ఆదరించు దేవుడు | God Who Upholds


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఆదరించు దేవుడు

కీర్తనల గ్రంథము 146:7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. 

కటిక బాధల్లో, శ్రమలు, కష్టాలలో, అవసరంలో ఉన్న వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన దయగలవాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్నవారిని బలపరచే దేవుడు. తమ కోసం పోరాడలేని వారి కోసం దేవుడు ఎప్పుడూ పోరాడుతున్నాడని గ్రహించినప్పుడు మనం ఓదార్పు పొందవచ్చు. 

ఈరోజు, అలసిపోయి నీరసించిన వారి అవసరాల గురించి మాత్రమే కాకుండా, వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించాలి. అన్యాయానికి గురైన వారిని అణచివేతకు గురైన వారిని క్షమించడానికి పునరుద్ధరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం విశ్వసించే దేవుడు కృపగలవాడు, దయగలవాడు. కాబట్టి, అవసరమైన వారికి తన కరుణను ప్రేమ చూపించడానికి ఎల్లప్పుడూ  సిద్ధంగా ఉన్నాడు. 

మనం కూడా ఇటువంటి వారికోసం అనుదినం ప్రార్దిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా భౌతికంగా అవసరమైన వారికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన సమయాన్ని, శక్తిని, వనరులను అవసరమైన వారికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. మనం కూడా క్రీస్తు వలే అట్టి మనసు కలిగియుండేలా ప్రయత్నించాలి. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/V_Kvt6Y3Hls

God Who Upholds

Psalms 146:7 He upholds the cause of the oppressed and gives food to the hungry. The LORD sets prisoners free. 

This verse is a reminder that God cares deeply for those who are oppressed and in need. He is a God of justice and mercy, and He is always looking out for the vulnerable. We can take comfort in the fact that God is always fighting for those who cannot fight for themselves. God is not only concerned with the physical needs of the oppressed and hungry, but He also cares about their spiritual needs. 

He is always ready to forgive and restore those who have been wronged and oppressed. He is a God of grace and mercy, and He is always ready to show compassion and love to those who are in need. We should also be looking out for those who are oppressed and in need. We should be willing to help those in need both spiritually and physically. We should be willing to give our time, energy, and resources to those who are in need. We should also be willing to speak up for those who cannot speak for themselves. 

God is a God of justice and mercy, and He is always looking out for the oppressed and the hungry. We should strive to do the same. God bless you. Amen. 

Connecting With God.
English Audio: https://youtu.be/OHi-SuPP8es