Acts - అపొ. కార్యములు 12 | View All

1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.

3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైని కులకు అతనిని అప్పగించెను.

5. పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.

6. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.

7. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

8. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

9. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.

10. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11. పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.

13. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.

14. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.

15. అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.

16. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.

17. అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి

18. తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.

19. హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.

20. తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
1 రాజులు 5:11, యెహెఙ్కేలు 27:17

21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా

22. జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
యెహెఙ్కేలు 28:2

23. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
దానియేలు 5:20

24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.

25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.



బైబిల్ అధ్యయనం - Study Bible
12:1 ఈ రాజైన హేరోదు, మొదటి హేరోదు. అగ్రిప్ప. ఇతడు పాలస్తీనాను క్రీ.శ. 37-44 వరకు పాలించాడు. ఇతడు మహా హేరోదు. (మత్తయి 2 చూడండి) మనుమడు. ఇతని దాడి ముఖ్యంగా యెరూషలేములోని అపొస్తలులపై కేంద్రీకరించబడింది.

12:2 హేరోదు చంపించిన యాకోబు, జెబెదయి కుమారులలో ఒకడు, యోహాను సహోదరుడు. 

12:3-5 పేతురును మూడేసి గంటలపాటు, నలుగురు సైనికుల చొప్పున కాపలా కాసివుంటారు. అపొస్తలులను తాము చెరలో ఉంచడానికి ప్రయత్నించిన అనుభవాన్ని బట్టి (5:19) మహాసభ వారు ఇంత భారీగా కాపలా వుంచమని హేరోదుకు సలహా ఇచ్చివుంటారు. 

12:6-10 పేతురు మరలా ప్రభువు దూత ద్వారా చెరసాలలో నుండి తప్పించబడ్డాడు (5:19-20 నోట్సు చూడండి). ఈ సారి మాత్రం మొదట తాను దర్శనం చూస్తున్నానని మాత్రమే అతడు అనుకున్నాడు. 

12:11 యేసు కూడా ఒకసారి హేరోదు చేతి నుండి తప్పించబడ్డాడు, అయితే ఆ హేరోదు రాజు వేరు (మత్తయి 2:13-15) 

12:12-16 లోపల అందరూ పేతురుకోసం ప్రార్థిస్తున్నారని ఎరిగి, ముందు పేతురును లోపలికి రానివ్వడం గురించి ఆలోచించకుండా, వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడని చెప్పడానికి రొదే వెనక్కి పరుగెత్తింది. విచిత్రంగా వారు ఆమెను నమ్మకుండా, అది పేతురు దూత అయివుంటుందని సూచించారు. యూదులకు కావలి దూతలయందు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అంతేకాక హింస ఎంత దారుణంగా ఉంది అనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఎందుకంటే మీ కావలి దూత కొన్నిసార్లు మీరు మరణించిన తరువాత వెంటనే ప్రత్యక్షమౌతుందని వారు నమ్మేవారు. కాబట్టి అక్కడున్న విశ్వాసుల బృందం పేతురు విడుదల పొందాడు అని నమ్మడంకంటే పేతురును చంపేసి వుంటారని నమ్మడానికి సిద్ధపడ్డట్లుగా కనిపిస్తుంది.

12:17 పేతురు వేరొకచోటికి వెళ్ళెను అంటే బహుశా హేరోదు, యూదుల అధికారులు తనను విచారించకుండా చేయడానికి కావచ్చు. దేవుడు అతన్ని ఆశ్చర్యరీతిగా తప్పించాడు. కానీ ఈ స్వేచ్ఛను పేతురు విచక్షణ లేకుండానో లేక అవివేకంగానో ఉపయోగించవచ్చని కాదు. యేసు సహోదరుడైన యాకోబుకు చెప్పమని అక్కడున్నవారికి పేతురు సూచించాడు. ఈ యాకోబు పేరు అపొ.కా. లో మొదటిసారి పేర్కొన్నది. ఇక్కడే. యాకోబు యేసు పునరుత్థానుడయ్యే వరకు ఆయనను అనుసరించలేదనేది స్పష్టం (1కొరింథీ 15:7). తరువాత అతడు యెరూషలేము సంఘంలో ఒక నాయకునిగా ఎదిగాడు (అపొ.కా. 15:13-21; గలతీ 1:19). 

12:18-19 జస్టినియన్ రాసిన రోమా చట్టం ప్రకారం ఒక ఖైదీ తప్పించు కుంటే అతను పొందాల్సిన శిక్ష అతనికి కాపలా కాస్తున్న సైనికులే భరించాలి. దీన్ని బట్టి వారు పేతురును చంపించాలనుకున్నారని మనకు తెలుస్తుంది.

12:20-22 నియమింపబడిన దినమందు తన ప్రజల నుండి పొగడ్తలు పొందేలా హేరోదు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ దేవుని ఆలోచనలు వేరేలా ఉన్నాయి (వ.23). 

12:23 కేవలం దేవునికి మాత్రమే చెందాల్సిన ఘనత మహిమ తనదిగా భావించాడు కాబట్టి హేరోదు ప్రాణము విడిచాడు. హేరోదు వెంటనే మరణించ డాన్ని గురించి అనేక ఊహాగానాలున్నాయి- విషప్రయోగం, పేగుల వ్యాధి, అపెండిసైటిస్ (24 గంటల కడుపునొప్పి) గానీ కావచ్చునని అంటారు. 

12:24 హేరోదు అడుతొలగడంతో, సువార్త విస్తరణకు ఆటంకాలు తక్కువ కావడంతో, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. 

12:25 తమ సేవాకార్యక్రమం ముగిసిన తరువాత బర్నబాయు సౌలును యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆది సంఘంలోని నాయకత్వం లోనికి సౌలును సమీకరించడంలో బర్నబా పాత్రను ఇక్కడ మనం మరొకసారి చూడవచ్చు. 


Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |