క్రీస్తుతో 40 శ్రమానుభవములు 3వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 3 వ రోజు:

క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు...ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. I పేతురు 4:14,16

- క్రీస్తును విశ్వసించిన మొట్టమొదటి దినములలో ఎన్నో తీర్మానాలు తీసుకొని ఉంటాము. అందరిముందూ నిలబడి "నేను క్రీస్తును అంగీకరించాను" అని బిగ్గరగా చెప్పిన సంఘటన జ్ఞాపకము చేసుకుంటే; ఆ రోజునుండి నేటి వరకు నాలో ఉన్న మార్పు తగ్గిందో పెరిగిందో వ్యత్యాసం గమనించుకున్నప్పుడు... విశ్వాసజీవితంలో నేను ఎంతో ఎత్తుకు ఎదిగాను అని అనిపిస్తే పర్వాలేదు. కాని, అయ్యో! నేను దిగజారిపోయానే అనిపిస్తేనే కదా సమస్య. కార్యారంభముకంటె కార్యాంతము మేలు. రోజు రోజుకి మన విశ్వాసం రెట్టింపవ్వాలి. ఎక్కడ పడిపోయామో, ఇదివర్కు ఎలా వాటిని అధిగమించామో జ్ఞాపకము చేసుకోగలిగితే అదొక వినూత్న అనుభవం.

- అనేకసార్లు మన విస్వాసం సన్నగిల్లే సందర్భాలకు కారణం మన చుట్టూ ఉండే పరిస్థితులే. క్రైస్తవ విశ్వాసం అంటే చులకన చేసే మన సమాజంలో, విశ్వాసాన్ని కాపాడుకోడానికి మనం చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. అవమానాలు, నిందలు, సంఘ బహిష్కరణ వంటివి మానసిక ఒత్తిడికి గురిచేయడం వల్ల అధిక శ్రమలపాలవుతాము. ఇదే పరిస్థితి ఆ దినాలలో మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా తప్పలేదు. నూతనంగా రక్షించబడిన ప్రతీ వ్యక్తికి సమాజంలో ఎపుడూ ఎదురు దెబ్బలే. ఇవే విశ్వాస పరీక్షలలో మనకు కలిగే శ్రమలు. వీటిని అధిగమిచాలన్న మానవ ప్రయత్నం ఎప్పుడు ఓటమికి చేరువగానే ఉంటుంది.

- అయితే, శ్రమ కలిగినప్పుడు పరిశుద్దాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉండి, కృంగుదల కలుగనీయకుండా అధిగమించగలిగిన జ్ఞానము దయచేస్తాడు. ఈ అనుభవం మనలను ధన్యులనుజేస్తుంది. ఎందుకంటే - దేవుని ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ (యెషయా 11:2).

- క్రీస్తును అంగీకరించిన మనం ఎప్పుడు సిగ్గుపడనక్కరలేదు. ఈ శ్రమలలో పొందే అనుభవాలు మనలను నీతిమంతులుగా చేస్తాయి. అవి మహా ఆనందం అని నేర్చుకొన్నప్రకారము - దైవిక అలోచనలకు, అపవాది సంబంధ అశలకు మధ్య సంఘర్షణే శ్రమ; కాబట్టి మనకు శ్రమలు కలిగించే అపవాదికి, వాని అనుచరులకు తీర్పు ఎంతో దూరం లేదు.

అనుభవం : నా శ్రమానుభవంలో క్రీస్తు ఉన్నాడు. ప్రతి శ్రమలో నాతో ఉన్నవాడు నమ్మదగినవాడు. అంతిమ విజయం నాకే.

https://youtu.be/I4UzS07zFTY

Experience the Suffering with Christ - 3rd Experience

If you are insulted because of the name of Christ, you are blessed, for the Spirit of glory and of God rests on you.. However, if you suffer as a Christian, do not be ashamed, but praise God that you bear that name - 1 Peter 4:14,16

We make many decisions in the initial days of accepting Christ. When we remember the past situations, where we stood up and shouted "I have accepted Christ"; Let
me ask a question - How is the current situation of the faith, was it diminished or increased? it is good if you feel that you might have risen to great heights in the life of faith. But the problem is only when you feel diminished. It should be always better at the end than at the beginning. We need to double our faith day by day. It is a different experience when we remember, where we had fall and how we had overcome them.

Many times, the circumstances around us are the cause of situations where our faith was weakening. In our society, when the Christian faith is not respected, we try to protect our faith in many ways. Insults, slanders, and social exclusion lead to stress and afflictions. The same was happened to our Lord Jesus Christ in those days. Every new believer deals with these in the society. These are the hardships we face in tests of faith. At times human endeavor to overcome these is on the verge of defeat.

However, the Holy Spirit can be our helper when we are in trouble and gives us the wisdom to overcome depression. This experience makes us blessed. Because - the Spirit of God is the basis of wisdom and knowledge (Isaiah 11: 2).

We who have accepted Christ should never be ashamed. The experiences gained in tribulations makes us righteous. As we have learned that it is a great pleasure - the conflict between divine thoughts and slanderous aspirations are nothing but tribulations; So judgment is not far off for the slanderer and his followers who cause us hardships.

Experience: Christ was with me in my tribulation experience. The one who is with me in every endeavor is trustworthy. The ultimate victory is mine.

https://youtu.be/WSkyhMB6h2Q