Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వమానవ పాపపరిహారార్థమై - Sarva Maanava Paapa Parihaaraardhamai


    • సర్వమానవ పాపపరిహారార్థమై
    • సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

    • దోషివా…. ప్రభూ…. నువు దోషివా
    • నీ విధేయతకు నా అవిధేయతకు
    • మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
    • దోషివా…. ప్రభూ…. నువు దోషివా

    • ఘోరంబుగా నే చేసిన నేరాలకు
    • నువు పొందిన మరణ శిక్ష
    • నే నడచిన వక్ర మార్గాలకు
    • నువు పొందిన సిలువ యాతన (2)
    • కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
    • నే పొందిన రక్షణా పాత్ర (2)      ||దోషివా||

    • నే వేసిన తప్పటడుగులకు
    • నీవు కార్చిన రక్త పు మడుగులూ
    • నే చేసిన కపటంబులకు
    • నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
    • సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
    • ప్రేమించితివే నన్ను (2)      ||దోషివా||

    • తులువలలో ఓ తులువగా నున్న
    • నా పై నీ దయగల చూపు
    • పరలోకములో నీతో నుండ
    • భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
    • తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
    • నీ తుది శ్వాస వీడనంటివే (2)      ||దోషివా||

    • Sarva Maanava Paapa Parihaaraardhamai
    • Siluvalo Vrelaadina Shree Yesunaathaa – (2)

    • Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa
    • Nee Vidheyathaku Naa Avidheyathaku
    • Madhyalo Naligi Vrelaadina Nirdoshivaa (2)
    • Doshivaa.. Prabhu.. Nuvu Doshivaa

    • Ghorambugaa Ne Chesina Neraalaku
    • Nuvu Pondina Marana Shiksha
    • Ne Nadachina Vakra Maargaalaku
    • Nuvu Pondina Siluva Yaathana (2)
    • Kaluvari Girilo Aa Ghora Yaathra (2)
    • Ne Pondina Rakshana Paathra (2)       ||Doshivaa||

    • Ne Vesina Thappatadugulaku
    • Neevu Kaarchina Rakthapu Madugulu
    • Ne Chesina Kapatambulaku
    • Neevu Pondina Koradaa Debbalu (2)
    • Sampoorna Siddhi Nosagithive Naaku (2)
    • Preminchithive Nannu (2)       ||Doshivaa||

    • Thuluvalalo O Thuluvagaa Nunna
    • Naapai Nee Dayagala Choopu
    • Paralokamulo Neetho Nunda
    • Bhaagyambunu Naaku Ichchinadhe (2)
    • Thudi Varaku Nee Divya Premanu Pancha (2)
    • Nee Thudhi Shwaasa Veedanantive (2)       ||Doshivaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 140 times