిర్గమ 35:5,22; 2దిన 29:31; కీర్తన 51:12).

8:17 భావోద్వేగపూరితమైన తృష్ణనీ, ఓర్పుతో కూడిన ప్రయత్నాన్ని ప్రేమించు, వెదకు అనే పదాలు సూచిస్తున్నాయి.

8:18 ఐశ్వర్య ఘనతలును అంటే సమాజంలో ఎటువంటి మచ్చ పడకుండా జ్ఞానం అనుగ్రహించే సిరిసంపదలు, మంచి పేరు (3:16; 11:16; 22:4; యాకోబు 2:6; 5:1). విచిత్రమేమిటంటే కేవలం ఐశ్వర్యాన్ని మాత్రమే అన్వేషించేవారు అవమానాన్ని పొందుతారు (యిర్మీయా 17:11; 1తిమోతి 6:10). ఈ లోకంలో తరిగిపోని సంపదలు (11:7; 13:11; 27:23-24; 28:22), పరలోకంలో సైతం లభించే సంపదలను, ధననిధులను (మత్తయి 6:20; 1తిమోతి 6:17-19) స్థిరమైన కలిమి అనే మాటలు సూచిస్తున్నాయి. 

8:19 ప్రశస్తమైన అంటే "శ్రేష్ఠమైన” అనీ, కోరుకొనదగినది, మేలైనది అనీ అక్షరార్ధం (కీర్తన 132:13). 

8:20-21 జ్ఞానం- నేను. “నడచుచున్నాను" అనడం - జ్ఞానం కనబడే స్థలాలను, జ్ఞానాన్ని అనుసరించేవారు. ప్రతిఫలం పొందేలా అది వారిని నడిపించే స్థలాలను సూచిస్తుంది. జ్ఞానమార్గము భక్తిహీనులు, బుద్ధిహీనులు నడిచే నాశనకరమైన మార్గాలకు భిన్నమైనది. (2:15; 4:14; 5:8-10; 22:5 చూడండి; 1:15 నోట్సు చూడండి). ఆస్తికర్తలు గురించి 3:35 నోట్సు చూడండి. 

8:22-29 భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వమే దేవుడు జ్ఞానాన్ని కలుగజేసెను. తరవాత, దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు జ్ఞానం దానికి సాక్షిగా ఉంది. సృష్టిలో జ్ఞానం యొక్క నైపుణ్యం ఉంది. కాబట్టి, మానవులకు సృష్టి గురించి వివరించడంలో జ్ఞానానికి విశిష్టమైన స్థానముంది. (యోబు 38:2-4). విషయ పరిజ్ఞానం మీద ఆధారపడిన నైపుణ్యమే జ్ఞానం కాబట్టి, అది సృష్టిలో అస్తిత్వమున్న ఇతరమైన వాటిలాంటిది కాదు. దేవుడే జ్ఞానాన్ని కలుగజేశాడని చెప్పడం అలంకారిక వర్ణన. నిజమైన జ్ఞానం దేవుని నుండి మాత్రమే కలుగుతుంది. దేవుడే జ్ఞానాన్ని సృష్టించాడనే భావన అన్నిటినీ దేవుడే సృష్టించాడు కాబట్టి కలిగినవన్నీ ఆయన అనంతజ్ఞానం నుండి కలిగినవేనని సైతం తెలియజేస్తుంది. జ్ఞానం సృష్టికి పూర్వమే ఉంది కాబట్టి, విశ్వసృష్టిలో జ్ఞానానికి ప్రమేయం ఉంది కాబట్టి (3:19-20; 8:22,30), క్రీస్తు గురించి కూడా ఇవే మాటలు చెప్పబడ్డాయి కాబట్టి (యోహాను 1:3; 1కొరింథీ 8:6; కొలస్సీ 1:15-16), జ్ఞానాన్ని క్రీస్తుతో తాదాత్మ్యం చేయడం (గుర్తించడం) జరిగింది. ఏదేమైనా, “సామెతలు" గ్రంథం లోని "జ్ఞానం" గురించిన ప్రస్తావనను కొత్త నిబంధనలో క్రీస్తు జననానికి ముందు ఆయన ఉనికిని వివరించడానికి ఉదహరించలేదు, "జ్ఞానం” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదమైన సోఫియా ని కూడా క్రీస్తు జననపూర్వ అస్తిత్వం గురించి తెలియజేయడంలో ఉదహరించలేదు. మరొక విషయం.8:22-25 వచనాల్లో జ్ఞానం గురించి “కలుగజేసెను” “నియమింపబడితిని" "పుట్టితిని” అని ఉండగా, క్రీస్తు దానికి భిన్నంగా తండ్రితో బాటు నిత్యుడై ఉన్నాడు. జ్ఞానం సృష్టికి ఒక సాక్షి, క్రీస్తు సృష్టికర్త (యోహాను 1:3; కొలస్సీ 1:16). దేవుని జ్ఞానాన్ని ప్రాయశ్చిత్తం ద్వారా క్రీస్తు వెల్లడిచేశాడు (1కొరింథీ 1:20-25,30-31), ప్రాయశ్చిత్త కార్యంలో జ్ఞానానికి ప్రమేయం లేదు. క్రీస్తుకు, జ్ఞానానికి కొన్ని సామ్యాలున్నా జ్ఞానంకంటె క్రీస్తు శ్రేష్ఠుడు. (మత్తయి 12:42), క్రీస్తే జ్ఞానానికి మూలం, జ్ఞానానికి పరిపూర్ణమైన వ్యక్తీకరణ క్రీస్తే. 

