Galatians - గలతీయులకు 1 | View All

1. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియ మింపబడిన పౌలను నేనును,

2. నాతో కూడనున్న సహో దరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.

3. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

4. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

5. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

6. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.

12. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

13. పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు

14. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.

15. అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని
యెషయా 49:1, యిర్మియా 1:5

16. ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

17. నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

18. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.

19. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.

20. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.

21. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.

22. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని

23. మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,

24. వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 గలతీయ సంఘాల్లో ఉన్న సమస్యలను గూర్చి మాట్లాడడానికి తనకున్న అధికారం మనుష్యుల నుండి కాక దేవుని నుండే వచ్చిందని వక్కాణించి చెప్పడానికి పౌలు తనను తాను అపొస్తలుడు అని పేర్కొంటున్నాడు. 

1:2 నాతో కూడ నున్న సహోదరులందరును అని చెప్పడం ద్వారా, ఈ ఉత్తరంలో వ్యక్తపరచిన ఆలోచనలు కేవలం తనవి మాత్రమే కాదని పౌలు పేర్కొంటున్నాడు. గలతీయలో నున్న సంఘములకు అనే మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు (ప్రక 1:4,11) ఈ పత్రికను అనేక సంఘాలలో చదవాలని సూచిస్తున్నాయి. 

1:3 కొ.ని. లోని పౌలు పత్రికలన్నీ కృపతో ఆరంభమై, కృపతోనే ముగుస్తాయి. సమాధానము హెబ్రీ సాంప్రదాయక అభివాదం అయిన "షాలోం" అనే మాటకు అనువాదం.

1:4 పునరుత్థానంతో పాటు, క్రీస్తు విమోచనాత్మక మరణం సువార్త సందేశానికి ఆయువుపట్టు (1కొరింథీ 15:1-4). ఈ పత్రిక ప్రారంభంలోనే “ధర్మశాస్త్ర క్రియల ద్వారా" (2:16) రక్షణ వస్తుందని గలతీయులు ఈ మధ్యనే విన్న, బోధను ఖండించడం మొదలు పెడుతూ (గలతీ 1:1) పౌలు క్రీస్తు మరణ పునరుత్థానాలను నొక్కి పలుకుతున్నాడు. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విమోచింప వలెనని అనే మాటలు “లోక సంబంధమైన మూల పాఠముల"కు "దాసత్వము" నుండి క్రీస్తు ద్వారా విమోచన పొందడాన్ని (4:3-5) దాటి 6:15 లోని "క్రొత్త సృష్టి" పదజాలాన్ని ముందుగా దృష్టిస్తున్నాయి. 

1:5 సువార్త విషయంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్న రెండు భావాల (కృప ద్వారా రక్షణ - క్రియల ద్వారా రక్షణ) మధ్య ఉన్న కీలకమైన అంశం మహిమ ఎవరికి చెందుతుంది అన్నది. క్రియల ద్వారా రక్షణ ఒక వ్యక్తి “అతిశయించు"టకు కారణమౌతుంది (6:13; ఎఫెసీ. 2:9). అదే యోగ్యత లేనివారికి అనుగ్రహింపబడిన దేవుని కృప అయితే యుగయుగములకు దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేలా విశ్వాసిని ప్రేరేపిస్తుంది.

1:6-7 వ.6 అకస్మాత్తుగా వచ్చి పడినట్టు అనిపిస్తుంది. గలతీయులు కృపాసువార్త నుండి తొలగిపోవడం పట్ల పౌలు ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. సువార్త సందేశాన్ని తిరస్కరించడం అంటే దేవుణ్ణి తిరస్కరించడమే. పౌలు గలతీయను విడిచి వెళ్ళిన తరువాత, గలతీయులు ఒక భిన్నమైన సువార్తను విని అది మరింత మెరుగైనదని తలంచి దానికి సానుకూలంగా స్పందించారు. నిజానికి అది సత్య సువార్త కాదు. 

1:8-9 సువార్తలో పవిత్రత ఎంత ప్రాముఖ్యమంటే, దాని చెరపడానికి ప్రయత్నించినవారు చివరికి అపొస్తలులైనా, యొక దూతయైనను శాశ్వతంగా శాపగ్రస్తుడౌతాడు (గ్రీకు. "అనథెమా). 

1:10 మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా అనే మాటలు, యెరూషలేము నుండి వచ్చిన కొందరిని (2:12) సంతోషపెట్టడం కోసం ఆ సమయానికి “సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక” పోయిన (2:14) పేతురును దృష్టిలో ఉంచుకొని పలికాడు. 

1:11-12 యేసు క్రీస్తు తనకు నేరుగా బయలుపరచుట అన్నది ఎప్పుడు జరిగిందో పౌలు చెప్పలేదు. కానీ వ.16 లోని “తన కుమారుని ప్రకటింప వలెనని” అనే మాటలను బట్టి అది దమస్కు దారిలో అతని మారుమనస్సుకు సంబంధించింది కావచ్చు (అపొ.కా.9:1-9; 22:6-10; 26:12-18).

