దేవుని సార్వభౌమత్వం | God’s Sovereignty


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవుని సార్వభౌమత్వం

యెషయా 48:21ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. 

ఈరోజు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనతోనే ఉంటాడు ఉన్నాడు. ఆమెన్. ఆయనే మనకు ఆశ్రయం మరియు బలం, మరియు అయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్.  మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎదుర్కొనే ఏ కష్టాలకన్నా ఆయన గొప్పవాడు. హల్లెలూయ.

ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండే దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు వదిలిపెట్టడు. జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా, ఓదార్పు మరియు బలం కోసం మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరగవచ్చు. ఆయనకు మన హృదయాలు తెలుసు మన అవసరాలు తెలుసు, మరియు మనకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రతి పరిస్థితిలో మనతో ఉన్నవాడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. 

ఆయన మనతో ఉంటాడని మరియు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని ఇస్తాడని మనం విశ్వసించగలిగితే ఒకసారి ఆమెన్ చెపుదామా. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/So2Gxz9vSGw

God’s Sovereignty 

Isaiah 48:21 They did not thirst when he led them through the deserts; he made water flow for them from the rock; he split the rock and water gushed out. 

No matter what situation we find ourselves in God is with us. He is our refuge and strength, and He is always ready to help us. We don-t need to be afraid because He is greater than any trouble we face. He is in control, and He will never leave us or forsake us. No matter what we face in life we can always turn to God for comfort and strength. He knows our hearts and our needs, and He is always ready to give us the help we need. He is with us in every situation, and He will never leave us. We can trust Him to be with us and to give us the strength we need to get through any difficulty. 

Connecting With God.

English Audio: https://youtu.be/0CTez6tGJX8