ఎంతో సుందరుడమ్మతాను
-
-
-
ఎంతో సుందరుడమ్మతానునేనెంతో మురిసిపోయాను !!2!!
1. ధవళ వర్ణుడు - రత్నవర్ణుడు నా ప్రియుడు - అవని పదివేలందు - అతిశ్రేష్ఠుడా తండు - ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు -అవలీలగా నతని - గురుతింపగలరమ్మ !!ఎంతో!!
2. పాలతోకడిగిన - నయనాలకలవాడు - వులువగు రత్నాలవలె పొదిగినకనులు - కలుషము కడిగిన కమలాల కనుదోయి - విలువైన చూపొసగే -వరమేరి తనయుండు !!ఎంతో!!
౩. అతడతికాంక్షణీయొండు - రాయుండు - అతడే నా ప్రియుండు - అతడేనాహితుడు అతని నోరతిమధురంబు - మధురంబు - అతని పలువరుస- ముత్యాల సరివరుస !!ఎంతో!!