7:1-53 తాను నియమించిన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, ఆరంభం నుండి దేవుడు ఎలా పని చేస్తున్నాడో సైఫను వర్ణించాడు. అతని ప్రసంగ విశ్వసనీయత కొంత ప్రశ్నార్థకంగా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక స్థలానికి పరిమితం కాడు (వ.48) అని దేవాలయాన్ని గురించి అతడు వ్యక్తపరచిన ఆలోచనలు, క్రీ.శ.70లో దేవాలయం నాశనం చేయబడిన తర్వాత పెంపొందిన ఆలోచనలను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ అందుల పా.ని. ప్రవక్తల నుండి (ఒక ఉదాహరణగా, యెషయా 66:1-2ను పేర్కొన్న వ. 49-50తో పోల్చండి), దేవుడు ఒక నిర్దిష్టమైన స్థలానికి పరిమితుడు కాడు అని చెప్పిన ఆది క్రైస్తవ ఆలోచనాపరుల (ఉదా. అపొ.కా. 17లో పౌలు) వరకు కొనసాగుతున్న సాంప్రదాయం ఉంది. సైఫను ప్రసంగం పిసిదియలోని అంతియొకయలో పౌలు చేసిన ప్రసంగంలాగా ఉంది (13:16-41):7:2 ఆది 12:1లోని నేపథ్యం ఊరు కాకుండా హారాను అయినప్పటికీ, దేవుడు అబ్రామును ఊరు నుండి పిలిచాడని ఆది 15:7 సూచిస్తుంది .. 7:3-4 సైఫను ఆది 12:1ని పేర్కొన్నాడు. అందులో దేవుడు అబ్రాహామును హారాను వదిలి, అతనికి ఇవ్వబోయే దేశముకు వెళ్ళమని ఆదేశించాడు. ఇది ఇశ్రాయేలు ఆరంభం అని దీని సారాంశం.
7:5 ఆ సమయంలో అబ్రాహాముకు పిల్లలు లేకపోయినా, దేవుడు అతని సంతానమునకు ఆ దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా ప్రాథమికంగా నమ్మకం (విశ్వాసం)తో కూడిన క్రియ ద్వారా ఇశ్రాయేలు దేశం ఆరంభమైంది.
7:6-7 అతని సంతానం వాగ్దాన దేశానికి వచ్చి... సేవించక ముందు, అన్యదేశమందు (ఐగుప్తులో) బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రాహాముకు ముందుగానే చెప్పిన ఆది 15:13-14ను స్తెఫను జ్ఞాపకం చేశాడు. అలా దేవుని ఆశీర్వాదాన్ని గురించిన వాగ్దానం, అంతే నిశ్చయమైన శ్రమను గూర్చిన వాగ్దానంతోపాటు వచ్చింది.
7:8 గోత్రకర్తలు అనే పదం గ్రీకు సాహిత్యంలో లేదు. బహుశా దీని మొదటి ప్రయోగం ఇదే కావచ్చు.
7:9-16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి ఎలా వచ్చారో సైఫను వివరించాడు. యోసేపు అన్నలు అతడంటే మత్సరపడినా, దేవుడతనికి తోడైయుండి, అతనికి దయను, జ్ఞానమును అనుగ్రహించాడు. కరువును, బహుశ్రమయు వచ్చినపుడు, దేవుడు వారిని సంరక్షించాడు.
7:17-19 ఇశ్రాయేలీయులు అణచివేతకు గురికాకపోతే బహుశా ఐగుప్తులోనే ఉండిపోయేవారు.
7:20-22 మోషే యూదులైన తల్లిదండ్రులకు పుట్టినా, ఫరో కుమార్తె చేత పెంచబడి, ఐగుప్తీయుల సకలవిద్యలను అభ్యసించి, తన మాటల యందును కార్యముల యందును శక్తిమంతుడయ్యాడు. దేవుడు మోషేను పిలిచినప్పుడు (నిర్గమ 3:1-4:17), అది ఒక హెబ్రీయేతరుడు హెబ్రీయుల దేవుణ్ణి అనుసరించేవాడుగా మారినట్లుగా అనిపిస్తుంది. అలాగే అనేకమంది హెబ్రీయులు కానివారు, తమ అన్య నేపథ్యాన్ని (ఉదా. అపొ.కా. 10) విడిచిపెట్టి, ఆది సంఘంలోనికి ప్రవాహంలా వచ్చారు.
7:23,30 మోషే జీవితాన్ని నలువది ఏండ్లు చొప్పున మూడు భాగాలుగా విభజించారు- ఐగుప్తులో నలభై, మిద్యానులో నలభై, అరణ్యములో నలభై.
