Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వినరండి నా ప్రియుని విశేషము - Vinarandi Naa Priyuni Visheshamu


    • వినరండి నా ప్రియుని విశేషము…

    • వినరండి నా ప్రియుని విశేషము
    • నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
    • నా ప్రియుని నీడలో చేరితిని
    • ప్రేమకు రూపము చూసితిని (2)
    • ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
    • తనువంతా పులకించి మహదానందమే       ||వినరండి||

    • మహిమతో నిండిన వీధులలో
    • బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
    • జతగా చేరెదను ఆ సన్నిధిలో
    • కురిసె చిరుజల్లై ప్రేమామృతము
    • నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
    • జతగా చేరెదను ఆ సన్నిధిలో
    • నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
    • కన్నీరు తుడిచేది నా ప్రభువే       ||వినరండి||

    • జగతికి రూపము లేనప్పుడు
    • కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
    • స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    • కృపన్ జయధ్వనితో కీర్తించెదను
    • నా ప్రభు యేసు చెంతన చేరెదను
    • స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    • నా ప్రభు యేసు చెంతన చేరెదను
    • యుగమొక క్షణముగ జీవింతును       ||వినరండి||

    • తలపుల ప్రతి మలుపు గెలుపులతో
    • నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
    • ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    • ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
    • ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    • ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    • ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    • నా ప్రియుని విడువను నేనెన్నడు       ||వినరండి||

    • Vinarandi Naa Priyuni Visheshamu…

    • Vinarandi Naa Priyuni Visheshamu
    • Naa Priyudu (Varudu) Sundarudu Mahaa Ghanudu (2)
    • Naa Priyuni Needalo Cherithini
    • Premaku Roopamu Choosithini (2)
    • Aaha Entho Mansanthaa Ika Aanandame
    • Thanuvanthaa Pulakinche Mahadaanandame      ||Vinarandi||

    • Mahimatho Nindina Veedhulalo
    • Booralu Mroge Aakaasha Pandirilo (2)
    • Jathagaa Cheredanu Aa Sannidhilo
    • Kurise Chirujallai Premaamruthamu
    • Naa Priya Yesu nanu Choosi Dari Cherune
    • Jathagaa Cheredanu Aa Sannidhilo
    • Naa Premanu Priyuniki Thelipedanu
    • Kanneeru Thudichedi Naa Prabhuve      ||Vinarandi||

    • Jagathiki Roopamu Lenappudu
    • Korenu Nannu Thana Koraku Naa Prabhuvu (2)
    • Sthuthine Vasthramugaa Dharinchukoni
    • Krupane Jayadhwanitho Keerthinchedanu
    • Naa Prabhu Yesu Chenthana Cheredanu
    • Sthuthine Vasthramugaa Dharinchukoni
    • Naa Prabhu Yesu Chenthana Cheredanu
    • Yugamoka Kshanamuga Jeevinthunu      ||Vinarandi||

    • Thalapula Prathi Malupu Gelupulatho
    • Niliche Shuddha Hrudayaala Veerulatho (2)
    • Phalamu Prathiphalamu Ne Pondukoni
    • Priya Yesu Raajyamulo Ne Nilichedanu
    • Aa Shubhavela Naakentho Aanandame
    • Phalamu Prathiphalamu Ne Pondukoni
    • Aa Shubhavela Naakentho Aanandame
    • Naa Priyuni Viduvanu Nenennadu      ||Vinarandi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 864 times