8:12 నేను లోకమునకు వెలుగును అని యేసు చెప్పిన ఈ మాటలు (6:35,48 నోట్సు చూడండి), “మనుష్యులకు వెలుగైయుండెను”, “ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది" అని ఉపోద్ఘాతంలో (1:4-5) నిశ్చయంగా చెప్పబడిన విషయాలను మరింతగా విస్తరిస్తున్నాయి. దీని ఆధారంగా, తాను వారితో ఉన్నంతకాలం ఈ వెలుగునందు విశ్వాసముంచమని యేసు తన శ్రోతలను ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడు వారు “వెలుగు సంబంధులు" అవుతారు (12:35-36). తనయందు విశ్వాసముంచు వారెవరూ చీకటిలో ఉండకుండునట్లు తాను ఈ లోకంలోనికి వెలుగువలె వచ్చాననేది యేసు ఇచ్చిన ముగింపు సాక్ష్యం (12:46). అయినప్పటికీ, సువార్తికుడు చెప్పినదాన్ని బట్టి, తీర్పు ఇదే: వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవైనందున, జనులు వెలుగుకన్నా చీకటినే ప్రేమించారు (3:19-21).
8:13-14 పరిసయ్యుల సవాలు, యేసు జవాబు, 5:31-47 లోని తీక్షణతను కొనసాగిస్తాయి. మరలా మోషే నియమాలు చర్చకు వచ్చాయి (ద్వితీ 17:6; 19:15). 8:14,18 తన గురించి తాను చెప్పుకున్న యేసు సాక్ష్యాన్ని గురించి, 5:31-47 నోట్సు చూడండి.
8:15-16 యేసు వ్యాఖ్య 1సమూ 16:7ను ప్రతిధ్వనించి వుండవచ్చు. యేసు రాజరికపు ఆర్భాటంతో రాలేదు కాబట్టి ప్రజలు ఆయనను తిరస్కరించారు, కానీ పైకి కనిపించేది మోసం కావచ్చు (యెషయా 53:2-3).
8:17-18 ఇద్దరు మనుష్యుల సాక్ష్యము గురించి, ద్వితీ 17:6-7; 19:15 నోట్‌ను చూడండి.
8:19 వారి ప్రశ్న- వారికి యేసు ఎవరో తెలియదనీ, అలాగే దేవుని కూడా వారు ఎరుగరనీ సూచిస్తుంది. 8:20 యేసు గడియ గురించి, 2:4 నోట్సు చూడండి.
8:21-23 మీరు నన్ను వెదకుదురు అంటే బహుశా యేసు మరణ, పునరుత్థాన, ఆరోహణాల తర్వాత కూడా, వారు ఇంకా మెస్సీయ కోసం ఎదురుచూస్తూ ఉంటారని కావచ్చు (డి. ఎ. కార్సన్).
8:24,28 ఈ వ్యాఖ్యలు యేసు దైవత్వాన్ని సూచిస్తున్నట్లున్నాయి (6:35,48 నోట్సు చూడండి).
8:25-27 నీవెవరవనే ప్రశ్న, వివరాలు చెప్పమనే మనవితో కూడినదిగా కాక, నిన్ను నీవు ఎవరనుకుంటున్నావు? అన్న భావనతో సవాలుగా చేస్తున్నట్లు ఉంది.
8:28 యేసు పైకెత్తబడడాన్ని గురించి, 3:14-15 నోట్సు చూడండి.
8:29 ఇది యేసు పాపరహితుడని చెబుతుంది.
8:30-32 యేసును అనుసరించ కొనసాగడం ద్వారా ఒక శిష్యుడు తన యథార్థతను. నిరూపించుకుంటాడు. కాబట్టి అబద్దపు శిష్యుడు లేక నకిలీ శిష్యుడు అనేవాడు ఉన్నాడు. సత్యమును గ్రహించడం అంటే క్రీస్తును ఎరగడం.
8:33 పా.ని., అబ్రాహాము సంతానము అయినందున వచ్చే ఆశీర్వాదాలను కొనియాడుతుంది (కీర్తన 105:6; యెషయా 41:8).
8:34-35 కుమారునికి దాసునికి ఉన్న భేదం, అబ్రాహాముకు శారాద్వారా పుట్టిన పిల్లలకు, హాగరు ద్వారా పుట్టిన పిల్లలకు ఉన్న తేడాను ప్రస్తావిస్తున్నట్లు కావచ్చు (ఆది 21:1-21; నిర్గమ 21:2 చూడండి).
8:36 యేసు జీవమునిచ్చే కుమారుడు అనే విషయాన్ని గురించి, 3:16-18 నోట్సు చూడండి.
8:37-38 పా.ని.లో కూడా, ఒకని వంశావళిని స్థాపించడానికి అబ్రాహాము శారీరక సంతానమైనంత మాత్రాన సరిపోదు. (యిర్మీయా 9:25-26తో రోమా 2:28-29; 9:7; గలతీ 4:21-31 పోల్చండి).
8:39-58 దేవుని పిల్లలను గురించి, 3:3-8 నోట్సు చూడండి.
8:40 యేసు వారిని కావాలనే అపవాది పిల్లలని పిలిచాడు, దానికి వారు తాము అబ్రాహాము పిల్లలమని జవాబిచ్చారు. ఇక్కడ యేసు అది నిజం కాదని వాదిస్తున్నాడు.
8:41 ఇశ్రాయేలీయులను దేవుని పిల్లలు అని పా.ని. పిలుస్తున్నా (నిర్గమ 4:22; ద్వితీ 14:1-2; 32:6; యెషయా 63:16; 64:8; యిర్మీయా 31:9; మలాకీ 2:10), (విశ్వాసము ద్వారా) దేవునినుండి పుట్టినవారే దేవుని పిల్లలని యోహాను అన్నాడు (యోహాను 1:12-13; 3:3-8).
8:42-43 తాము దేవుని పిల్లలమని యూదులు ఇంకా అంటున్నారు; వారు దేవుని పిల్లలు కారని నిరూపించడానికి యేసు ముందుకు వెళ్ళాడు.
8:44 అపవాది ఆదినుండి... నరహంతకుడై యున్నాడు. హేబెలును చంపడానికి వాడు కయీనును ఉసిగొల్పాడు (1యోహాను 3:15). వాడు సత్యమందు నిలిచినవాడు కాడు అనే మాటలు, సాతాను పడిపోవడాన్ని సూచిస్తుండవచ్చు (యెషయా 14:12), ఆదాము, హవ్వలు పతనమైనప్పుడు, వాడు ఘోరంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడాడు (ఆది 3:3-4తో ఆది 2:17 పోల్చండి).
8:45-46 యేసు - ఎల్లప్పుడూ దేవునికి -- ఇష్టమైనదే చేశాడు. (వ.29;యెషయా 53:9).
8:47 మీరు దేవుని సంబంధులు కారు అని యేసు యూదులతో ధైర్యంగా, స్పష్టంగా చెప్పాడు. 8:48,52 యేసు దయ్యము పట్టినవాడని ఆరోపించడాన్ని గురించి 7:20 నోట్సు చూడండి.
8:49-53 తాను దయ్యము పట్టినవాడని వారంటున్న మాటలను ఖండిస్తూ తాను తన తండ్రిని ఘనపరుస్తున్నానని యేసు చెప్పాడు. తరువాత, తన మాటలను పాటించడమే మరణాన్ని తప్పిస్తుందని ఆయన ధైర్యంగా చెప్పాడు. విశ్వాసము గల గొప్పవారందరూ మరణించారు కాబట్టి ఇది యూదులకు పిచ్చితనంగా అనిపించింది. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని వారు
ప్రశ్నించారు.
8:54-55 దేవుడు తనను మహిమపరుస్తున్నాడు కాబట్టి, యేసు తనను తాను మహిమపరచుకో నక్కరలేదని వారికి జవాబిచ్చాడు. 8:56 మెస్సీయ రాబోతున్నాడనే అబ్రాహాము సంతోషకరమైన ఆశను యేసు వ్యాఖ్య సూచిస్తుంది. యెషయా యేసు మహిమను చూశాడనే నిర్ధారణ కోసం 12:41 చూడండి.
8:57-58 నేను అనే యేసు వ్యాఖ్యలను గురించి 6:35,48 నోట్సు చూడండి,
8:59 దేవదూషణకు రాళ్ళతో కొట్టి చంపడమే శిక్షగా చెప్పబడింది. (లేవీ 24:16ను ద్వితీ 13:6-11; యోహాను 10:31-33; 11:8 తో పోల్చండి). అయితే ఇది ఎన్నడూ హింసాత్మకంగా జరగనక్కరలేదు. (ద్వితీ 17:2-7), పా.ని.లో మోషే (నిర్గమ 17:4) యెహోషువ, కాలేబు (సంఖ్యా 14:10), దావీదు (1సమూ 30:6) వంటి నీతిమంతులు రాళ్ళతో కొట్టబడినంత పనయ్యింది. ముందటి సందర్భాలలో వలె, యేసు పట్టుబడకుండా తప్పించుకున్నాడు (యోహాను 7:30,44; 8:20; 2:4 నోట్సు చూడండి), ఆయన యూదులనుండి దూరంగా వెళ్ళిపోవడం, సౌలు రాజుకు దేవుని దయ దూరం కావడమనే తీర్పుతో (1సమూ 15:23) సమానమైనదిగా అనిపిస్తుంది.