హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే
-
-
-
- హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే జనులార మనసార ఊరూరా రారే జనులార ఊరూరా మనసార
- పాడి పంటల నిచ్చి పాలించు దేవుడని కూడు గుద్దలనిచ్చు పోషించు దేవుడని తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడనిపూజించి...పూజించి పాటించి చాటించ రారే
- బంధు మిత్రులకన్నా బలమైన దేవుడని అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని కన్నా బిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి...పూజించి పాటించి చాటించ రారే
- తాత ముత్తతలకన్న ముందున్న దేవుడని తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లా కపటములేని కరుణ సంపన్నుడనిపూజించి...పూజించి పాటించి చాటించ రారే
- రాజాధి రాజుకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమించి వచేనని నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే