Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో నీ ప్రేమ – Siluvalo Nee Prema


    • సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
    • మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
    • ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
    • నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

    • తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
    • నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
    • నను విడిపించుటకు – విలువను విడిచితివి
    • పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

    • దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
    • కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
    • నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
    • మరణము దాటుటకు – బలిగా మారితివి (2)     ||ఘోర పాపిని||

    • అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
    • పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
    • నిను చాటించుటకు – వెలుగై సాగెదను
    • ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2)     ||ఘోర పాపిని||


    • Siluvalo Nee Prema – Paapamu Theesenayyaa
    • Maranamu Cheralo Nundi – Nanu Vidipinchenayyaa (2)
    • Ghora Paapini Nenu – Parishuddhuni Chesithivi
    • Nithya Jeevamulo Nannu – Niluputaku Bali Aithivi (2)    ||Siluvalo||

    • Thaalaleni Nee Thaapam – Tholaginchenu Naadhu Shaapam
    • Naliginatti Nee Roopam – Ichchenu Naaku Swaroopam (2)
    • Nanu Vidipinchutaku – Viluvanu Vidichithivi
    • Paramunu Cherchutaku – Mahimanu Marichithivi (2)     ||Ghora Paapini||

    • Daiva Thanayuni Deham – Mosindi Cheyani Neram
    • Kadigendhuku Naa Dosham – Chindinche Niluvunaa Rudhiram (2)
    • Nanu Kaapaadutaku – Rottegaa Virigithivi
    • Maranamu Dhaatutaku – Baligaa Maarithivi (2)     ||Ghora Paapini||

    • Adhamudainatti Nenu – Nee Prema Arhudanu Kaanu
    • Pogidi Ninnu Prathi Kshanamu – Theerchalenu Nee Runamu (2)
    • Ninu Chaatinchutaku – Velugai Saagedhanu
    • Premanu Panchutakai – Uppuga Nilichedhanu (2)     ||Ghora Paapini||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 134 times