Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు నీ నామామృతము - Yesu Nee Naamaamruthamu


    • యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ
    • మా – దోషములను హరించి మోక్షని
    • వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన           ||యేసు||

    • వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ
    • యెంతో – కీడు జేసిన పాడు వైరిని
    • గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి          ||యేసు||

    • పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ
    • నీ – దాపు జేరిన వారి కందరి
    • కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు         ||యేసు||

    • అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ
    • మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
    • రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు      ||యేసు||

    • అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ
    • నీ – సుందర కరుణామృతము మా
    • డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన        ||యేసు||

    • Yesu Nee Naamaamruthamu Maa – Kentho Ruchi Yayyaa (2) Deva
    • Maa – Doshamulanu Harinchi Mokshani
    • Vaasuluga Jeyutaku – Bhaasura Prakaashamaina       ||Yesu||

    • Vedu Kalaraga goodi Ninu Goni – Yaadu Vaariki (2) Deva
    • Yentho – Keedu Jesina Paadu Vairini
    • Godudo Dananga Vaani – Thaadanamu Jesithivi       ||Yesu||

    • Paapamulu Harimpa Neeve – Praapu Maakayyaa (2) Deva
    • Nee – Daapu Jerina Vaari Kandari
    • Kaapadalu Baapi Nithya Kaapugathi Joopinaavu        ||Yesu||

    • Akshaya Karuneksha Bhuvana – Rakshakaa Neeve (2) Deva
    • Mammu Pakshamuga Rakshinchi Mokshasu
    • Rakshanaku Deeksha Goni – Veekshithulamaina Maaku         ||Yesu||

    • Andamagu Nee Mandiramuna – Bondugaa Memu (2) Deva
    • Nee – Sundara Karunaamruthamu Maa
    • Dendamula Yandu Grolu – Tanduku Sundaramaina         ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 218 times