Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.
2. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి
3. ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.
4. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.
5. కొందరు ఇది అందమైన రాళ్లతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి, మాటలాడుచుండగా
6. ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండ కుండ అవి పడద్రోయబడు దినములు వచ్చు చున్నవని చెప్పెను.
7. అప్పుడు వారు బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా
8. ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.దానియేలు 7:22
9. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.దానియేలు 2:28
10. మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;2 దినవృత్తాంతములు 15:6, యెషయా 19:2
11. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
12. ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.
13. ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.
14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.
15. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
16. తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;
17. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
18. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.1 సమూయేలు 14:45
19. మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
20. యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
21. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.
22. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.ద్వితీయోపదేశకాండము 32:35, యిర్మియా 46:10, హోషేయ 9:7
23. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.
24. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.ఎజ్రా 9:6, కీర్తనల గ్రంథము 79:1, యెషయా 63:18, యిర్మియా 21:7, దానియేలు 9:26, దానియేలు 12:7, జెకర్యా 12:3, యెషయా 24:19, యెహెఙ్కేలు 32:7, యోవేలు 2:30, యోవేలు 2:31
25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.కీర్తనల గ్రంథము 46:2-3, కీర్తనల గ్రంథము 65:7, యెషయా 13:10
26. ఆకాశమందలి శక్తులు కదిలింప బడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.యెషయా 34:4, హగ్గయి 2:6, హగ్గయి 2:21
27. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.దానియేలు 7:13
28. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
29. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.
30. అవి చిగిరించుటచూచి వసంత కాలమప్పుడే సమీపమాయె నని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?
31. అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.
32. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
33. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.
34. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
35. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.యెషయా 24:17
36. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.
37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
38. ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.