Day 23 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? (కీర్తన 10:1).

బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కాని బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మనమీద పడుతున్న వత్తిడి తనకేమీ పట్టదన్నట్టు, మనం ఆ బాధలు పడడానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము.కాని ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి, మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దానిమీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ, ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే, నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు సొరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు.

దారి తెలియకపోతేనేం కష్టాల కారుచీకటైతేనేం
నీడల్లో నాకు తోడు నీ కోమల పాదల చప్పుడు