Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము - Naa Brathuku Dinamulu Lekkimpa Nerpumu


    • నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
    • దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
    • ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
    • నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము     ||నా బ్రతుకు||

    • ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
    • నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
    • ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
    • ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
    • నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
    • మరల నన్ను నూతనముగ చిగురు వేయని     ||నా బ్రతుకు||

    • నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి
    • నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను
    • నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది
    • దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము
    • యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
    • విశేషముగా రూపించుము నా శేష జీవితం     ||నా బ్రతుకు||

    • Naa Brathuku Dinamulu Lekkimpa Nerpumu
    • Devaa Ee Bhuvini Veedu Gadiya Naaku Choopumu
    • Inkontha Kaalamu Aayushshu Penchumu
    • Naa Brathuku Maarchukondunu Samayamunimmu ||Naa Brathuku||

    • Enno Samvathsaraalu Nannu Daatipovuchunnavi
    • Naa Aashalu Naa Kalalane Vembadinchuchuntini
    • Phalaalu Leni Vrukshamu Vale Edigipothini
    • Enaadu Koolipoduno Erugakuntini
    • Naa Marana Rodana Aalakinchumo Prabhu
    • Marala Nannu Noothanamuga Chiguru Veyani ||Naa Brathuku||

    • Nee Pilupu Nenu Marachithi – Naa Parugulo Nenalasithi
    • Naa Swaardhamu Naa Paapamu – Pathana Sthithiki Cherchenu
    • Naa Anthametula Nunduno – Bhayamu Puttuchunnadi
    • Devaa Nannu Manninchumu – Naa Brathuku Maarchumu
    • Yesu Nee Chethiki Ika Longipodunu
    • Visheshamugaa Roopinchumu Naa Shesha Jeevitham ||Naa Brathuku||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 9824 times