ఆతిథ్యం | Hospitality


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఆతిథ్యం

మత్తయి 25:35నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

మనచుట్టూ ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వారికి సేవ చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకు వారు తెలియకపోయినప్పటికీ వారికి అవసరమైన ప్రేమ మరియు ఆతిథ్యం చూపించడానికి మనము దేవునిలో పిలువబడ్డాము. మనం ఇతరులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, మనం వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామని గ్రహించాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయాలంటే గొప్ప మనసుతో పాటు మానవత్వము స్వభావాలు కావాలి. దేవునికి కావలసింది ఇలాంటి వారే.

మనం ఎల్లప్పుడూ సేవా హృదయాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయడానికి మన స్వంత అవసరాలను పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారికి కరుణ మరియు దయ చూపించడానికే క్రైస్తవులైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారిని మన స్వంత కుటుంబంలా భావించే మనసు కలిగియుండాలి. 

నేటినుండి, మనం క్రీస్తును ఆదర్శంగా తీసుకుని శ్రమల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు కృషి చేద్దాం. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం చూపుదాం మరియు అవసరంలో ఉన్నవారిని ప్రేమిద్దాం. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సేవ చేసినప్పుడు, మనం క్రీస్తును సేవిస్తున్నామని గుర్తుంచుకోండి. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/Y45CNsq7Gjs

Hospitality

Matthew 25:35 For I was hungry, and you gave me something to eat, I was thirsty, and you gave me something padukoni drink, I was a stranger and you invited me in. 

We are called to serve others no matter who they are or what their circumstances are. We are called to show love and hospitality to those in need to those who are strangers to us. We are called to be compassionate generous and kind. When we show hospitality to others, we are showing them the love of Jesus. We are demonstrating that we care about them and that we are willing to go out of our way to help them. We are also showing them that we recognize their humanity and value them as fellow human beings. 

We must have a heart of service and to be willing to put our own needs aside to help others. We are called to serve the least of these to show mercy and grace to those who are in need. We are called to show hospitality to strangers and to treat them as if they were our own family. Let us strive to follow Jesus as example and serve others in need. Let us show hospitality to strangers and love those who are in need. Let us be generous with our time resources and love. 

Let us remember that when we serve others, we are serving Jesus. Amen. 

Connecting With God.

English Audio: https://youtu.be/rChH9mJ9gCY