Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రార్థన వినెడి పావనుడా - Praarthana Vinedi Paavanudaa


    • ప్రార్థన వినెడి పావనుడా
    • ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||

    • శ్రేష్టమైన భావము గూర్చి
    • శిష్య బృందముకు నేర్పితివి
    • పరముడ నిన్ను ప్రనుతించెదము
    • పరలోక ప్రార్థన నేర్పుమయా              ||ప్రార్థన||

    • పరమ దేవుడవని తెలిసి
    • కరము లెత్తి జంటగా మోడ్చి
    • శిరమునువంచి సరిగను వేడిన
    • సుంకరి ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||

    • దినదినంబు చేసిన సేవ
    • దైవ చిత్తముకు సరిపోవ
    • దీనుడవయ్యి దిటముగా కొండను
    • చేసిన ప్రార్థన నేర్పుమయా                 ||ప్రార్థన||

    • శత్రుమూక నిను చుట్టుకొని
    • సిలువపైన నిను జంపగను
    • శాంతముతో నీ శత్రుల బ్రోవగ
    • సలిపిన ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||

    • Praarthana Vinedi Paavanudaa
    • Praartana Maaku Nerpumayaa    ||Praarthana||

    • Sreshtamaina Bhaavamu Goorchi
    • Shishya Brundamuku Nerpithivi
    • Paramuda Ninnu Pranuthinchedamu
    • Paraloka Praarthana Nerpumayaa   ||Praarthana||

    • Parama Devudavani Thelisi
    • Karamu Leththi Jantaga Modchi
    • Shiramunuvanchi Sariganu vedina
    • Sunkari Praarthana Nerpumayaa     ||Praarthana||

    • Dinadinambu Chesina Seva
    • Daiva Chiththamuku Saripova
    • Deenudavayyi Ditamuga Kondanu
    • Chesina Praarthana Nerpumayaa      ||Praarthana||

    • Shathrumooka Ninu Chuttukoni
    • Siluvapaina Ninu Jampaganu
    • Shaanthamutho Nee Shathrula Brovaga
    • Salipina Praarthana Nerpumayaa     ||Praarthana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7091 times