మీ పరిచర్యను నెరవేర్చండి


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

మీ పరిచర్యను నెరవేర్చండి

కొలొస్సయులకు 4:17 మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప్రత్యేక పిలుపు అయి ఉండవచ్చు.

గుర్తుంచుకోండి, ఈ పరిచర్య మీకు ప్రభువు వలన అనుగ్రహించబడినది. పరిచర్య లేదా పిలుపు ప్రభువు ద్వారా నేరుగా ఇవ్వబడింది, బహుశా ప్రవచనంలో లేదా ఉన్నతమైన పిలుపు ద్వారా ఇవ్వబడింది. అయితే, విధేయత మరియు విశ్వాసంతో ఈ పరిచర్యలో మన పనులను మనం నెరవేర్చాలి.

కొన్ని సార్లు మనకు అప్పజెప్పిన పని చేయుటలో మనం వెనుకంజ వేస్తూ ఉంటాము? కారణం ఏమై యుండవచ్చు?మీరు పరిచర్య చేయడానికి అర్హులు కాదనే భయమా? లేదా ఈ రోజు మిమ్మల్ని ఆపేది ఏదైనా కావచ్చు.

ప్రియమైన స్నేహితులారా, దేవుడు నిన్ను మళ్లీ అడుగు ముందుకువేయమని పిలుస్తున్నాడు. మీరు సందేహించాల్సిన అవసరం లేదు. మీరు గతాన్ని మార్చలేరు. మీరు ఇప్పటికే చేసిన దాన్ని రద్దు చేయలేరు. కానీ మీరు ఈరోజు ప్రభువు దగ్గరకు వచ్చి ఇలా చెప్పవచ్చు, "దేవా, సంకోచించినందుకు నన్ను క్షమించు. నా జీవితంలో ఈ సమయంలో మీరు నాకు అప్పగించిన పని, నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను పూర్తిగా అనుసరించాలనుకుంటున్నాను. నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను." ఆమెన్.

మీకు అప్పజెప్పిన పరిచర్యలో దేవుని దిశానిర్దేశంతో ముందుకు సాగండి, ఆయన మీకు సహాయం చేయడానికి మీ పక్కనే నడుస్తాడని గ్రహించండి. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/H0CPVXEHD1U