8:30-31 జ్ఞానం దేవుని యొద్ద ఉంది. అయితే దేవుడు మాత్రమే సృష్టికర్త. జ్ఞానం దేవుడు సమస్తాన్ని సృష్టించడం చూచి సంతోషించుచు ఉంది. సృష్టికర్తయైన దేవుణ్ణి గుర్తించకుండా సృష్టిని ప్రస్తుతించడం పాపమవుతుంది. సృష్టి యావత్తులో జానాన్ని బట్టి ఆనందించ గలిగినవారు మానవులు మాత్రమే. 

8:32-34 కావున అనే మాట పైనున్న వచనాలకు సహేతుకమైనముగింపును సూచిస్తుంది. జ్ఞానం పురాతనమైనది కాబట్టి, సృష్టి జరిగినప్పుడు దేవునితో ఉండి మానవులను చూసి ఆనందించింది కాబట్టి వారు ఏ విధంగా నిజంగా ధన్యులు కాగలరో జ్ఞానం మానవులకు బోధించగలదు (3:13-18 నోట్సు చూడండి). 
ముఖ్యాంశమేమిటంటే, మానవులు జ్ఞానానికి చెవియొగ్గాలి, జ్ఞానోపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు (1:25; 13:18; 15:32), జ్ఞానాన్ని కోరుకుంటూ జ్ఞానం యొక్క ఆహ్వానం తప్పిపోకుండా ఉండడం కోసం జానం యొక్క ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండాలి (9:4).

8:35-36 జీవమును గురించి 3:22. నోట్సు చూడండి.. కనుగొనును అనే పదానికి పాపం పూర్తిగా భిన్నమైన పదం. కనుగొనని అనే పదం గురి తప్పడాన్ని (పాపాన్ని) సూచిస్తుంది. (యెషయా 65:20) యెహోవాను ఎవరు సంతోషపెడతారో, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడో వారిమీద ఆయన కటాక్షము ఉంటుంది (11:20; 12:2,22; 15:8; 18:22). హాని అనే మాట బలాత్కారం లేదా దౌర్జన్యాన్ని (విలాప 2:6; యెహె 22:26; "జెఫన్యా 3:4), లేదా క్రూరత్వాన్ని (యిర్మీయా 22:3) సూచిస్తుంది. జ్ఞానాన్ని త్రోసివేయడం అంటే , స్వయంగా నాశనం కొనితెచ్చుకున్నట్టే (1:18-19,31-32; 2:18-19; 26:6; 29:6,24).


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |