Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? - Sundaramaina Dehaalenno Shithilam Kaaledhaa?


    • సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
    • అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
    • కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
    • ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
    • ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
    • తరచి చూడుము పరికించి చూడము (2)       ||సుందరమైన||

    • నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
    • ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
    • అధికార దాహంతో మదమెక్కిన వీరులు
    • సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
    • తపోబలము పొందిన ఋషులందరూ
    • మతాధికారులు మఠాధిపతులు
    • ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
    • మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
    • యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
    • క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2)       ||సుందరమైన||

    • ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
    • ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
    • పాప సంకెళ్ళలో బందీలైనవారికి
    • ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
    • శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
    • మరో జీవితం లేదనుట భావ్యమా?
    • రక్తము కార్చిన యేసుని విస్మరించి
    • ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
    • యేసులేని జీవితం అంధకార భందురం (2)
    • క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2)       ||సుందరమైన||

    • Sundaramaina Dehaalenno Shithilam Kaaledhaa?
    • Ambaramantina Raajulendharo Alisipoledhaa?
    • Kalamulu Pattina Kavulu Endaro Kanumarugavaledhaa?
    • Dharanilona Dhanikulellaru Dhahanam Kaaledhaa?
    • Edhi Shaashwatham Kaadhedhi Shaashwatham
    • Tharachi Choodumu Parikinchi Choodumu (2)      ||Sundaramaina||

    • Netthuthi Chaaralanu Likhinchina Raajulendharo
    • Aa Netthurulone Praanaalu Vidichipoyaaru
    • Adhikaara Dhaahamtho Madhamekkina Veerulu
    • Samaadhi Lothullone Moogaboyaaru (2)
    • Thapo Balamu Pondhina Rushulandharu
    • Mathaadhikaarulu Mataadhipathulu
    • Ee Kaala Garbhamlone Kalasipoyaaru
    • Marana Pidikallalo Bandheelayyaaru (2)
    • Yesu Leni Jeevitham Vaadabaarina Charitham (2)
    • Kreesthu Unna Jeevitham Bhuvilo Charithaardham (2)      ||Sundaramaina||

    • Praanam Posina Daivaanni Kaadhante
    • Aa Jeevithaaniki Paramaardham Untundhaa?
    • Paapa Sankellalo Bandheelaina Vaariki
    • Aa Divya Moksham Cherukone Bhaagyam Untundhaa? (2)
    • Shareeraanni Vidichina Manushyaathmaku
    • Maro Jeevitham Ledhanuta Bhaavyamaa?
    • Rakthamu Kaarchina Yesuni Vismarinchi
    • Ee Srushtini Poojinchuta Manishiki Nyaayamaa? (2)
    • Yesu Leni Jeevitham Andhakaara Bhandhuram (2)
    • Kreesthu Unna Jeevitham Thejomaya Mandhiram (2)      ||Sundaramaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 151 times