7:24-28 ఆరంభంలో ఇశ్రాయేలీయులు మోషే తమ అధికారి కావడాన్ని ప్రశ్నించారు. (నిర్గమ 2:14). బహుశా ఇశ్రాయేలీయులు తమ అంచనాను గురించి, యేసును తృణీకరించే విషయం గురించి పునరాలోచించాలని స్తెఫను దీనిని ప్రస్తావించాడేమో. మోషే విషయంలో వారు చేసింది తప్పు. యేసు విషయంలో కూడా వారు తప్పు చేస్తున్నారేమో?!
7:29-32 ఒక శరణార్థిగా, ఒక బందీగా తన గుర్తింపు, కొనసాగింపులకు సంబంధించిన ప్రశ్నలతో మోషే సతమతమౌతున్న సమయంలో, అతని పితరుల దేవునిగా దేవుడు తనను తాను అతనికి ప్రత్యక్షపరచుకున్నాడు (నిర్గమ 3:6, 15).
7:33-34 తన ప్రజలు అణగదొక్కబడుతున్నప్పుడు దేవుడు ఊరకనే కూర్చోడు అనే సత్యం నుండి సైఫను. - ఆది విశ్వాసులు ఆదరణ పొందివుంటారు (నిర్గమ 3:5,7-8,10).
7:35-36 వారు యేసుతో వ్యవహరించినట్లే, దేవుడు మోషేను రూఢిపరచినా, ఇశ్రాయేలీయులు అతనిని తృణీకరించారు. దేవదూత గురించి వ. 53 నోట్సు చూడండి.
7:37-38 సైఫను పేర్కొన్న జీవవాక్యములు దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఇచ్చిన పది ఆజ్ఞలు.
7:39-40 ఐగుప్తు నుండి బయటికి వస్తున్న హెబ్రీయులకు దృశ్యరూపంలో, శక్తివంతమైన మార్గాలలో దేవుడు తోడుగా ఉన్నప్పటికీ, వారు ఆయనను ధిక్కరించి, తమకోసం దేవతలను... చేయుమని (నిర్గమ 32:1) అహరోనును అడిగారు. ఉన్నతమైన దృశ్యరూపంలో, శక్తివంతమైన విధానాల్లో యేసు కూడా ఇలాగే వారిమధ్యకు వచ్చినప్పటికీ, వారు ఆయనను తృణీకరించినప్పుడు కూడా ఇంచుమించుగా ఇదే జరిగింది.
7:41-43 ఆమోసు 5:25-27ను స్తెఫను పేర్కొనడం, - అరణ్యంలో హెబ్రీయులు దేవుణ్ణి తృణీకరించి, తత్ఫలితంగా చెరను అనుభవించి, ఆధ్యాత్మికంగా వేరైపోయినట్లుగానే, యేసును తృణీకరించడం ద్వారా నేటి ఇశ్రాయేలు కూడా అలాంటి పర్యవసానాలనే ఆహ్వానిస్తుంది అని చెప్పడానికై ఉండవచ్చు.
7:44-47 దేవాలయంలో ఆరాధన, తప్పుడు ఆరాధనగా మారిపోయిందని చెప్పడానికి సైఫను ముందుకు సాగుతున్నాడు.
7:48-50 దేవుడు హస్తకృతాలయములలో నివసింపక పోయినా, సొలొమోను ద్వారా ఒక మందిరము కట్టబడడానికి ఆయన అనుమతించాడు (యెషయా 66:1-2). దైవ-మానవ సంబంధం సాధ్యమవ్వడానికి దేవుడు మనకోసం కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాడు.
7:51 ఇశ్రాయేలు అవిశ్వాసం, అవిధేయత లను ఖండించడానికి స్తెఫను ఉపయోగించిన హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా అనే వర్ణన మాటలు పా.ని. ప్రవక్తలు సామాన్యంగా ఉపయోగించేవి (లేవీ 26:41; యిర్మీయా 4:4; 6:10; 9:26; యెహె 44:7,9). అవిశ్వాసులైన యూదులు రూపాంతరం పొందిన హృదయాలపై కాక బాహ్య సూచనల మీద ఆధారపడ్డారని చెప్పినప్పుడు, పౌలు కూడా ఈ భాషను వాడాడు (రోమా 2; గలతీ 5). సైఫను ప్రసంగిస్తున్నపుడు పౌలు అక్కడే ఉన్నాడు కాబట్టి పౌలు దాని వల్ల ప్రభావితుడై ఉండవచ్చు (అపొ.కా. 7:58; 8:1), కానీ దానికంటే మించి పా.ని. స్పష్టమైన ప్రభావం చూపి వుండవచ్చు.
