స్త్రీ యొక్క తలంపులు - Womanly Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

స్త్రీ యొక్క తలంపులు:
సామెతలు 31:30 - "యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును".

పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తుని వంశావళిలో ప్రస్తావించబడిన స్త్రీలు ఎంతో కీలకమైనవారు. రాహాబు, రూతు అన్యులైనప్పటికీ దేవునియందలి వారికున్న ధృడమైన విశ్వాసమును బట్టి బైబిల్ లో వారు ప్రస్తావించబడ్డారు. ఈరోజు స్త్రీ యొక్క విశిష్టతను బట్టి మానవాళి స్త్రీల దినోత్సవాన్ని పురస్కరించుకుంటున్నాయి. అందును బట్టి మనము ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కుటుంబాన్ని దేవుని వైపు నడిపించాలన్నా, దూరముగా నడిపించాలన్నా అది స్త్రీ చేతిలో ఉంటుంది. గనుక ఈరోజున స్త్రీలందరూ వారు ఆత్మీయంగా బలముగా ఉంది తమ తమ కుటుంబాలను దేవుని వైపు నడిపించుటకు తీర్మానం చేసుకోవాలి. అలాగే పురుషులు వారిని గౌరవించి ప్రేమించుటకు తీర్మానం చేసుకోవాలి.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నీవు నాకు అనుగ్రహించిన తల్లిని బట్టి, సహోదరిని బట్టి, భార్యను బట్టి, కుమార్తెను బట్టి నీకు వందనములు. వారి ద్వారా నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రములు. వారిని సదా ప్రేమించి గౌరవించు మనసును మాకు అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Womanly Thoughts:
Proverbs 31:30- “A woman who fears the Lord , she shall be praised.” Women played a very important role in the lineage of Jesus Christ in the Holy Bible. Be it Rahab or Ruth, though they were gentiles found a place in Bible because of their faith in God. As the world celebrates, International Women''s Day, make it a point to change your life in the lines of the Holy Bible. Rest yourself on God and let Him guide You in His faith. Let every act you do reflect God so that the world may see it. A woman''s character in Christ defines a family because only a woman can either lead a family to God or away from God. So this Women''s Day , take it as a challenge to lead your families and people around you to the light of Christ and let the true sense of you being a woman be fulfilled.

Talk to The King:
Father I thank You for the way you have designed me. Thank you for the women in my life whom you have put in my life. Help me be a light to others in bringing them to You. In Jesus name, I pray, Amen.