నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. Rev 2:9
ప్రస్తుత రాజకీయ ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే వ్యవస్థలో మనమున్నాం. ఒకవైపు ఆర్ధిక మాంధ్యంలో సామాన్య మానవ సహజ జీవితాలు అధికార బానిసత్వంలో కొట్టుకుపోతుంటే, మరోవైపు సామాజిక హక్కులను భౌతికంగా నిర్మూలించాలానే పాలకుల వర్గం విచ్చలవిడైపోతుంది. అసహన విధ్వంస పరిస్థితులు ఒకవైపు అంచలంచలుగా పెరుగుతుంటే మరోవైపు ధిక్కార స్వరం నిర్బంధించే ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది.
వ్యవస్థలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మన విశ్వాసం లోని అభ్యాసాలకు పదును పెట్టాలి. రోజువారీ జీవితానికి ఆధ్యాత్మికతను జోడిస్తే శక్తివంతంగా వ్యవస్థల్లోని మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోగలం పరిష్కరించగలమని నా అభిప్రాయం.
ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేసే లౌకిక విషయాల్లోని వాస్తవ అవాస్తవాల మధ్య నిజాలను తెలుసుకొనగలిగే జ్ఞానం కేవలం క్రైస్తవ్యత్వంతోనే సాధ్యం. మన జీవితాలను ప్రకాశవంతం చేసే ప్రతి జ్ఞానానికి సంఘం కేంద్రంగా ఉంటుంది. క్రైస్తవుడు తన సంబంధాన్ని సంఘంతో ఏర్పరచుకున్నప్పుడు ఈ జ్ఞానం మనకు బయలుపరచబడుతుంది. క్రీస్తు మన నుండి ఆశిస్తున్నది ఇదే.
యుద్ధరంగంలో నిలబడి మృత్యువు ఇవ్వళ్ళో రేపో తెలియని సందిగ్ధంలో ఏ సైనికుడైనా ఉంటాడా? మరు నిమిషం ఏమి జరుగుతుందని సందేహించకుండా ఆ మృత్యువును ఎదుర్కొని దానితో తలపడి పోరాడి గెలవాలనే గురి కలిగియుంటాడు కదా. ఆత్మీయ జీవితంలోని కలిగే శ్రమల విషయాల్లో కూడా ఇంతే; రేపేమి సంభవించునో అని సందేహించక, పొందబోయే ప్రతి శ్రమను ఎదుర్కొని చేధించగలమనే క్రీస్తుతో శ్రమానుభవం మనకుంటే... ఈ అనుభవం అపారమైన శక్తి, సంతోషాలు కలుగజేస్తాయి. ఇట్టి శ్రమ విలువ తెలిసినప్పుడు భయానికి ఇక తావుండదు.
నిస్సందేహంగా నిర్భయంగా ఎదుర్కొనగలిగే ప్రతి బాధలు వ్యవస్థీకృతలో అటు దైనందిన జీవితాన్ని, ఇటు ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుతో విజయంవైపు నడిపించి ఎత్తబడే సంఘంతో కలిసి ఆయనను ఎదుర్కొనే కృపను దయజేస్తాయి. క్రీస్తును ఎదుర్కోవాలంటే ప్రార్ధనా, సమర్పణ, సిద్ధపాటు కావలి.
అనుభవం: క్రీస్తుతో శ్రమానుభవం అపారమైన శక్తి, సంతోషాలు కలిగిస్తే, నిర్భయంగా ఎదుర్కొనే బాధలు క్రీస్తుతో విజయానికి నడిపిస్తాయి.