జయకరమైన తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

జయకరమైన తలంపులు :

యోహాను 16:33 - "ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించియున్నాననెను".

క్రీస్తుని వెంబడించడం చాలా కష్టం.  మనకు మనం కష్టాలను నిరోధించగలమని హామీ యివ్వలేము... కానీ దేవుని పిల్లలుగా మనం భరోసా యివ్వలేము.  నీవు శ్రమలవలన ఛిద్రమైపొయినా దేవునియందు విశ్వాసముంటే తిరిగి మళ్ళీ మామూలు స్థితికి తేరుకోగలవు.  ఎందుకు దేవుడు మనలను అలాంటి కఠిన శ్రమలనుండి నడిపిస్తాడని మనం అనుకోవచ్చు కానీ మనకు ఒక శుభవర్తమానము ఉన్నది.  మనలను శ్రమలలోనుండి నడిపించి ఊహించని రీతిలో మనలను బలపరుస్తాడు.  నీవెన్నో భరించలేని బాధలను కలిగియుండవచ్చు.  నిస్సహాయంగా ఉండిపోవచ్చు.  కానీ వాటిని భరించి దాటినప్పుడే మన జీవితం అద్భుతకరంగా గొప్ప సాక్ష్యంగా మలచబడుతుంది.  గనుక కృంగిపోవద్దు. ఆయన ఈ లోకముపై పొందిన జయాన్ని మనకు అనుగ్రహించాడు. గనుక ఆయనయందు నమ్మికయుంచుము.

ప్రార్థనా మనవి:

ప్రియ పరలోక తండ్రి!!! నన్ను అనేక కఠిన శ్రమలనుండి నడిపించి నీయందు బలపరచినందుకు నీకు వందనములు.   శ్రమలను చూచి భయపడి పారిపోక ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Victorious Thoughts:  

John 16:33 - “Be of good cheer, I have overcome the world.” Being a follower of Christ can be hard—there’s no guarantee that we will be immune to adversity. In fact, it seems as a child of God we are almost guaranteed it. Perhaps, you are facing difficulties so shattering you wonder if it’s even possible to pick up the pieces. You wonder why a good and loving God would even allow such events. There is good news for you. God has this amazing way of taking the most painful circumstances and situations in our lives and using them in ways we  could never imagine. Maybe you’re facing some unbelievable challenges and you want to give up. Too often we want to push away the darkness, but some of God’s best work happens when we go through it. Don’t try to get to the end to quickly. Sometimes we need to stay the course and let God do what only God can do. He truly does make beauty out of ashes.

Talk to The King:   

Lord Jesus,  thank you for bringing me through certain circumstances and strengthening me in You. Help me not run away but face each circumstance and experience Your deliverance and empowerment in my life. Amen.