Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా ప్రాణమా నాలో నీవు - Naa Praanamaa Naalo Neevu


    • నా ప్రాణమా నాలో నీవు
    • ఎందుకు కృంగియున్నావు
    • యెహోవాయందే ఇంకను
    • నిరీక్షణ ఉంచుము నీవు (2)          ||నా ప్రాణమా||

    • ఈతి బాధల్ కఠిన శ్రమలు
    • అవమానములే కలిగిన వేళ (2)
    • నీ కొరకే బలియైన యేసు
    • సిలువను గూర్చి తలపోయుమా (2)
    • అల్పకాల శ్రమల పిదప
    • మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

    • ఆప్తులంతా నిను వీడిననూ
    • శత్రువులే నీపై లేచిననూ (2)
    • తల్లి అయినా మరచినా మరచున్
    • నేను నిన్ను మరువాననినా (2)
    • యేసుని ప్రేమన్ తలపోయుమా
    • ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

    • ఐశ్వర్యమే లేకున్ననూ
    • సౌఖ్య జీవితమే కరువైననూ (2)
    • ప్రభు సేవలో ప్రాణములనే
    • అర్పించవలసి వచ్చిననూ (2)
    • క్రీస్తునికే అంకితమై ఆనందించు
    • ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2)     ||నా ప్రాణమా||

    • Naa Praanamaa Naalo Neevu
    • Enduku Krungiyunnaavu
    • Yehova Yande Inkanu
    • Nireekshana Unchumu Neevu (2)     ||Naa Praanamaa||

    • Eethi Baadhal Katina Shramalu
    • Avamaanamule Kaligina Vela (2)
    • Nee Korake Baliyaina Yesu
    • Siluvanu Goorchi Thalapoyumaa (2)
    • Alpakaala Shramala Pidapa
    • Mahimatho Ninu Nimpunu Prabhu Naa Praanamaa (2)      ||Naa Praanamaa||

    • Aapthulantha Ninu Veedinanoo
    • Shathruvule Neepai Lechinanoo (2)
    • Thalliainaa Marachina Marachun
    • Nenu Ninnu Maruvaananinaa (2)
    • Yesuni Preman Thalapoyumaa
    • Aashrayinchu Prabhuni Naa Praanamaa (2)        ||Naa Praanamaa||

    • Aiashwaryame Lekunnanoo
    • Soukhya Jeevithame Karuvainanoo (2)
    • Prabhu Sevalo Praanamulane
    • Arpinchavalasi Vachchinanoo (2)
    • Kreesthunike Ankithamai Aanandinchu
    • Prabhu Raakakai Kanipettumaa Naa Praanamaa (2)     ||Naa Praanamaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 262 times