1:13-14 పౌలు మూడు విషయాలు తన పాఠకులకు చెప్పాడు: (1) సువార్తను చెరిపిన వారికంటె యూదా మతంలో అతడు ఆధిక్యత పొందినవాడు, (2) ఈ అబద్ధ బోధకులకంటే అతడు యూదా మతాచారాల విషయంలో అధికమైన ఆసక్తి గలవాడు, (3) చిత్రమేమిటంటే, యూదామతం విషయంలో పౌలుకున్న ఆసక్తి, ఆధిక్యతలే అతడు మారుమనస్సు పొందడానికి ముందు సంఘాన్ని హింసించేలా చేశాయి.

1:15 నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అనే మాటలు యెషయా 49:1లోని సేవక మెస్సీయనూ, యిర్మీయా 1:5 లోని ప్రవక్తయైన యిర్మీయానూ గుర్తుచేస్తాయి. రక్షణ, అపొస్తలత్వం కోసమైన పిలుపులకు తాను అర్హుడు కాడని పౌలుకు తెలుసు (రోమా 1:7). క్రీస్తును అన్యజనులలో... ప్రకటింప వలెననే పౌలు పిలుపు గురించి అపొ.కా. 9:15; 26:16-18; రోమా 1:7; 16:27 చూడండి.

1:16-17 తన కుమారుని "నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు” అనే మాటల కోసం వ.11-12 నోట్సు చూడండి. తాను మారుమనస్సు పొందిన పిమ్మట (అపొ.కా.9:3-9), దమస్కు నుండి యెరూషలేముకు వెళ్ళి సువార్త విషయంలో అనుభవం గలవారిని సంప్రదించాలని పౌలుకు అనిపించలేదు. అతడు అరేబియా వెళ్ళి (అపొ.కా. 9:23-25; 2కొరింథీ 11:32-33), అక్కడి నుండి దమస్కుకు తిరిగి వెళ్ళాడు. 

1:18 పౌలు కాలంలో సమయాన్ని లెక్కించే విధానాన్ని బట్టి, మూడు సంవత్సరములు అంటే పూర్తిగా మూడు సంవత్సరాలో లేక ఒక పూర్తి సంవత్సరం, ఆ తరవాతి రెండు సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరంలో కొంత భాగమో తెలీదు. ఈ మూడు సంవత్సరాలు: (1) పౌలు మారుమనస్సు పొందిన తర్వాత (వ.15-16), (2) అతడు అరేబియా వెళ్ళిన తర్వాత (వ.17) లేక (3) అతడు అరేబియా నుండి దమస్కు తిరిగి వచ్చిన తర్వాత (వ. 17) ఎప్పుడు అనేది మనకు తెలియదు. అతడు అపొస్తలుడైన పేతురును కలుసుకోడానికే (పెట్రోస్ అనే పదానికి అరమేయిక్ భాషలో కేఫా అంటే “ రాయి" అని అర్థం; మత్తయి 16:18) యెరూషలేముకు వెళ్ళాడు. సువార్త సందేశం గురించి పౌలుకూ. పేతురుకూ మధ్య ఏవైనా విభేధాలుంటే ఆ సందర్భంలోనే వెల్లడై వుండాలి. 

1:19 యేసు సహోదరుడైన యాకోబు (మత్తయి 13:55; యాకోబు 1:1) పన్నెండుమంది అపొస్తలుల జాబితాలో కనిపించడు (ఇస్కరియోతు యూదా లేకుండా పదకొండుమంది; యూదా స్థానాన్ని మత్తీయకు ఇచ్చారు; అపొ.కా.1:23-26). అయితే అతడు పెంతెకొస్తుకు ముందు మేడగదిలో ఉన్నాడు (అపొ.కా.1:13-14), యెరూషలేములోని సంఘంలో స్థంభములుగా ఎంచబడినవారిలో (అపొ.కా.15:13; 21:18 చూడండి) ఒకడుగా ఉండడం వలన యాకోబును ఒక “అపొస్తలుడు"గా పరిగణించారు. 

1:20 తన సువార్త సందేశం గురించి పేతురుతో, బహుశా యాకోబుతో కూడా, పౌలుకు సామరస్యమైన చర్చ జరిగిందా అని సందేహం ఉన్నవారికి అది నిజమేనని అతడు ఈ వచనంలో నిర్ధారించాడు. 

1:21 బహుశా పౌలు తన సమయాన్ని ఎక్కువగా అంతియొకయలో, తార్సులో గడిపి ఉంటాడు. 

1:22 యూదయ సంఘముల వారికి పౌలుతో వ్యక్తిగత పరిచయం ఉండకపోవచ్చుననే సత్యం, అతడు తార్సుకు వెళ్ళినప్పటి నుండి (అపొ.కా.9:30) బర్నబా అక్కడికి వెళ్ళి అతణ్ణి సిరియాలోని అంతియొకయ సంఘ పరిచర్యలో పరిచయం చేసేవరకు (అపొ.కా.11:25-26) అపొస్తలుల కార్యములలో అతని గురించిన ప్రస్తావన లేకపోవడం నిర్ధారిస్తున్నది. 

1:23-24 తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును పౌలు ప్రకటిస్తున్నాడని యూదయ సంఘాలు దేవుని మహిమపరిచిరి అనే మాటలను బట్టి అతడు ప్రకటించే సువార్తతో వారు విభేధించలేదని స్పష్టమౌతుంది. 


Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |