Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవా మా కుటుంబము - Devaa Maa Kutumbamu


    • దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)
    • ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ
    • నీ ఆత్మతో నింపుమా (2)           ||దేవా||

    • కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు
    • మాకేమి భయము – మాకేమి దిగులు
    • నీకే వందనములయ్యా
    • లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము
    • లోకాశలు వీడి – లోకంబులోన
    • నీ మందగా ఉందుము          ||దేవా||

    • సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము
    • నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు
    • ఇమ్మహిలో మాకిమ్మయ్యా
    • ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము
    • ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా
    • మమ్ములను బలపరచుము         ||దేవా||

    • ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను
    • లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా
    • దాచుము నీ చేతులలో
    • ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
    • ఫల సంపదలతోను – కలకాలము జీవించ
    • కురుపించుము నీ దీవెనలన్         ||దేవా||

    • పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్
    • నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో
    • సంతసంబుగ సాగెదము
    • వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము
    • కొంత కాలమే మేము – ఉందుము లోకాన
    • చెంత చేరగ కోరెదము
    • నీ చెంత చేరగ కోరెదము            ||దేవా||

    • Devaa Maa Kutumbamu – Nee Sevake Ankithamu (2)
    • Ee Shaapa Lokaana – Nee Saakshulugaa Niluva
    • Nee Aathmatho Nimpumaa (2)           ||Devaa||

    • Kaapari Maa Yesu Prabhuve – Koduvemi Ledu Maaku
    • Maakemi Bhayamu – Maakemi Digulu
    • Neeke Vandanamulayyaa
    • Lobadi Jeevinthumu – Lopambulu Savarinchumu
    • Lokaashalu Veedi – Lokambulona
    • Nee Mandagaa Undumu          ||Devaa||

    • Samruddhi Jeevambunu – Samruddhigaa Maakimmu
    • Nemmadi Gala Illu – Nimmalamagu Manassu
    • Immahilo Maakimmayyaa
    • Immuga Dayachesyumu – Ginne Nindina Anubhavamu
    • Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
    • Mammulanu Balaparachumu        ||Devaa||

    • Ae Keedu Raakundagaa – Kaapaadumu Maa Pillalanu
    • Loka Duru Vyasanamula – Thaakudu Lekunda
    • Daachumu Nee Chethulalo
    • Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
    • Phala Sampadalathonu – Kalakaalamu Jeevincha
    • Kurupinchumu Nee Deevenalan         ||Devaa||

    • Pempaara Jeyumu Maalo – Sompuga Nee Ghana Preman
    • Nimpumaa Hrudayamula – Shaanthi Bhaagyambulatho
    • Santhasambuga Saagedamu
    • Vinthaina Nee Premanu – Anthata Prakatinthumu
    • Kontha Kaalame Memu – Undumu Lokaana
    • Chentha Cheraga Koredamu
    • Nee Chentha Cheraga Koredamu          ||Devaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 290 times