Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ ప్రేమ నాలో మధురమైనది -Nee Prema Naalo Madhuramainadi


    • నీ ప్రేమ నాలో మధురమైనది
    • అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
    • ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
    • పరవశించి నాలో మహిమపరతు నిన్నే
    • సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
    • సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే        ||నీ ప్రేమ||

    • చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
    • కాదనలేదే నా మనవులు నీవు (2)
    • హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
    • నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
    • ఇది నీ బాహు బంధాల అనుబంధమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

    • నా ప్రతి పదములో జీవము నీవే
    • నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
    • ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
    • నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2)
    • ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

    • నీ సింహాసనము నను చేర్చుటకు
    • సిలువను మోయుట నేర్పించితివి (2)
    • కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
    • దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2)
    • ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

    • Nee Prema Naalo Madhuramainadi
    • Adi Naa Oohakandani Kshema Shikharamu (2)
    • Eri Korukunnaavu Prema Choopi Nannu
    • Paravashinchi Naalo Mahimaparathu Ninne
    • Sarvakrupaanidhi Neevu – Sarvaadhikaarivi Neevu
    • Sathya Swaroopivi Neevu – Aaraadhinthunu Ninne         ||Nee Prema||

    • Cherithi Ninne Virigina Manassutho
    • Kaadanalede Naa Manavulu Neevu (2)
    • Hrudayamu Nindina Gaanam – Nanu Nadipe Prema Kaavyam
    • Niarathamu Naalo Neeve – Cheragani Divya Roopam (2)
    • Idi Nee Baahu Bandhaala Anubandhamaa
    • Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    • Naa Yesuraajaa Aaraadhana Neeke (2)        ||Nee Prema||

    • Naa Prathi Padamulo Jeevamu Neeve
    • Naa Prathi Adugulo Vijayamu Neeve (2)
    • Ennadu Viduvani Prema – Ninu Chere Kshanamu Raadaa
    • Needagaa Naatho Niliche – Nee Krupaye Naaku Chaalunu (2)
    • Idi Nee Prema Kuripinchu Hemanthamaa
    • Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    • Naa Yesuraajaa Aaraadhana Neeke (2)        ||Nee Prema||

    • Nee Simhaasnamu Nanu Cherchutaku
    • Siluvanu Moyuta Nerpinchithivi (2)
    • Kondalu Loyalu Daate – Mahimaathmatho Nimpinaavu
    • Dayagala Aatmatho Nimpi – Samabhoomipai Nadipinaavu (2)
    • Idi Nee Aathma Bandhamukai Sankethamaa
    • Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    • Naa Yesuraajaa Aaraadhana Neeke (2)        ||Nee Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 8268 times