ఆలోచనల్లో మార్పు


  • Author: Anudina Vahini | Pas. Anil Andrewz | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ఆలోచనల్లో మార్పు

అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు. సామెతలు 23:7

నేను అనేక సంవత్సరాలు నా స్వంత ఆలోచనలు నా స్వంత నిర్ణయాలతో జీవిస్తూ ఉండేవాడిని. నేనెప్పుడు అనుకుంటూ ఉండేవాడిని “ఎప్పుడు మనకు మంచి లేదా మనకు అనుకూలంగా జరగని ఏ పనైనా చేస్తే, మంచి జరగకపోతే పర్వాలేదులే అని వదిలేయగలం కాని నిరాశపడలేము. అంతా మన మంచికే అనుకుంటూ దాటివేయగలం.” అయితే అలా అనుకున్నప్పుడల్లా ఎన్నో భయంకరమైన విపత్తు పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని సార్లు భయం కలిగింది, అసలు ఒకసారైనా మంచి జరుగుతుందా లేదా అనే సందేహాల్లో  నలిగిపోయాను. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేసినప్పుడు అర్ధం చేసుకోగలిగాను. నా వైఫల్యాలకు కారణమైన లోపాలు నా ఆలోచనలు, నా మాటలు, మరియు నా జీవన విధానం.

బహుశ మీకు కూడా ఇటువంటి అనుభవం కలిగియుండవచ్చు. మనం బాధపకుండా ఉండాలని, నిరాశపడకుండా జాగ్రత్తపడుటకు మనల్ని మనం కాపాడుకుంటూ మంచి జరుగుతుంది అనే ఆలోచనల నిరీక్షణను పక్కనబెట్టే వారంగా ఉన్నాము. ఇది ముమ్మాటికీ మనం ఆంతర్యములో నుండి వచ్చే చెడు ఆలోచనలే. మన ఆలోచనల్లో సరైన మార్పు రాకపోతే సమస్తం నష్టపోతాం, విఫలమవుతాం మరి!.

దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనల్లో శక్తిని నింపుకోగలం, విశ్వాసంలో పట్టుదల ఆయనపై నిరీక్షణ మన జీవితంలో సరైన ఆలోచనా నిర్ణయాలతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఆలోచనా విధానాల్లో మార్పు, మనకు ఎప్పుడు మంచిని జరిగించేలా సహాయపడుతుంది మన జీవన శైలిని మంచిగా మారుస్తుంది. 

మంచి నడవడి మంచి ఆలోచనల్లో నుండే వస్తుంది. చెడు స్వభావం జీవితాన్ని పాడుచేస్తుంది. దేవుని వాక్యం చేత నూతనపరచుకున్న మన జీవితాలు రోమా 12:2 ప్రకారం “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” అనే అనుభవంలోనికి నడిపిస్తుంది.

Telugu Audio: https://youtu.be/bx8C_5Tlw4E?si=eflkXEp7riKOJvLn