ప్రేమించు తలంపులు - Loving Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

ప్రేమించు తలంపులు:
విలాపవాక్యములు 3:22 - "యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది".
మనము పిల్లలుగా ఉన్నప్పుడు మనలను ఎల్లప్పుడూ రక్షణ కలుగజేయుచూ ప్రేమను అందించు తండ్రి ఎంతో అవసరం. కొందరు ప్రేమిస్తారు గానీ దండించరు మరికొందరు దండిస్తారు కానీ ప్రేమను వ్యక్తపరచరు. కేవలం మన పరమతండ్రియైన యెహోవా దేవుడు మాత్రమే మనలను ప్రేమించుచూ గద్దించుచూ సరైన మార్గములో నడిపిస్తాడు. ఆయన యొక్క విస్తారమైన, బలమైన, స్థిరమైన ప్రేమను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునితో మనకున్న సన్నిధి బలపడే కొద్ది మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ తొలగిపోయి మనము ఆత్మీయంగా బలపడగలము. మన చుట్టూ ఉన్న వారికన్నా దేవుడు మాత్రమే మనలను గొప్పగా ప్రేమించగలడని గ్రహించినప్పుడు మన చుట్టూ ఉన్నదంతా మార్పు చెందుతుంది.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీవు మాయెడల కురిపించుచున్న విస్తారమైన ప్రేమను బట్టి నీకు వందనములు. ఆ ప్రేమను అర్థం చేసుకొనే శక్తిని ప్రసాదించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Loving Thoughts:
Lamentations 3:22- “The Lord’ s love never ends; his mercies never stop.” As children, we needed fathers who balanced the power of their protective abilities with the tenderness of their love. Some fathers exhibited power without tenderness. Others were tender but lacked strength. Only our heavenly Father is perfect in both power and love for His children. You must have an accurate understanding of His great, fierce, crazy, unrelenting love for you.As we begin to understand who God is, His love for us begins to change the way we feel about ourselves. As our relationship with God grows, our communication with Him flourishes, and He begins to change the way we treat ourselves.  As we begin to see ourselves as loved by God rather than as people who must meet certain standards to be worthy of love, everything around us begins to change. Experience that change.

Talk to The King:
Father thank You for Your unrelenting love towards us. Help me understand Your love from within. In Jesus name, I pray, Amen.