8:1-2 కుష్ఠరోగము గురించిన గ్రీకుపదం శిలీంధ్ర సంబంధమైన అంటు రోగం (ఫంగల్ ఇన్ఫెక్షన్) నుండి హాన్ సైన్ వ్యాధివరకు, అనేకరకాల స్థితులను గూర్చి సూచిస్తుంది. పా.ని. ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగులను సమాజం నుండి వెలివేయాలి (లేవీ 13:45-46). ఈ వ్యక్తి యేసు ముందు మోకరించి, ఆయనను ప్రభువా (గ్రీకు.
"కురియోస్"- హెబ్రీ. "యావే"కు గ్రీకు తర్జుమా) అని పిలవడం ద్వారా యేసును మానవునికంటే ఉన్నతమైనవాడని గుర్తించాడు.యేసు తన స్థితిని బాగుచేయగల సామర్థ్యం ఉన్నవాడని నమ్మడం, అతని ఆరాధన యేసు దైవత్వాన్ని పూర్తిగా గుర్తించినట్లయింది. పా.ని.లో కేవలం దేవుడు మాత్రమే కుష్ఠరోగులను బాగు చేయగలిగేవాడు కదా (నిర్గమ 4:6-7; సంఖ్యా 12:10-16; 2రాజులు 5:1-15- ముఖ్యంగా వ.7). అతని యోగ్యత, నీకిష్టమైతే అనే మాట స్వస్థపరుస్తామని చెప్పుకునే వారెవరూ అతనిని స్వస్థపరచలేకపోయారు అని సూచిస్తుంది.
8:3 యేసు తరచూ ముట్టుకోవడం ద్వారా స్వస్థపరచినప్పటికీ వ.15; 9:20,25) ఆయన తన మాట ద్వారా, రోగి చాలా దూరంలో ఉండగా కూడా స్వస్థపరచగలడు (8:5-13; 9:6). కుష్ఠరోగిని ముట్టడం అనేది ధైర్యాన్ని, గాఢమైన కనికరాన్ని వ్యక్తపరచడానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే కుష్ఠరోగిని ముట్టడం పా.ని. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధం (లేవీ 5:3).
8:4 యాజకుడు పరీక్షించి, - అతడు శుద్దుడని నిర్ణయించాక, స్వస్థత పొందినవాడు యేసు చేసిన అద్భుతాన్ని నిర్ధారించుకోగలడు.
8:5-6 శతాధిపతి రోమా సైన్యంలో వందమంది సైనికులపై అధికారి.
8:7-10 ఒక అన్యజనుని ఇంటిలో ప్రవేశించడానికి యేసు సమ్మతించడం శతాధిపతిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే యూదా ధర్మశాస్త్రం ప్రకారం యూదులు ఇలా చేయడం నిఘం (అపొ.కా. 10:28). అన్యజనులకు దేవుని కృప, ఆయన విమోచన ప్రణాళికలో వారిని కూడా చేర్చడం అనేది మత్తయి సువార్తలో ఒక ముఖ్యమైన అంశం. తన సేవకుడు వేరే చోట ఉన్నప్పటికీ యేసు అతనిని స్వస్థపరిచే అధికారంగలవాడని శతాధిపతి నమ్మాడు.
8:11 యేసులో విశ్వాసముంచిన ఎవరికైనా దేవుని రాజ్యం తెరవబడి వుంది. విశ్వసించే అన్యజనులు, గొప్ప యూదా పితరులైన అబ్రాహాము... ఇస్సాకు... యాకోబులతో సమానంగా ఉంటారు.
8:12 రాజ్య సంబంధులు అనే మాట అసలు రాజ్యం ముందుగా వాగ్దానం చేయబడిన యూదులను సూచిస్తుంది. కానీ వారు యేసును తృణీకరించినం దున, తొలగించబడబోతున్నారు. వెలుపటి చీకటి అనే మాటలు ప్రాచీన
యూదుల లేఖనాలలో శిక్షను సూచించే పదాలు. ఏడ్పును పండ్లు కొరుకుటయు అనేవి నిత్యశిక్ష పొందినవారి బాధను వ్యక్తీకరించే పదాలు.
