Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా - Divinelu Sthothraarhudaa Yesayyaa


    • దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
    • దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
    • మొదటివాడవు – కడపటివాడవు
    • యుగయుగములలో ఉన్నవాడవు (2)

    • మానక నా యెడల కృప చూపుచున్నావు
    • మారదు నీ ప్రేమ తరతరములకు (2)
    • మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
    • నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
    • నీ మాటలు జీవపు ఊటలు
    • నీ కృపలే బలమైన కోటలు (2)       ||దివినేలు||

    • దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
    • దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
    • దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
    • దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
    • నీ దీవెన పరిమళ సువాసన
    • నీ ఘనతే స్థిరమైన సంపద (2)       ||దివినేలు||

    • సీయోను శిఖరముపై నను నిలుపుటకే
    • జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
    • దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
    • సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
    • నీ రాజ్యము పరిశుద్ధ నగరము
    • ఆ రాజ్యమే నిత్య సంతోషము (2)       ||దివినేలు||

    • Divinelu Sthothraarhudaa Yesayyaa
    • Digi Raanaiyunna Maharaajuvu Neevayyaa
    • Modativaadavu – Kadapativaadavu
    • Yugayugamulalo Unnavaadavu (2)

    • Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu
    • Maaradu Nee Prema Tharatharamulaku (2)
    • Maata Thappani Mahaneeyudavu – Maarpuleni Vaadavu
    • Neevu Cheppina Manchi Maatalu – Neraverchuvaadavu
    • Nee Maatalu Jeevapu Ootalu
    • Nee Krupale Balamaina Kotalu (2)          ||Divinelu||

    • Daachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu
    • Dayanondina Nee Janula Mundu Naduchuchunnaavu (2)
    • Daati Vellani Karunaamoorthivai – Manavi Aalakinchaavu
    • Deergha Shaanthamugalavaadavai – Deevinchuvaadavu
    • Nee Deevna Parimala Suvaasana
    • Nee Ghanathe Sthiramaina Sampada (2)          ||Divinelu||

    • Seeyonu Shikharamupai Nanu Niluputake
    • Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2)
    • Divyamaina Prathyakshathatho – Nannu Nimpiyunnaavu
    • Sundaramaina Nee Polikagaa – Roopu Didduchunnaavu
    • Nee Raajyamu Parishuddha Nagaramu
    • Aa Raajyame Nithya Santhoshamu (2)          ||Divinelu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 231 times