Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విజయ గీతముల్ పాడరే - Vijaya Geethamul Paadare


    • విజయ గీతముల్ పాడరే
    • క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)
    • వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ
    • నిజ కుమారుని నామమున్
    • హృదయములతో – భజన జేయుచు నిత్యమున్           ||విజయ||

    • మంగళముగ యేసుడే
    • మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను
    • నింగిన్ విడిచి వచ్చెను
    • శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను
    • రంగు మీరగదన – రక్త బలము వలన
    • పొంగు నణగ జేసెను
    • సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ||

    • పాపముల్ దొలగింపను
    • మనలను దన స్వ – రూపంబునకు మార్పను
    • శాపం బంతయు నోర్చెను
    • దేవుని న్యాయ – కోపమున్ భరియించెను
    • పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు
    • పాప యాగము దీర్చెను
    • దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ||

    • సిలువ మరణము నొందియు
    • మనలను దనకై – గెలువన్ లేచిన వానికి
    • చెలువుగన్ విమలాత్ముని
    • ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి
    • కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని
    • సిలువ మోయుచు నీ కృపా
    • రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||

    • Vijaya Geethamul Paadare
    • Kreesthuku Jaya – Vijaya Geethamul Paadare (2)
    • Vrujina Manthati Meeda – Vijaya Michchedu Deva
    • Nija Kumaaruni Naamamun
    • Hrudayamulatho – Bhajana Jeyuchu Nithyamun        ||Vijaya||

    • Mangalamuga Yesude
    • Manaku Rakshana – Shrungamai Mari Nilchenu
    • Ningin Vidichi Vachchenu
    • Shathruni Yudhdha – Rangamanduna Gelchenu
    • Rangu Meeragadana – Raktha Balamu Valana
    • Pongu Nanaga Jesenu
    • Saathaanuni Bal – Krunga Nalipi Cheelchenu         ||Vijaya||

    • Paapamul Dolagimpanu
    • Manalanu Dana Swa – Roopambunaku Maarpanu
    • Shaapam Banthayu Norchenu
    • Devuni Nyaaya – Kopamun Bhariyinchenu
    • Paapamerugani Yesu – Paapamai Manakoraku
    • Paapa Yaagamu Deerchenu
    • Devuni Neethin – Dheerudai Neraverchenu           ||Vijaya||

    • Siluva Maranamu Nondiyu
    • Manalanu Danakai – Geluvan Lechina Vaaniki
    • Cheluvugan Vimalaathmuni
    • Premanu Manalo – Niluvan Jesina Vaaniki
    • Koluvu Jethumegaani – Ilanu Maruvaka Vaani
    • Siluva Moyuchu Nee Krupaa
    • Rakshana Chaala Viluva Galadani Chaatuchu          ||Vijaya||

    •  
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1533 times