8:13 యేసులో శతాధిపతి చూపిన విశ్వాసం తెలివైన విధంగా ఉంది.
8:14 పేతురు అత్తను పేర్కొనడం పేతురుకు వివాహమైందని నిర్ధారిస్తుంది. అపొస్తలులు పెళ్ళిచేసుకుని, వారి పరిచర్యలలో వారి భార్యలను వెంట పెట్టు కుని తీసుకువెళ్ళవచ్చు అనే పౌలు వాదనకు (1కొరింథి 9:5) పేతురు వివాహమే ఆధారం.
8:15 ఆమె వెంటనే లేచి, వారికి ఉపచారం చేయగలగడం ఆమె తక్షణమే సంపూర్ణ స్వస్థతపొందిందని సూచిస్తుంది.
8:16 మాటచే దయ్యములను వెళ్ళగొట్టగలిగే యేసు సామర్థ్యం, యూదులలో దయ్యములు వెళ్ళగొట్టే విపరీతమైన తంతుకు భిన్నంగా నిలిచింది. వారు ఉపయోగించే విధానాలలో, అభ్యంతరకరమైన దుర్వాసనలు, లేక దయ్యాలను పట్టుకోవడానికి ముక్కుకు సూత్రాలు ఉండేవి. రోగులనెల్లను యేసు స్వస్థపరచగలగడం, ఎలాంటి రోగమైనా ఆయన స్వస్థత శక్తిని అడ్డుకోలేదని సూచిస్తుంది.
8:17 ఒకవిధంగా చెప్పాలంటే, యేసు త్యాగపూరిత మరణం పాపంనుండి ఆధ్యాత్మిక ప్రాయశ్చిత్తాన్ని కొనడమే ఆయన శారీరక రోగాలను బాగుచేయ గలగడానికి కారణం. ప్రతి రోగము ఆదాము పాపపు ఎంపిక పర్యవసానమే. సిలువపై పాపానికి తగిన పూర్తి శిక్షను యేసు భరిస్తాడు కాబట్టి యేసు. ఈ పర్యవసానాలను తొలగించగలడు. యెషయా 53:4ను ఇక్కడ అన్వయించడం యేసు మరణాన్ని ఒక ప్రత్యామ్నాయ కార్యం అని మత్తయి అర్థం చేసుకున్నట్లు చూపుతుంది. ఆ ప్రాయశ్చిత్తంలో “మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను” అని, “మన సమాధానార్థమైన శిక్ష” అతని మీద పడెను అని యేసును గూర్చి చెప్పబడింది (యెషయా 53:5-6).
8:18-20 యేసును వెంబడించడానికి ఇంటిలోని సౌఖ్యాలను త్యాగం చేయాల్సివుంటుంది. యేసు అంతకంటే ఎక్కువ త్యాగానికి అర్హుడు. ఎందు కంటే ఆయన మనుష్యకుమారుడు. ఈ పేరు దానియేలు 7:13-14 నుండి తీసుకున్నాడు. అక్కడ ఆ మాట పరలోకం నుండి వచ్చి విశ్వవ్యాప్తంగా నిత్యరాజ్యాన్ని ఏలే ఒక పాలకునిగూర్చి వివరించింది. ఇది యేసు తనకు తాను ఇచ్చుకున్న ఇష్టమైన సొంత హోదా, అది మత్తయిలో 28 సార్లు ఉపయోగించబడింది.
8:21-22 యేసు అడిగింది ఆధునిక పాఠకులకు కటువుగా అనిపించవచ్చు. ఎందుకంటే నేడు జరిగే సమాధి కార్యక్రమాలు యేసును వెంబడించడానికి కొద్దిసేపు మాత్రమే ఆలస్యమయ్యేటట్లు చేస్తుంది. అయితే ప్రాచీన యూదుల సమాధి కార్యక్రమాలు ఒక సంవత్సరంపాటు సాగేవి. పద్ధతి ప్రకారం సమాధిచేసిన సంవత్సరం తర్వాత పెద్దకుమారునికి సమాధిలో మిగిలిన ఎముకలను తీసుకుని రెండవ సారి సమాధిచేసి పూడ్చాల్సిన బాధ్యత ఉండేది. యూదులలో అనేకులు తల్లిదండ్రులను సన్మానించడం అనేది ముఖ్యమైన ఆజ్ఞగా ఎంచేవారు. ఆ సన్మానించడంలో తల్లిదండ్రులను గౌరవప్రదంగా సమాధిచేయడం ఒక ముఖ్యమైన భాగం. అంటే తనను వెంబడించడం దానికంటే ఎక్కువ ప్రాధాన్యతగలదిగా ఉండాలని యేసు నొక్కి చెప్పాడు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతకంటే దేవునిపట్ల బాధ్యత ఎక్కువ (ద్వితీ 13:5-6) కాబట్టి యేసు తన బోధలో ఈ ప్రత్యేక గౌరవాన్ని ఆశించాడు.
