Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నెమ్మది లేదా నెమ్మది లేదా - Nemmadi Ledaa Nemmadi Ledaa


    • నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా
    • చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా
    • ఆశలు ఆవిరై పోయినా
    • నీ కలలన్ని చెదరిన
    • అలసిపోక సాగిపోవుమా (2)        ||నెమ్మది||

    • నీ వారు నిన్ను హేళన చేసినా
    • నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ
    • గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ
    • అవమానం నింద కలచి వేస్తున్నా
    • నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును
    • నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును
    • నీ కోసమే తను నిలిచెను
    • నీ బాధను తొలగించును         ||నెమ్మది||

    • నీ కన్నీరంతా తుడిచి వేయును
    • నీ గాయాన్నంతా మాన్పి వేయును
    • విలువైన పాత్రగ నిన్ను మార్చును
    • నీ వారికే నిన్ను దీవెనగా చేయును
    • కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును
    • నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును
    • తన ప్రేమకు నువ్వు సాక్షిగా
    • జీవించుమా ఇల నిత్యము

    • నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు
    • చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం

    • Nemmadi Ledaa Nemmadi Ledaa – Ontarivainaavaa
    • Cheekati Brathukulo Velugu Leka – Thiruguchunnaava
    • Aashalu Aavirai Poyinaa
    • Nee Kalalanni Chedarinaa
    • Alasipoka Saagipovumaa (2)        ||Nemmadi||

    • Nee Vaaru Ninnu Helana Chesinaa
    • Nee Prema Bandhu Ninnu Vidachinanu
    • Gaadaandha Kaaram Ninnu Chuttinanu
    • Avamaanam Ninda Kalachi Vesthunnaa
    • Ninu Viduvani Devude Nee Thodugaa Undunu
    • Needu Vedanalalone Neeku Dhairyamu Nichchunu
    • Nee Kosame Thanu Nilichenu
    • Nee Baadhanu Tholaginchunu         ||Nemmadi||

    • Nee Kanneeranthaa Thudichi Veyunu
    • Nee Gaayannantha Maanpi Veyunu
    • Viluvaina Paathraga Ninnu Maarchunu
    • Nee Vaarike Ninnu Deevenagaa Cheyunu
    • Kaapari Vale Ninnu Thana Krupalatho Nadupunu
    • Nithya Jeeva Maargam Neeku Aayane Choopunu
    • Thana Premaku Nuvu Saakshigaa
    • Jeevinchumaa Ila Nithyamu

    • Nemmadi Pondu Nemmadi Pondu – Yese Nee Thodu
    • Cheekati Brathukulo Velugu Choope – Yese Nee Maargam
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 158 times