Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ స్వరము వినిపించు ప్రభువా - Nee Swaramu Vinipinchu Prabhuvaa


    • నీ స్వరము వినిపించు ప్రభువా
    • నీ దాసుడాలకించున్ (2)
    • నీ వాక్యమును నేర్పించు
    • దానియందు నడుచునట్లు నీతో           ||నీ స్వరము||

    • ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
    • నాకు ఎంతో మధురము
    • దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
    • రక్షించు ఆపదలనుండి – (2)         ||నీ స్వరము||

    • నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
    • నేను సరి చేసికొందు
    • నీ మార్గములో – నడుచునట్లుగా
    • నేర్పించుము ఎల్లప్పుడూ – (2)         ||నీ స్వరము||

    • భయ భీతులలో – తుఫానులలో
    • నీ స్వరము వినిపించుము
    • అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
    • ధైర్య పరచుము నన్ను – (2)         ||నీ స్వరము||

    • నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
    • నీ స్వరము నా కొరకే
    • నీతో మనుష్యులతో – సరిచేసికొందు
    • నీ దివ్య వాక్యము ద్వారా – (2)         ||నీ స్వరము||

    • నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
    • నీ వాక్యమును ఎంతో
    • నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
    • నీ యందు నిలచునట్లు – (2)         ||నీ స్వరము||

    • నా హృదయములోని – చెడు తలంపులను
    • చేధించు నీ వాక్యము
    • నీ రూపమునకు – మార్చుము నన్ను
    • నీదు మహిమ కొరకేగా – (2)         ||నీ స్వరము||

    • Nee Swaramu Vinipinchu Prabhuvaa
    • Nee Dhaasudaalakinchun (2)
    • Nee Vaakyamunu Nerpinchu
    • Daaniyandu Naduchunatlu Neetho          ||Nee Swaramu||

    • Udayamune Lechi – Nee Swaramu Vinuta
    • Naaku Entho Madhuramu
    • Dinamanthati Koraku – Nanu Siddhaparachu
    • Rakshinchu Aapadalanundi – (2)         ||Nee Swaramu||

    • Nee Vaakyamu Chadivi – Nee Swaramu Vinuchu
    • Nenu Sari Chesikondu
    • Nee Maargamulo – Naduchunatlugaa
    • Nerpinchumu Ellappudu – (2)         ||Nee Swaramu||

    • Bhaya Bheethulalo – Thuphaanulalo
    • Nee Swaramu Vinipinchumu
    • Abhayamu Nimmu – O Goppa Devaa
    • Dhairya Parachumu Nannu – (2)         ||Nee Swaramu||

    • Naatho Maatlaadu – Spashtamugaa Prabhuvaa
    • Nee Swaramu Naa Korake
    • Neetho Manushyulatho – Sarichesikondu
    • Nee Divya Vaakyamu Dvaaraa – (2)         ||Nee Swaramu||

    • Nerchukunnaanu – Naa Shramala Dvaaraa
    • Nee Vaakyamunu Entho
    • Nannunchumu Prabhuvaa – Nee Vishwaasyathalo
    • Nee Yandu Nilachunatlu – (2)         ||Nee Swaramu||

    • Naa Hrudayamuloni – Chedu Thalampulanu
    • Chedhinchu Nee Vaakyamu
    • Nee Roopamunaku – Maarchumu Nannu
    • Needu Mahima Korakegaa – (2)         ||Nee Swaramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4230 times