7:52 సైఫను మాటలు తన శ్రోతల కోపాన్ని రేపివుండాలి లేదా మారుమనస్సు పొందడానికి వారి హృదయాలను బద్దలుగొట్టి వుండాలి. పా.ని, ప్రవక్తలు ఇటువంటి ప్రసంగాలే చేశారు, మీ పితరులు వారిని హింసించి చంపిరి అని స్తెఫను అన్నాడు . దానికంటే దారుణంగా, తన శ్రోతలు వారంతట వారు ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసిన నీతిమంతుని... అప్పగించి, హత్యచేసినవారయ్యారు.
7:53 ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడిందని పా.ని. స్పష్టంగా చెప్పకపోయినా, సైఫను, పౌలు (గలతీ 3:19), హెబ్రీ పత్రిక రచయిత (హెబ్రీ 2:2), ధర్మశాస్త్రము ఇచ్చే ప్రక్రియలో దేవదూతలు పాల్గొన్నారని చెప్పారు. ఇది దేవుడు దాన్ని దేవదూతల ద్వారా ఇప్పించాడు. కాబట్టి ధర్మశాస్త్రము మరింత ముఖ్యమైనది అని చెప్పడానికే కావచ్చు.
7:54 సైఫను శ్రోతలు అంతరంగంలో (కోపంతో మండిపడి), బయటికి (అతని చూచి పండ్లు కొరికి) తమ అయిష్టతను వ్యక్తపరచారు. వారు తమను తాము ఇశ్రాయేలులోని మత నాయకులుగా, దైవభక్తి గలవారుగా
భావించారు. అయినప్పటికీ వారు లోతైన ఆధ్యాత్మిక దుర్నీతిపరులు అని సైఫను నేరారోపణ చేశాడు.
7:55 సైఫను తన శ్రోతలకు పూర్తిగా భిన్నం. వారు కోపంతో రగిలిపోతుంటే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని, మరణం. రాబోతుందని తెలిసినా, ప్రశాంతంగా ఆకాశము వైపు తేరిచూచెను.
7:56-57 మనుష్య కుమారుడు అనే పేరు యేసు తనకు తాను ఇచ్చుకున్న ఇష్టమైన పేరు. యేసు మాటలను ప్రజలు తిరిగి ఆయనకు చెపుతున్నపుడు (యోహాను 12:34), ఈ వచనంలోను తప్ప, కొ.ని.లో ఈ మాట ప్రతిసారి యేసు పెదవుల నుండే వచ్చింది. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నాడనే స్తెఫను మాటలు మహాసభ సభ్యుల కోపాన్ని రేపాయి.
7:58 దేవాలయ పవిత్రతకు సంబంధించిన విషయాలను నిర్వహించడానికి రోమీయులు యూదా నాయకులకు అనుమతినిచ్చారు. కానీ మరణశిక్ష విధించడానికి మాత్రం కాదు. అందువల్లే విచారణ కోసం యేసును రోమా అధికారియైన పిలాతు దగ్గరకు తీసుకుపోయారు. అయితే ఈ సందర్భంలో, సెఫను కోపోద్రేకులైన గుంపు చేతిలో - అన్యాయంగా చంపబడ్డాడు. లేఖనాల్లో సౌలు (తరువాత పౌలుగా పిలువబడ్డాడు) పేరు రావడం ఇదే మొదటిసారి. అతడు మహాసభ సభ్యుడా లేక సాంప్రదాయ యూదా విశ్వాసానికి ఆసక్తిపరుడైన యవ్వన విద్యార్దియా అనేది వివాదాంశం. అతడు అధికారికంగా మహసభలో ఉన్నాడో లేదో గాని, స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపే నిర్ణయానికి అతడు “సమ్మతించాడు" (8:1).
7:59-60 సైఫను రెండు వినతులు ప్రశంసనీయమైనవి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని కోరిన మొదటిది యేసును న్యాయాధిపతిగా, రక్షకునిగా ప్రకటిస్తుంది. తనను చంపుతున్నవారిపై ఈ పాపము మోపకుమని కోరిన రెండవది, తన స్వంత పాపాలు కృపచేత క్షమించబడినవని అర్ధం చేసుకుని, పగతీర్చుకోవాలనే ఆత్మ లేనివానికి మాదిరిగా ఉన్నాయి.