8:23-27 గాలి... సముద్రములపై యేసు అధికారం, ఆయనను సృష్టికర్తగా, ప్రకృతిని పాలించేవానిగా గుర్తించింది.
8:28 ప్రాచీన మత్తయి సువార్త ప్రతులలో ఈ సంఘటన గదరేనీయుల దేశములో జరిగినట్లు వివరించబడింది. దానికి విరుద్ధంగా, మార్కు లూకాల ప్రాచీన ప్రతులు అది “గెరాసేనుల దేశము"లో జరిగినట్లుగా వర్ణించాయి (మార్కు 5:1; లూకా 8:26). గదర, గెరాస రెండూ అదే ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి పేర్ల మార్పు ఇక్కడ ప్రాముఖ్యం కాదు, అవి బహుశా ప్రతులు ఎత్తి రాయడంలో వచ్చిన తేడావల్ల అయివుంటుంది కానీ సువార్తల మూల ప్రతులలో వ్యత్యాసాన్ని గూర్చి వివాదం ఏమీ లేదు. ఈ ప్రాంతాలు అన్యజనులకు చెందినవి. అక్కడున్న పెద్ద పందుల మంద ఆ విషయాన్ని
సమాధి గుహలు. దయ్యములు పట్టినవారు సమాధుల మధ్య ఉండడం అపవిత్రమైన స్థలాలపట్ల వాటి ఆసక్తిని సూచిస్తుంది.
8:29 యేసు శిష్యులు ఆయన దేవుని కుమారుడని గుర్తించడానికి ఆలస్యం చేసినప్పటికీ, దయ్యాలు ఆలస్యం చేయలేదు. యేసు బాప్తిస్మం పొందినపుడు మొదటిసారి దేవుని కుమారునిగా తండ్రిచేత గుర్తించబడ్డాడు. (3:17). తరువాత సాతాను యేసు దైవ కుమారత్వాన్ని గుర్తించాడు (4:3,6). ఇప్పుడు దయ్యాలు యేసు గుర్తింపును మరలా చెప్పాయి. దేవుని కుమారుడు అనే మాట కీర్తన 2:7,12 నుండి తీసుకోబడిన మెస్సీయ పేరు (మత్తయి 3:17 నోట్సు చూడండి). తమకు తీర్పు తీర్చి, శిక్ష విధించేవానిగా కూడా యేసును దయ్యములు గుర్తించాయి.
8:30-32 ఆ ఇద్దరు మనుష్యుల జీవితంలో తమ నాశనకరమైన, హింసా త్మక చర్యలను కొనసాగించలేక తమను ఒక పందుల మందలోకి వెళ్ళడానికి అనుమతి కోసం దయ్యాలు అర్థించాయి. ఆ మందంతా బుద్ధిహీనంగా నాశనానికి పరుగెత్తిన దృశ్యంలో వాటి మోసపూరిత, హంతక స్వభావం స్పష్టంగా కనిపించింది. ఇది లోకాన్ని చిట్టచివరిగా సాతాను ఏమి చేయాలని కోరుకుంటున్నాడో తెలియజేసే దృశ్యం.
8:33-34 దగ్గరున్న పట్టణంలోని అన్యజనులు, తమ విగ్రహారాధన, అపవి త్రతకు విరుద్ధంగా యేసు వ్యక్తిగతంగా తమ మందలను నాశనం చేసాడని భావించి విలువైన తమ మిగిలిన మందలుకూడా నాశనమౌతాయని భయపడ్డారు (వ. 28 నోట్సు చూడండి)