ప్రార్థన


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

ప్రార్థన
Audio: https://youtu.be/mD8YT0Hj1wY

ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు.

కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు.

కొందరు ప్రార్థన ఎంత సమయం చేసారో లెక్కపెట్టుకుంటారు. మరి కొందరు మేము ఆత్మీయతలో సీనియర్స్, మేము పది నిమషములు ప్రార్థన చేస్తే చాలు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు.ఎడతెగక దేవుని పరిచర్య చేసేవారు పది నిమిషములు కాదు, సమయం లేని సందర్భములో నడుస్తూ ప్రార్థించినా దేవుడు బలమైన కార్యములు చేయగలడు. కాని, దినమంత వ్యర్ధమైన పనులు చేస్తూ పది నిమిషములు ప్రార్థించి దేవుడు బలమైన కార్యములు చేస్తాడు అనుకోవడం భ్రమ.

నేనంటాను మనం క్రీస్తు స్వభావంలోనికి మారకుండా మన జీవిత కాలమంతా మోకాళ్ళ పై ఉన్నా మన జీవితంలో దేవుని కార్యం ఒకటి కూడా చూడలేము.
ప్రార్ధన మన జీవితమును మార్చాలి. మన ప్రార్ధన స్వభావము క్రీస్తులోనికి మర్చినప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యములు చూడగలము
విస్వాసమును విడిచిపెట్టకుండా జవాబు వచ్చు వరకు మనం ప్రార్ధన చేయాలి అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యములు చూడగలము

దావీదు ప్రార్థన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కీర్తనలు 18:6 లొ ... నా దేవునికు ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్ళడం కూడా చూసాడు. ఇది నిజమైన విశ్వాసముతో కూడిన ప్రార్ధన. దేవుని యొక్క స్వభావములోనికి మారినప్పుడే ఇలాంటి కార్యములు చూడగలుగుతాము.

ఈరోజు మన ప్రార్ధన జీవితం ఎలా ఉంది?