రక్షించే తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

రక్షించే తలంపులు :

లూకా 19:10 - "నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను".

దేవుని పోలికగా మొట్టమొదటగా చేయబడిన ఆదాము హవ్వతో పాపములో సంచరించినప్పటి మొదలు దేవుడు తన జనముతో ఉన్న అనుబంధం దూరమైనందుకు ఎంతగానో చింతించి దానిని పునరుద్ధరించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అందుకోసమై తన అద్వితీయ కుమారుని నశించిన దానిని వెదకి రక్షించుటకై ఈ లోకమునకు పంపెను. యేసు మన రక్షణార్ధం జన్మించకపోయినచో మన పాపములకు విమోచనాక్రయధనమును చెల్లించి మన ఆత్మలను రక్షింపనిచో మన జీవితాల్లో క్రిస్మస్ పండుగ ఉండేది కాదు. గనుక ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువుని స్తుతించి మహిమపరిచుదాము. ఒకవేళ ఆయనతో మనకున్న సన్నిధిని తిరిగి సంపాదించుకుందాము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నశించుచున్న నన్ను రక్షించుటకై నా కొఱకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనములు. నన్ను ఎన్నడూ విడువక పాపములో ప్రవేశింపనీయక నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Saving Thoughts:

 Luke 19:10 - “for the Son of Man has come to seek and to save that which was lost.” From the time God’s first image bearers—Adam and Eve—wandered off in sin, He lamented the loss of fellowship with His people. He did everything in His power to restore the relationship, ultimately sending His one and only Son “to seek and to save that which was lost”. Without the birth of Jesus, and without His willingness to die to pay the price for our sin and to reunite lost souls to God, we would have nothing to celebrate at Christmastime. So, this Christmas, let’s be thankful that God took extreme measures by sending Jesus to reclaim our fellowship with Him. Although we once were lost, because of Jesus we have been found!

Talk to The King: Father thank you for the pain you took to save me from sin. Thank you for never leaving me alone in my sin. In Jesus name, I pray, Amen.