Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నూతనమైనది నీ వాత్సల్యము - Noothanamainadi Nee Vaathsalyamu


    • నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
    • ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
    • తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
    • నీ ప్రేమలో మార్పు లేదు (2)
    • సన్నుతించెదను నా యేసయ్యా
    • సన్నుతించెదను నీ నామము (2)

    • గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
    • జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)
    • విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను
    • క్షణమైనా త్రోసివేయవు (2)         ||సన్నుతించెదను||

    • నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు
    • ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2)
    • మరువని దేవుడవు – నను మరువలేదు నీవు
    • ఏ సమయమైననూ చేయి విడువవు (2)         ||సన్నుతించెదను||

    • నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు
    • నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2)
    • ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను
    • సమయోచితముగా ఆదరించినావు (2)         ||సన్నుతించెదను||

    • Noothanamainadi Nee Vaathsalyamu
    • Prathi Dinamu Nannu Darshinchenu
    • Edabaayanidi Nee Kanikaramu
    • Nannentho Preminchenu
    • Tharamulu Maaruchunnanu – Dinamulu Gadachuchunnanu
    • Nee Premalo Maarpu Ledu (2)
    • Sannuthinchedanu Naa Yesayyaa
    • Sannuthinchedanu Nee Naamamu (2)

    • Gadachina Kaalamanthaa – Nee Krupa Choopi – Aadarinchinaavu
    • Jaragaboye Kaalamanthaa – Nee Krupalona – Nannu Daachedavu (2)
    • Viduvani Devudavu – Edabaayaledu Nannu
    • Kshanamainaa Throsiveyavu (2)       ||Sannuthinchedanu||

    • Naa Heena Dashalo – Nee Prema Choopi – Paiki Lepinaavu
    • Unnatha Sthalamulo – Nanu Niluvabetti – Dhairyaparachinaavu (2)
    • Maruvani Devudavu – Nanu Maruvaledu Neevu
    • Ae Samayamainanu Cheyi Viduvavu (2)       ||Sannuthinchedanu||

    • Nee Rekkala Krinda – Nanu Daachinaavu – Aashrayamainaavu
    • Naa Daagu Sthalamuga – Neevundinaavu – Samrakshinchaavu (2)
    • Preminche Devudavu – Thrupthi Parachinaavu Nannu
    • Samayochithamuga Aadarinchinaavu (2)       ||Sannuthinchedanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4172 times