Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మార్గము చూపుము ఇంటికి – Maargamu Choopumu Intiki


    • మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
    • మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)

    • పాప మమతల చేత – పారిపోయిన నాకు
    • ప్రాప్తించె క్షామము
    • పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు
    • పంపుము క్షేమము (2)
    • ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు
    • పుట్టించె ధైర్యము (2)                    ||మార్గము||

    • ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
    • తండ్రిని వీడితి
    • ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ
    • దేహీ నిను చేరితి (2)
    • దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
    • దారిని జూపుము (2)     ||మార్గము||

    • దూర దేశములోన – బాగుందుననుకొనుచు
    • తప్పితి మార్గము
    • తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల
    • తరిమే దారిద్య్రము (2)
    • దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి
    • ధన్యుని చేయుము (2)                  ||మార్గము||

    • అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు
    • ఆకలి బాధలో
    • అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ
    • అలవడెను వేదన (2)
    • అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత
    • ఆశ్రయము గూర్చుము (2)        ||మార్గము||

    • కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు
    • కోపించి వెళ్ళితి
    • కూలివానిగనైన – నీ యింట పని చేసి
    • కనికరమే కోరుదు (2)
    • కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు
    • క్షమియించి బ్రోవుము (2)        ||మార్గము||

    • నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి
    • నాపైబడి ఏడ్చెను
    • నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి
    • నన్నూ దీవించెను (2)
    • నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో
    • సాక్ష్యమై యుండును (2)                    ||మార్గము||

    • Maargamu Choopumu Intiki – Naa Thandri Intiki
    • Maadhurya Premaa Prapanchamo – Choopinchu Kantiki (2)

    • Paapa Mamathala Chetha – Paaripoyina Naaku
    • Praapthinche Kshaamamu
    • Paschaaththappamunondi – Thandri Kshama Koruchu
    • Pampumu Kshemamu (2)
    • Prabhu Needu Siluva – Mukhamu Chellani Naaku
    • Puttinche Dhairyamu (2)        ||Maargamu||

    • Dhaname Sarvambanuchu – Sukhame Swargambanuchu
    • Thandrini Veedithi
    • Dharani Bhogamulella – Brathuku Dhwamsamu Jeya
    • Dehi Ninu Cherithi (2)
    • Dehi Ani Nee Vaipu – Chethuletthina Naaku
    • Daarini Joopumu (2)            ||Maargamu||

    • Doora Deshamulona – Baagundunanukonuchu
    • Thappithi Maargamu
    • Tharalipoyiri Nenu – Nammina Hithulella
    • Tharime Daridryamu (2)
    • Daakshinya Moorthy Nee – Daya Naapai Kuripinchi
    • Dhanyuni Cheyumu (2)           ||Maargamu||

    • Ammukontini Nenu – Adhamudokaniki Naadu
    • Aakali Baadhalo
    • Anyaayamayipoye – Pandulu Saha Veliveya
    • Alavadenu Vedana (2)
    • Adugante Avineethi – Melkoniye Maanavatha
    • Aashrayamu Goorchumu (2)        ||Maargamu||

    • Kodukune Kaadanuchu – Gruhame Cherasaalanuchu
    • Kopinchi Vellithi
    • Koolivaaniganaina – Nee Yinta Pani Chesi
    • Kanikarame Korudu (2)
    • Kaadanaku Naa Thandri – Dikkevvarunu Leru
    • Kshamiyinchi Brovumu (2)       ||Maargamu||

    • Naa Thandri Nanu Joochi – Parugidichoo Ethenchi
    • Naapaibadi Edchenu
    • Nava Jeevamunu Goorchi – Intiki Thodkoni Velli
    • Nannoo Deevinchenu (2)
    • Naa Jeevitha Kathayantha – Yesu Premaku Dharalo
    • Saakshyamai Yundunu (2)          ||Maargamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1850 times