Corinthians II - 2 కొరింథీయులకు 6 | View All

1. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.

2. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
యెషయా 49:8

3. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక

5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,

6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

9. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
కీర్తనల గ్రంథము 118:18

10. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

11. ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
కీర్తనల గ్రంథము 119:32

12. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.

13. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.

14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
లేవీయకాండము 26:11-12, యిర్మియా 32:38, యెహెఙ్కేలు 37:27

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
యెషయా 52:11, యిర్మియా 51:45, యెహెఙ్కేలు 20:33, యెహెఙ్కేలు 20:41

18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
2 సమూయేలు 7:8, 2 సమూయేలు 7:14, యెషయా 43:6, హోషేయ 1:10, ఆమోసు 4:13బైబిల్ అధ్యయనం - Study Bible
6:1 పౌలు అపొస్తలత్వాన్ని యథార్థమైనదిగా స్వీకరించడం అంటే, దేవుని కృపను గురించిన అతని సువార్త సందేశాన్ని కూడా సత్యమైందిగా స్వీకరించడం, వ్యర్ధము అనే మాట రెండు విషయాలను సూచిస్తుండవచ్చు. 
(1) యథార్థమైన విశ్వాసం కలిగి లేని స్థితిలో పై పై విశ్వాసం నుండి పడిపోవడం వలన క్రీస్తు లేని నిత్యత్వంలోకి వెళ్ళిపోవడం (1యోహాను 2:19). (2) “విశ్వాసంలో దిగజారిన” జీవితం మూలంగా క్రీస్తును పోలిన వ్యక్తిత్వం పెంపొందించుకోకుండా, సత్రియలు చేయకపోవడం వలన క్రీస్తు న్యాయపీఠము యెదుట ఒకని క్రియలు కాలిపోవడం (1కొరింథీ 3:12-14; 2 కొరింథీ 5:10). 

6:2 యెషయా 49:8 చెప్పిన మాటల విశాలమైన నేపథ్యంలో, నిబంధనా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని చివరికి దేవుడు పునరుద్ధరిస్తాడు. పౌలు ఈ మాటలను పేర్కొనడం చూస్తే, క్రీస్తు నరావతారిగా రావడం, ఆయన మరణ పునరుత్థానాలను బట్టి ఆ సమయం వచ్చిందని అతడు విశ్వసిస్తున్నాడని తెలుస్తుంది. ఇదే రక్షణ దినము అంటే సాధారణంగా క్రీస్తు మొదటి, రెండవ రాకడలకు మధ్య ఉన్న సమయాన్ని సూచిస్తుంది. నిర్దిష్టంగా చెప్పాలంటే ఒకడు సువార్తను విన్న సమయాన్ని సూచిస్తుంది. స్పందించడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. 

6:3 ఏ విషయములోనైనను అభ్యంతరమేమిము కలుగజేయక అనే మాటలు అందరూ గమనించగలిగేలా ఉన్న పౌలు వ్యక్తిత్వం, అతని క్రియలను సూచిస్తున్నాయి. పౌలు సహించిన కష్టాలన్నిటికి సరిపడినంత విలువైనది అతని సమాధానపరచు పరిచర్య. వ.4-13లో ఉన్న జాబితా (అబద్ద బోధకుల్లాగా; 3:1) స్వంత మెప్పు కోసమైనది కాదు. దేవుడు నియమించిన సేవకునిగా, తన వ్యక్తిత్వం, తన పరిచర్య స్వభావాన్ని, దాని మూలాన్ని కనపరిచే పౌలు చర్యలను అది ప్రతిబింబిస్తుంది. 

6:4-5 అపొస్తలుల కార్యముల గ్రంథం పౌలు అనుభవించిన నిర్దిష్టమైన శ్రమలను వివరించింది. ఆ జాబితాలోని ఈ భాగం భౌతికంగా బాధాకరమైన అనుభవాలను పేర్కొంటున్నది. మానవ దృక్కోణం నుండి చూస్తే, సువార్త నిజం అయితే తప్ప ఇవి వ్యర్ధం, అనవసరం. 

6:6-7 జాబితాలోని ఈ భాగం విశ్వాసపు కళ్ళతో మాత్రమే చూడగలిగే వ్యక్తిత్వ చిహ్నాలపై, ఆధ్యాత్మిక సత్యాలపై దృష్టి పెట్టింది. నీతి ఆయుధములను గురించి ఎఫెసీ 6:10-20 లో ఉన్న దేవుని సర్వాంగ కవచం గురించిన పూర్తి చర్చను చూడండి.

6:8-10 యథార్థమైన క్రైస్తవ పరిచర్యలోని వైరుధ్యాన్ని గురించి ఈ వచనాల్లో చెప్పినంత మెరుగ్గా ఇంకెక్కడా కనిపించదు. మానవ దౌర్బల్యానికి, దేవుని శక్తి నిదర్శనానికి మధ్య ఉన్న తొమ్మిది వైరుధ్యాలను పౌలు పేర్కొన్నాడు (4:8-9,17-18 నోట్సు చూడండి).

6:11 పౌలు జీవితం, ఉపదేశం తెరవబడిన పుస్తకం. అతనికి రహస్యమైన లక్ష్యాలేమీ లేవు. 

6:12-13 కొరింథీయులతో తనకు ఉన్న అనుబంధాల సమస్యను పౌలు గుర్తించాడు. పౌలు పట్ల కొరింథీయులు కలిగి ఉన్న ప్రేమను అబద్ద బోధకులు అణచివేశారు. దారి తప్పిన పిల్లల పట్ల శ్రద్ధగల తండ్రిలాగా తాను వారితో ఉన్నంత విశాలముగా, ప్రేమగా వారు కూడా తనతో ఉండాలని పౌలు ఎంతో ఆశించాడు.

6:14 అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే సాతాను సేవకులని తాను భావించిన అబద్ద అపొస్తలులతో కలిసి ఉండవద్దు అని పౌలు అభిప్రాయం. మూలభాషలో ఒకే కాడి కింద రెండు వేర్వేరు జాతుల పశువులు పొలము దున్నుతున్న దృశ్యాన్ని అది చూపిస్తుంది (ద్వితీ 22:10). అలాంటి పరిస్థితుల మధ్య మనం అనుకున్నదానిని చేయలేం. వెలుగు, చీకట్లు సమానంగా ఒకే చోట కలిసి ఉండడం, వ.15లో క్రీస్తు, సాతాను స్నేహితులుగా ఉండడం అసాధ్యం అని పేర్కొంటూ ఆధ్యాత్మికంగా దాని పరస్పర వైరుధ్యాన్ని పౌలు నొక్కి చెబుతున్నాడు.

6:15 బెలియాలు పా.ని.లో ఉన్న హెబ్రీ పదం, “బెలియాలు కుమారులు" ను “పనికిమాలినవారు” అని అనువదించారు (ద్వితీ 13:13 చూడండి).

6:16 మనము... ఆలయమై యున్నాములోని “మనము” ఒక్కొక్క వ్యక్తిని (దీనికోసం 1కొరింథీ 6:19 చూడండి) కాక స్థానిక సంఘాన్ని (లేక సార్వత్రిక క్రీస్తు శరీరాన్ని) సూచిస్తుంది. ఇక్కడ పౌలు ఆలోచనలో ఉన్నది విశ్వాసులే గానీ, కట్టడాలు కాదు (1 పేతురు 2:5). 

6:16-18 ఈ వచనాలు పా.ని.లోని అనేక వాక్యభాగాలను కలుపుతున్నాయి.వ.16 మొదటిగా లేవీ 26:12లో తరువాత యిర్మీయా 31:33; 32:38లో కూడా చెప్పారు. ఇది తన నిబంధన ప్రజలకు తన సన్నిధిని గురించి దేవుడిచ్చిన వాగ్దానం. అది ఇప్పుడు క్రీస్తు స్థాపించిన కొత్త నిబంధనలో నెరవేరింది (హెబ్రీ 8:7-13). వ.17 యెషయా 52:11ను ఎత్తి చెబుతూ, ఇశ్రాయే లీయులు భవిష్యత్తులో తిరిగి దేవుని దయను పొందినపుడు వారు పొందే పరిశుద్ధతను పేర్కొంటుంది. వ.18 మొదటిగా 2సమూ 7:14లో దావీదుకు దేవుని నిబంధనా వాగ్దానంగా కనిపిస్తుంది, కానీ అది యెషయా 43:6; 49:22; 60:4; హోషేయ. 1:10లో ప్రతిధ్వనించింది. ఈ వాక్యభాగాలలో దేవుడు తనకు, తన ప్రజలకు మధ్య ఒక కుటుంబ బాంధవ్యాన్ని వాగ్దానం చేశాడు.


Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |