నీవు చేయగలవు!

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

నీవు చేయగలవు!
Audio: https://youtu.be/do6NJxkcqBg

విలాపవాక్యములు 3:22 - 23 - “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.”
దినమంతా శ్రమ పడి, ఆ రోజు గడచి పోయాక...ఈ రోజంతా మనమేమి చేసామని ఆలోచిస్తే? అలా చేసియుండకుండా ఉంటే బాగుండు లేదా ఏదైనా క్రొత్తగా చేసియుండాల్సింది లేదా కాస్త భిన్నంగా చేయాల్సింది అని ఏదోక సందర్భంలో అనిపిస్తుంది. ఆ సందర్భాలలో మన ఆత్మ కృంగిపోవచ్చు మరియు నీరుగారిపోయే పరిస్థితి ఎదురవ్వచ్చు.

కాని, పర్వాలేదు మళ్ళీ మొదలుపెడదాం...అని మనలో మనం అనుకునే సంకల్పం మనకుంటేనే మన ఆలోచనల్లో మార్పును చూడగలం. అవును, ఆ సందర్భాలలో నీలో ఉన్న శక్తి "నీవు చేయగలవు" అనే సంకల్పంతో క్రొత్త మార్గాలు తెరుచుకుంటాయి. బహుశ అవి విజయమార్గాలే కావచ్చు. వెనకడుగు వేయకుండా ప్రయత్నించాలి. ప్రతీ ఉదయం... దేవుని కృప మరియు ప్రేమ నిన్ను క్రొత్త ఆరంభం వైపు నడిపిస్తాయి. నిన్నటి బాధలు ముగిసిపోయాయి, కానీ ఆయన ప్రేమ మరియు విశ్వాస్యత నిత్యం మనకొఱకు ప్రకాశిస్తూనే ఉంటాయి.

నూతన తలంపులు, నూతన హృదయంతో దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

more devotions on youtube please visit the below link

https://www.youtube.com/playlist?list=PLeddg8-6BBJPNSEClIZRTsmImVGIOyHt-